Friday 18 March 2016

Sildenafilcitrate - వయాగ్రా,Viagra ,



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వయాగ్రా,Viagra , Cildenafilcitrate- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పురుషుల్లో స్తంభన లోపాన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సమ్మోహనాస్త్రం వయాగ్రా! .అమెరికా ఎఫ్‌డీఏ దీనికి అనుమతినిచ్చి సరిగ్గా పదేళ్లవుతోంది. ఈ దశాబ్దకాలంలో అంతర్జాతీయంగా ఇది సృష్టించిన సంచలనానికి అంతులేదు.
1998 మార్చి 27న ఎఫ్‌డీఏ అనుమతి పొందిన వయాగ్రా.. ఈ పదేళ్లలో ఎన్నో చర్చలకు.. మరెన్నో సంచలనాలకు కేంద్రబిందువైంది. సరికొత్త పరిశోధనలే కాదు.. ఎన్నో హెచ్చరికలు, వివాదాలు కూడా దీని చుట్టూ ముసురుకున్నాయి. అయినా అంగస్తంభన లోపానికి (ఎరక్త్టెల్‌ డిస్‌ఫంక్షన్‌) సమర్థమైన పరిష్కారంగా పురుష ప్రపంచం రెట్టించిన ఉత్సాహంతో దీన్ని ఆశ్రయించటం చెప్పుకోదగ్గ విశేషం. 1999-2001ల మధ్య ఫైజర్‌ కంపెనీ కేవలం ఈ మాత్ర మీదే ఏటా 100 కోట్ల డాలర్ల వ్యాపారం చేసిందంటే దీనికి లభించిన ఆదరణ ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.


ఒకప్పుడు స్తంభన లోపం వంటి పురుష లైంగిక సమస్యలను చాలా వరకూ మానసిక సమస్యలుగానే పరిగణించి కొట్టిపారేసేవాళ్లు, లేదంటే 'కౌన్సెలింగ్‌' వంటివి ఇచ్చేవారు. అయితే శాస్త్రీయమైన పరిశోధన, అవగాహనలు పెరిగిన కొద్దీ ఈ సమస్యలను కేవలం మానసిక సమస్యలుగా భావించటం సరికాదనీ, వీటికి శారీరకమైన లోపాలు, సమస్యలు కూడా కారణమవుతున్నాయని గుర్తించారు. ముఖ్యంగా హార్మోన్‌ సమస్యలు, దీర్ఘకాలిక మధుమేహం, రక్తనాళాల సమస్యలు, నాడుల పనితీరు తగ్గటం వంటి ఎన్నో అంశాలు స్తంభన పటుత్వాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో పురుషుల లైంగిక సామర్ధ్యాన్ని తక్షణం, తాత్కాలికంగా పునరుద్ధరించటంలో వయాగ్రా ముఖ్యపాత్ర పోషిస్తోందని పలువురు సెక్సాలజిస్ట్‌లు వ్యాఖ్యానిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఎన్నో జంటలు విడాకుల వరకూ వెళ్లకుండా చూడటంలో కూడా వయాగ్రా ముఖ్య పాత్ర పోషిస్తోంది. అయితే దీనితో రకరకాల దుష్ప్రభావాలూ ఉంటాయనీ, వైద్యుల సిఫార్సు లేకుండా దీన్ని తీసుకోవటం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నది నిపుణుల సలహా. ముఖ్యంగా గుండె జబ్బులున్న వాళ్లు దీన్ని వైద్యుల సిఫార్సు లేకుండా తీసుకోకూడదు. అలాగే దీనితో తలనొప్పి, ఒళ్లంతా ఆవిర్లు వస్తున్న భావన, వికారం, కళ్లు ఎర్రబారటం, కాస్త నీలంగా కనబడటం వంటి దుష్ప్రభావాలు ఉంటాయని రకరకాల అధ్యయనాల్లో గుర్తించారు. ఇవేమంత ప్రమాదకరమైనవి కాకపోయినా అవగాహనతో మెలగటం అవసరం. వయగ్రా 25 , 50 మిల్లిగ్రాములలో మాత్రల రూపములో దొరుకుతుంది. ఒకసారి వేసుకుంటే 24 - 48 గంటలవరకూ దీని ఎఫెక్ట్ శరీరములో ఉంటుంది.  అందుకే వారానికి 2 సార్లు వాడితే సరిపోతుంది. 


నిజానికి స్తంభన లోపమన్నది ప్రపంచవ్యాప్త సమస్య. ఒక్క అమెరికాలోనే మొత్తం పురుషుల్లో 10 శాతం మందికి స్తంభన లోపాలున్నట్టు అంచనా. 40-70 ఏళ్ల మధ్య వయసు వారిలో కనీసం సగం మంది దీనితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్‌ వంటి రుగ్మతలు పెరుగుతున్న నేపథ్యంలో స్తంభన లోపమూ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అవసరాన్ని బట్టి వైద్యుల పర్యవేక్షణలో వయాగ్రా వంటి తక్షణ పరిష్కారాలను ఆశ్రయించవచ్చుగానీ సమస్యకు మూలాల్ని గుర్తించి.. చికిత్స తీసుకోవటం మరింత ముఖ్యమని sex specialists గుర్తు చేస్తున్నారు.

  •  మంచి ఆరోగ్యానికి సెక్స్:

    సెక్స్ ఆరోగ్యానికి చాలా ఉత్తమమైనదని పరిశోధకులు తెలిపారు. గుండె జబ్బులకు దూరంగా ఉండాలనుకుంటే క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొనాలని వారు సూచిస్తున్నారు. నిత్యం సెక్స్ లో పాల్గొంటే గుండె జబ్బులు దరి చేరవని మసాచుసెట్స్‌లోనున్న న్యూ ఇంగ్లాండ్ ఇన్స్‌టిట్యూట్‌కు చెందిన శాస్త్రజ్ఞులు తెలిపారు. గుండె జబ్బులను నివారించేందుకు వారంలో కనీసం రెండు సార్లు సెక్స్ చేస్తే పురుషుల్లో దాదాపు 45 శాతం మేరకు గుండె జబ్బులు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. అదే వారానికి ఒకసారి లేదా అంతకంటే తక్కువగా సెక్స్ లో పాల్గొనేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు పరిశోధకులు.

    తమ పరిశోధనలకు నలభై సంవత్సరాల నుంచి డెభై సంవత్సరాలలోపు కలిగిన వ్యక్తులు దాదాపు వెయ్యిమందిని పరీక్షించినట్లు పరిశోధకులు ఇటీవల తెలిపారు. వీరిని పదహారు సంవత్సరాలపాటు పరీక్షించి పరిశోధించినట్లు శాస్త్రజ్ఞులు తెలిపారు. తాము నిర్వహించిన పరిశోధనల్లో ఎవరైతే క్రమంగా తమ భాగస్వామితో సెక్స్ లో పాల్గొన్నారో, వారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు ఏ కోశానా లేకపోవడం గమనార్హం. అదే విధంగా తమ జీవిత భాగస్వామితో నిత్యం ప్రేమ కలాపాలు కొనసాగిస్తూ ప్రేమపూర్వకమైన సంభాషణలు, నిత్యం చిలిపి చేస్టలు కొనసాగించే వారు నిత్యం యవ్వనవంతులుగా కనపడ్డారని పరిశోధకులు తెలిపారు. దీంతో వీరి శరీరంలో వృద్ధాప్యపు ఛాయలు కూడా చాలా వరకు తక్కువగానే కనపడ్డాయని పరిశోధకులు తెలిపారు.
  • దుష్పరిణామాలు : 
    వయోగ్రా వాడకం వల్ల తలనొప్పి, చూపు లోకొంచము మార్పు కనిపించడము , రక్తపోటుతగ్గడము  వంటి సమస్యలు చుట్టముడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అంగస్తంభన కలిగించడంలో వయాగ్రా సత్ఫలితాన్నిస్తున్నప్పటికి తరువాత చోటుచేసుకుంటున్న పరిణామాల పై భయాందోళనలు అవసరములేదు .. వయోగ్రాను వాడదలుచుకున్న వారు ఒకసారి వైద్యలను సంప్రదించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.గుండె జబ్బులున్నవారు , గుండెపోటు కోసము మందులు వాడుతున్నవారు వయగ్రా ను వాడరాదు .

    సాధారణంగా వయసు పైబడిన వారికి ‘వయాగ్రా’ను ప్రిస్ర్కైబ్ చేస్తారు వైద్యులు. కాని తాజా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వివాహమైన తొలిదినాల్లో మరింత రంజు కోసం ఈ వయగ్రా ను వాడుతున్నవారు ఉన్నారు. అలా వాడకూడదు. అదే అలవాటుగా మారి మానసికం గా వయగ్రా లేకుండా సెక్ష్ చేయలేమోనని ''పోభియా'' కి లోనవుతారు.
    కొంతమందికి ఉదరకోశం పూతకు లోనై గాస్టిక్ సమస్యలకు దారితీయును. వయగ్రా వాడిన వారిలో కొంతమందికి పని పూర్తి అయినా అంగపరిమానము సాధారణ స్థితికి రాకపోడము (priapism) జతుగుతూ ఉంటుంది . ఇది అందోళన కరమైన సైడు ఎఫెక్ట్ . వైద్యుని సంప్రదించాలి.

No comments:

Post a Comment