Tuesday, 22 March 2016

Hair Dyeing - జుట్టు కు రంగు వేయడం




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hair Dyeing , జుట్టు కు రంగు వేయడం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

అందమైన కురుల కోసం ఆరాటపడని అతివ ఉండదంటే అతిశయోక్తి కాదు. నల్లని నిగనిగలాడే పొడవాటి కురులతో మరింత సొగసును సంతరించుకోవాలని ప్రతి యువతి ఆశపడుతుంటుంది. అయితే, పిరుదులు దాటి చకచకలాడే అందమైన జడ ఇప్పుడు ఎక్కడో కాని కనిపించడం లేదు. అన్ని బాబ్డ్‌ హెయిర్‌ స్టైల్సే! సరే, ఆధునిక సమాజంలో అటువంటి జడలను యువతులు ఇష్టపడకపోయినా, కనీసం పట్టువలె మెత్తగా ఉండాలని కోరుకుంటారు. కాని, రెండు పదుల వయసు వచ్చేసరికే కొందరి కురులు తెల్లబడిపోతున్నాయి. దీంతో రకరకాల పద్ధతుల ద్వారా వెంట్రుకలను రకరకాల రంగుల్లోకి మార్చేసుకుని తృప్తి పడుతున్నారు. మొట్టమొదటి తెల్ల వెంట్రుక కంటపడగానే విలవిలలాడిపోతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ కురులను కాపాడుకోవాలని పరి తపిస్తుంటారు. ఎంత వ్యయం కైనా వెనుకాడకుండా వాటిని నల్లబరిచేందుకు ప్రయత్నిస్తారు. వయసు పెరిగే కొద్దీ తెల్ల వెంట్రుకల బారి నంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే, జీవితాంతం తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండే 'డై' ఏదైనా ఉంటే బాగుండునని ఆశపడుతుంటారు. కాని, సైన్స్‌ ఫిక్షన్‌లో మాత్రమే అది సాధ్యమనుకుంటారు. ఒకవేళ అదే నిజమైతే?!

అవును! ఇప్పుడు జీవితాంతం తెల్ల వెంట్రుకల బాధ లేకుండా చూసేందుకు శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా కృషి చేస్తున్నారు. మరో పదేళ్లలో అది సుపాధ్యం చేస్తామంటున్నారు. అప్పుడిక అతివలకు హెన్నా, 'డై'ల బాధ తప్పిపోతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఐరోపా దేశాల్లో అతివలకు సాధారణంగా 34 సంవత్సరాల వయసులో మొట్టమొదటి తెల్ల వెంట్రుక వస్తోంది. అలాగే, ఆసియాలో ఆసియాలో 39 ఏళ్లకు, ఆఫ్రికాలో 44 ఏళ్లకు తెల్లవెంట్రుకలు రావడం మొదలవుతోంది. వెంట్రుకలు కూడా ఒక పీచు పదార్ధం వంటిదే. భౌతిక పదార్ధాలతోనే ఇవి నిర్మాణమై ఉంటాయి. వీటికి జీవం ఉంటుంది. వయసును బట్టే పెరుగుతాయి. కొన్నాళ్లకు తెల్లబడతాయి. ఆ తర్వాత రాలిపోతాయి. దీన్ని ఎలా ఎదుర్కొనాలి? భౌతికంగానా? లేక జీవరసాయనాలతోనా? ఇదే టాపిక్‌పై పారిస్‌లో కొన్నేళ్లుగా శాస్త్రజ్ఞులు పరిశోధనలు సాగిస్తున్నారు. 'లారియల్స్‌' అనే పరిశోధనా సంస్థ గత ఏడాది 581 మిలియన్‌ పౌండ్లను ఖర్చు పెట్టింది.

చర్మం వలెనే వెంట్రుకలు కూడా మెలనొసైట్స్‌ అనే కణాలను కలిగి ఉంటాయి. ఇవే వెంట్రుకల రంగును నిర్ణయిస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఈ కణాలు వెంట్రుకల్లో తగ్గిపోతాయి. అందువల్లే తెల్లరంగుకు వచ్చేస్తాయి. అయితే, వెంట్రుకల్లో ఏ కొద్ది మొత్తంలో మెలనొసైట్స్‌ మిగిలి ఉన్నా తిరిగి వాటిని వృద్ధి చెందించడం ద్వారా మళ్లిd వెంట్రుకలు నల్లబారేట్టు చేయవచ్చునని లారియల్స్‌ సంస్థ పరిశోధనా సంబంధాల సంచాలకులు పాట్రీసియా పినే చెబుతున్నారు. నోటి ద్వారా తీసుకునే మందుతో పాటు హెయిర్‌ కేర్‌కు సంబంధించిన పలు ఉత్పత్తులను త్వరలోనే విడుదల చేస్తామని అంటున్నారు.

నడి వయసు దాటిన తర్వాత ఇక వెంట్రుకలకు రంగు ఎందుకులే అని అతివలు హెయిర్‌ కేర్‌లను వాడడం మానేస్తే కోట్లాది రూపాయిల వ్యాపార సామ్రాజ్యాలు ఏం కావాలి? అందుకే లారియల్స్‌ భారీ వ్యయంతో దీనిపై పరిశోధనలు చేస్తోంది. అలాగే, పదేపదే హెయిర్‌ డైయింగ్‌ వల్ల కురులు దెబ్బతింటున్నాయి. దీన్ని అరికట్టేందుకు మరో పరిశోధనలో లారియల్స్‌ విజయం సాధించింది. అమ్మోనియా కలిసిన డైల వల్ల కురులు దెబ్బ తినడమే కాకుండా పెళుసుగా తయారవుతాయి. అలాగే, ఘాటైన వాసన కూడా ఇబ్బంది కలిగిస్తుంటుంది. 'డై' పనిచేసేముందు వెంట్రుకల సహజ రంగును అమ్మోనియా తొలగిస్తుంది. ఇది అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ, వెంట్రుకల సహజత్వన్ని దెబ్బతీస్తోంది. దీన్ని నివారించేందుకు లారియల్‌ అమ్మోనియా లేని హెయిర్‌ డైని కనిపెట్టింది. దీనికి ఐఎన్‌ఒఎ (ఇన్నోవేషన్‌ నో అమ్మోనియా' అని పేరు పెట్టింది. దీన్ని వినియోగించడం వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోవని, పైగా మరింత పటుత్వాన్ని పెంచుకుంటాయని సంస్థ చెబుతోంది. ఈ తాజా డైని ఇటీవలే మార్కెట్‌కు విడుదల చేసింది కూడా. అమ్మోనియా కలిసిన డైల వల్ల కొంత కాలానికి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తాజాగా కనిపెట్టిన డై వల్ల అటువంటి ప్రమాదం ఉండదు. హాలీవుడ్‌లో సెలబ్రిటీలు అందరూ ఇప్పుడీ తాజా డైని విరివిగా చేయించుకుంటున్నారు. బ్రిటన్‌లోని బ్యూటీపార్లర్లు కిటకిటలాడుతున్నాయి.

Hair dye side effects : 
రంగులను వాడటం వల్ల అప్పటికి చూడటానికి అందంగా వున్నా తరువాత జుట్టుకు భవిష్యత్తు లేకుండా పోతుంది. హెయిర్‌డైలో కొన్ని హానికారకాలైన రసాయనాలను వాడుతుంటారు. వీటివలన ఆరోగ్యానికి కీడే తప్ప మేలు అంటూ ఏదీ లేదు. పర్మనెంట్ హెయిర్ కలర్ లేదా డై‌లలో పైరాఫినిలేటిడ్ పిపిడి అనబడే రసాయనాన్ని వీటిలో కలుపుతుంటారు. ఈ పిపిడి వలన వెంట్రుకలపై రంగు చాలా రోజులవరకు ఉంటుందనేది వాస్తవం. కాని మీ వెంట్రుకల పరిస్థితిని కూడా దృష్టిలో వుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాకుండా వీటివలన చర్మంపై ప్రభావం పడుతుంది .
పిపిడికి సంబంధించిన వ్యాధులబారిన పడక తప్పడంలేదు. వెంట్రుకలు రాలిపోవడం, కళ్ళు, చెవులు, తలపైనున్న చర్మం, ముఖంపైనున్న చర్మంపై దీని ప్రభావం వుంటుంది . కొన్నిసందర్భాలలో పిపిడి రియాక్షన్‌కు కూడా దారితీస్తుంది. దీంతో రియాక్షన్ బారిన పడినవారిని ఆసుపత్రిలో చేర్పించిన సందర్భాలుకూడావున్నాయి.

ఓవైపు హైయిర్ కలర్, హెయిర్ డై తయారు చేసే కంపెనీలు హెచ్చరికల ప్రకటన వారిచ్చే ప్రిస్క్రిప్షన్‌లో పొందుపరిచేవుంటారు. కాని చాలవరకు దీనిని వాడేవారు పెద్దగా పట్టించుకోరు. అలాగే టాటూ లేక కాలీ మెహిందీలో పిపిడి కలిసివుంటుంది. ఇది చాలా హానికారకమైంది.

No comments:

Post a Comment