తల్లి కడుపులో ఉన్నప్పుడే మఒదలవుతుంది దంతాలు యేర్పడడము . పాలపళ్ళు రాలిపోయి శాశ్వితపళ్ళు యేర్పడిన తరువాత వాటి ప్ర్రాముఖ్యత పెరుగుతుంది . పళ్ళు ఉపయోగాలు :
- స్పష్టముగా మాట్లాడేందుకు ,
- ఆహారము నమిలి మింగేందుకు ,
- అందము గా నవ్వేందుకు ,
- ఆకర్షణీయమైన ముఖ అందానికి ,
చిన్నపిల్లలకి, ఆరునెలల వయస్సు నుంచి పాలపళ్లు రావడం మొదలవుతుంది. పళ్లు చిగురును చీల్చుకొని వచ్చేటప్పుడు, పంటి చుట్టూ ఉన్న చిగురులో కొంత దురద వంటి 'ఇరిటేషన్' వుంటుంది. అందువల్ల చంటి పిల్లలు ఏ వస్తువు దొరికినా నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంటారు. అంతేకాక చిన్న పిల్లలకి, చేయి-నోరు, సమన్వయం కూడా అప్పుడప్పుడే అలవడుతూ వుంటుంది. అందుకే అందిన ప్రతి వస్తువు నోట్లో పెట్టుకొంటారు. ఈ విధంగా నోట్లో పెట్టుకొన్న వస్తువు పరిశుభ్రంగా లేని పక్షంలో, దానిని అంటి ఉన్న సూక్ష్మక్రిములు లోపలికి వెళ్ళి పిల్లలకి విరేచనాలు కావడం సహజం' అని సరిపెట్టుకోక, పిల్లల వస్తువుల విష యంలో శుభ్రత పాటించాలి.
శరీర ఆరోగ్యంపై దంత వ్యాధులు, తమ ప్రభావం చూపించకుండా ఉండాలంటే, అసలు దంతవ్యాధు లు రాకుండా జాగ్రత్తపడాలి. రాత్రి పడుకొనే ముందు, ఉదయం లేచాక బ్రష్‌తో దంత ధావనం చేయాలి. ఏదైనా తిన్నవెంటనే తిన్న ఆహారం పళ్లల్లో ఇరు క్కోకుండా పుక్కిలించి ఉమ్మి వేసే అలవాటు చేసుకోవాలి. పోష కాహారం పట్ల మక్కువ చూపించాలి. ఆరునెలల కొకసారయినా దంతవైద్య పరీక్షలుచేయించుకోవాలి. దీనివల్ల అవసరాన్నిబట్టి అప్పటికప్పుడు చికిత్స చేయించుకొనే అవకాశం ఏర్పడుతుంది. గర్భిణి స్త్రీలు, పెరుగుతున్న పిల్లలు, తీసుకొనే ఆహారంలో 'కాల్షియం' ఉంటే, వచ్చే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి పిల్లలకి తినే ఆహారం విషయంలోను, బ్రష్ చేసు కొనే విధానంలోను మంచి అలవాట్లు నేర్పించాలి. మన దంతాలు ఆరోగ్యంగా ఉంటే, మన శరీరం ఆరోగ్యం కూడా బావుంటుంది. దంతాలు కూడా మనిషి శరీర భాగాలలో ముఖ్యమయినవి, దంత వ్యాధులను నిర్లక్ష్యం చేసినట్లయితే, శరీర ఆరోగ్యానికే ప్రమాదమన్న విషయం గుర్తించగలిగితే, దంత వ్యాధులు రాకుండా జాగ్రత్తపడే అవకాశాలు అధికంగా ఉంటాయి.
- దంత సంరక్షణలో స్కేలింగ్:
జీవితాంతం దంతాలను ఆరోగ్యంగా ఉంచు కోవడాన్ని 'దంతసంరక్షణ' అనవచ్చు. మనం ప్రతిరోజు తీసుకొనే ఆహార పదార్థాలను, మెత్తగా నమలడానికి (మాస్టికేషన్) ముఖం అందంగా కన్పిం చడానికి (ఈస్థటిక్స్), చక్కని మాట స్పష్టత కోసం (ఫోనేషన్) ఉప యోగపడే మన దంతాల సంరక్షణ పంటి చిగుళ్ల ఆరోగ్యంమీద, దంత పరిశుభ్రతమీద, నోటి పరిశుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడింటిలోను దేనివల్ల లోపం జరిగినా, లేదా ఈ మూడింటి వల్ల లోపం జరిగినా అతి తక్కువ వయస్సులోనే దంతాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.
మన నోటిలో సహజంగా ఊరే 'లాలాజలం'లో, 'మ్యూసిన్' అనే జిగట పదార్థం ఉంటుంది. ఇది పళ్లమీద సన్నని ఫిల్ముమాదిరిగా అతు క్కొనిపోయి వుంటుం ది. దీనినే మనం 'పాచి' (ప్లేక్) అంటాం. నిత్యం సరయిన దంతధావనం లేకపోవడం వల్ల, ఈ పాచి రోజురోజుకు పొరలు పొర లుగా పేరు కొనిపోయి, గట్టి పదార్థంగా మారిపోతుంది. ఇలా గట్టిగా మారిన పాచినే 'గార' లేక 'టార్టార్' లేక 'కాల్‌క్యులస్' అంటారు. ఇది ఒక్కొక్కరిలో ఒక్కో మాదిరిగా కన్పిస్తుంటుంది. కొందరిలో, పంటి భాగానికి చిగురు భాగానికి సరిహద్దుగోడగా సన్నని గీత మాదిరిగా కన్పిస్తుంది. ఇది నల్లగాగాని, ముదురు గోధుమ రంగుగా గాని, కన్పిస్తుంది.
చిన్నపిల్లల దంతాల జాగ్రత్తలు, Care about teeth of children :
చిన్న పిల్లల దంతాలపై చాలామంది అంతగా శ్రద్ధ పెట్టరు. పాల పళ్ల ప్రాముఖ్యాన్ని అసలే పట్టించుకోరు. నిజానికి దంతాలు రావటం మొదలైనప్పటి నుంచే శుభ్రతను పాటించటం తప్పనిసరి. లేకపోతే దంతక్షయం దాడి చేసే ప్రమాదం ఉంది. చిన్న పిల్లలనే కాదు.. యుక్తవయసువారినీ దంతక్షయం అధికంగా వేధిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరేడేళ్ల వయసు వచ్చేసరికే 40 శాతం మంది పిల్లలు దంతక్షయంతో బాధపడుతున్నట్టు అంచనా. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటం అత్యవసరం.
- పాలపళ్లనూ తోమాలి:
- నిద్రలో పాలసీసా ప్రమాదం:
- కప్పులో పానీయాలు వద్దు:
- పడుకున్నప్పుడు తేనెపీకలా?
No comments:
Post a Comment