Thursday, 31 March 2016

Breast Cancer in Male - మగవారికి బ్రెస్ట్ క్యాన్సర్


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మగవారికి బ్రెస్ట్ క్యాన్సర్, Breast Cancer in Male-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనము అనేక చోట్ల విన్నాము . కానీ ఈ మధ్యకాలములో అత్యంత అరుధైన దదిగ్బ్రాంతికరమైన విషయము వెలుగుచూసింది . ... అదే మగవారిలో రొమ్ము క్యానసర్ . మొత్తము రొమ్ము క్యాన్సర్ కీసులలో మగవారి రొమ్ము క్యాన్సర్ కేవలము 1% మాత్రమే అయినప్పటికీ ఇద్ ఆశ్చర్యపరిచే విషయము . మగవారికి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఇతిమిద్దము గా నిర్ణయించడం సాధ్యము కావడము లేదు . మగవారిలో 60 – 70 సం.ల వయసు ఉన్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వ్యాధి ఏ వయసులో వారికైనా రావచ్చు.


ఈ వ్యాధి మగవాళ్ళకు రావడానికి గల కారణాలు:

  • జన్యుపరమైన, వాతావరణపరమైన అంశాలు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
  • ఛాతీ ప్రాంతంలో ఎక్కువ రేడియేషన్ కు గురి అయిన వారికి వస్తుంది.
  • ప్రోస్టేట్ చికిత్సలో భాగంగా “ఫినాస్టిరాయిడ్” వంటి మందులను వాడి నప్పుడు ఈ వ్యాధి వస్తుంది.
  • అనువంశీకముగా ఆడవారిలో "bi.ఆర్.సి.ఎ 2 " అనే జన్యువు సంక్రమించినట్లైతే ... మగవారిలో 15% వరకు "బి.ఆర్.సి.ఎ 2 " జన్యువే కారణమని చెప్పవచ్చును .
  • ఫీమేల్ హార్మోన్‌ అయిన " ఈస్ట్రోజన్‌ " స్థాయి మగవారిలో ఎక్కువ ఉంటే కూడా రొ్మ్ము క్యాన్సర్ రావచ్చును .సాదారణము గా ప్రతి మగవాడిలోను స్వల్ప పరిమాణములో ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి అవుతుంది . . కొంతమంది లో ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుండడము వలన మగవారిలో రొమ్ము పరిమాణము పెద్దవిగా ఉండడము , ఊబకాయము రావడము .... ఈ రొమ్ము కాన్సర్ కి కారణము .

ఈ వ్యాధి లక్షణాలు:

  • ఛాతీ దగ్గర ఉన్న చనుమోనల కింద దళసరిగా కంద పెరిగినట్లైతే క్యాన్సర్ వచ్చిందని గుర్తించాలి.
  • చనుమొనలు ఎర్రగా మారడం, సొట్టలు పడి ఉండటం, రక్తం లేదా రసి కారడం వంటివి జరుగుతుంటాయి.
  • ఒక్కోసారి చంకలలో గడ్డలు కూడా వ్యాపించ వచ్చు.
  • క్యాన్సర్ సాధారణము గా ఒక రొమ్ముకే వస్తుంది . అరుదుగా రెండు రొమ్ములుకు వస్తుంది .
ఎలా గుర్తించడము : 
ఆదవారిలో కంటె మగవారి రొమ్ములు చిన్నవిగా ఉండాయి కాబట్టి సులువుగా గడ్డలను గుర్తించవచ్చును. మగవారిలో ఇతర కండరాలకు , చెంకలో లింఫ్ గ్రందులకు సునాయాసము గా వ్యాపించడము జరుగుతుంది .. ఇట్టె గుర్తించవచ్చును . సి.ఏ.టి.,- పి.ఇ.టి.సి.టి., -యం.ఆర్.ఐ., -బయోస్పీ వంటి పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చును. 

ఈ వ్యాధి యొక్క చికిత్స:
స్త్రీల రొమ్ము క్యాన్సర్ చికిత్సలాగనే మగవారి లో క్యాన్సర్ ను నిర్ధారించిన తరువాత సాధారణంగా ‘రాడికల్ మాసక్టమి’ ద్వారా క్యాన్సర్ కు గురైన కణాలను తొలగించవచ్చును.
కిమోథెరపి, రేడియేషన్ వంటి వివిధ చికిత్స పద్ధతులను కూడా ఉపయోగిస్తారు.
క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఉండటానికి ‘హర్ సెప్టిన్’ వంటి కొన్ని ప్రత్యేక మందులు క్యాన్సర్ కణాలను గుర్తిస్తాయి. వీటిని ఇతర ట్రీట్ మెంట్ పద్ధతులతో కలిపి వాడటం వలన తక్కువ సైడు ఎఫెక్ట్స్ తో మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు.
మగవారిలో రొమ్ము క్యాన్సర్ అరుదైనది అయినప్పటికీ తొందరగా గుర్తించడము ముఖ్యము . వ్యా ధి మొదటిలో 96% వరకు నివారించవచ్చును . ఆలస్యము అయినకొద్దీ ఇతర బాగాలకు వ్యాపించడము వలన చికిత్స కస్టమవుతుంది .

No comments:

Post a Comment