ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్లకు చికిత్స(Kidney infection)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మూత్ర వ్యవస్థ అంటే మూత్రపిండాలు, మూత్రా శయం, మూత్రనాళాలకు సంబంధించిన వ్యాధులు బ్యాక్టీరియా వలన సోకే ఇన్‌ఫెక్షన్ కారణంగా వస్తాయి.
మూత్రపిండాలకు ఇన్‌ఫెక్షన్ రావడానికి అనేక కారణాలున్నాయి. శరీరంలో ఇతరభాగంలో ఇన్ ఫెక్షన్ సోకడం, చీముగడ్డలు, టిబి, టాన్సిల్స్, గ్రంథులకు సోకే ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరడం మొదలైన కార ణాల వలన వీటికి ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి.
అలాగే గర్భాశయంనుంచి మూత్రపిండాలకు ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందడం వలన కూడా అవి దెబ్బతింటాయి.
ఇతర కారణాలలో మూత్రం వెలుపలికి వెళ్లవ లసిన దారిలో రాళ్ల వలన కానీ, ఇతరత్రా కాని అడ్డంకులు ఏర్పడటం వలన వచ్చే ఇన్‌ఫెక్షన్, ఊపిరితిత్తులకు టిబి సోకడం వలన మూత్ర పిండాలకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశాలున్నాయి.
ఇవేకాక పుట్టుకతో వచ్చే ఇన్ఫెక్షన్ల వలన కూడా మూత్రపిండాలకు వ్యాధులు సోకడానికి కారణమవుతున్నాయి.
మూత్రవ్యవస్థలో ఇన్‌ఫెక్షన్ సోకడం మహిళ లలో, చిన్న పిల్లల్లో సర్వసాధారణంగా కనిపి స్తుంది. చిన్న పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాల వలన మూత్రవ్యవస్థకు ఇన్‌ఫెక్షన్ సోకుతుంది.
మహిళల్లో రజస్వల సమయంలోనూ, ప్రసూతి సమయంలోనూ ఇన్‌ఫెక్షన్ సోకే అవ కాశం ఉంది.
భాదలు :
మూత్ర వ్యవస్థకు ఇన్‌ఫెక్షన్స్ సోకడం వలన తొలిదశలో రోగి
- తలనొప్పితో బాధపడటం,
- ఆకలి లేకపోవడం వంటి లక్షణాలతో బాధపడు తుంటాడు. దీనితోపాటు
- కడుపులో నొప్పి ఉంటుంది. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉండి కడుపు మధ్యభాగంనుండి కిందికి తొడ వరకూ పాకుతుంది. దీనితోపాటు
- జ్వరం ఉంటుంది.
- ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయటం,
- మూత్రంలో మంట ఉంటాయి.
- స్త్రీలలో నాలుగు నుంచి ఆరు నెలల గర్భిణీ దశలో ఇన్‌ఫెక్షన్ వలన చీము సోకుతుంది. అటువంటి సంద ర్భాలలో ఒక్కొక్కసారి అబార్షన్ జరుగవచ్చు.
చిన్నపిల్లల్లో పుట్టు కతో వచ్చే ఇన్ఫెక్షన్ల వలన మూత్రపిండాలు పూర్తిగా పాడయి పోవచ్చు. పిల్లల్లో ఆకలి లేకపోవడం, సరిగ్గా ఎదుగుదల లేకపోవడం, జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటాయి.
అలాగే మూత్ర విసర్జన సమయంలో నొప్పి వలన ఏడవడం, కడుపు నొప్పి మొదలైన లక్ష ణాలు కనిపిస్తాయి. రోగి చెప్పే లక్షణాలతోపాటు మూత్రపరీక్ష, రక్తపరీక్షల ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించవచ్చు.
అవసరానుగుణంగా ఐవిపి, స్కానింగ్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
చికిత్స:
మూత్రవ్యవస్థకు ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు రోగి
- ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి.
- ఎక్కువగా నీరు, తదితర ద్రవ పదార్థాలను తీసుకోవాలి-Alakaline citrate (Alkasal)10 ml mixed with 100 ml of water 3 times / day for 6-7 days.
- ఇన్‌ఫెక్షన్ తగ్గడానికి రోగికి యాంటిబయాటిక్ మందులను--Tab.gatifloxacin+Ornidazole(GTO-tabs)1 tab 2 times /day for 6-7days,
- నొప్పి తగ్గడానికి మందులను ఇవ్వాల్సి ఉంటుంది.tab.urospas 1 tab 3 times /day 6-7 days.
No comments:
Post a Comment