Thursday 24 March 2016

Ear problem in children and Treatment - చిన్నపిల్లల్లో చెవి సంబంధ వ్యాధులు-చికిత్స


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చిన్నపిల్లల్లో చెవి సంబంధ వ్యాధులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

              
చిన్నపిల్లల్లో చెవి సంబంధ వ్యాధులు ప్రధా నంగా మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్స్‌ కారణంగా వస్తాయి. అవి - అక్యూట్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమే షన్‌, క్రానిక్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌, అక్యూట్‌ సప్పురేటివ్‌ ఒటైటిస్‌ మీడియా, క్రానిక్‌ సప్పు రేటివ్‌ ఒటైటిస్‌ మీడియా.చెవి ఇన్‌ఫెక్షన్లు జలుబు చేయడం వలన, మధ్య చెవిలో నీరు ఉండిపోవడం వలన (సరిగ్గా స్నానం చేయనప్పుడు), చల్లగాలిలో చిన్న పిల్లలను పడుకోబెట్టడం వలన వస్తాయి. కొన్నిసార్లు టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, పంటి నొప్పి వలన కూడా చెవిపోటు రావచ్చు.

లక్షణాలు:

చెవి నొప్పి రాత్రిపూట ఎక్కువగా వస్తుంది. పాలు తాగలేరు. ఏడుస్తారు.చెవిలోపల ఎర్ర బడి, ముట్టుకుంటే నొప్పిగా ఉంటుంది. చాలా సార్లు నొప్పి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు జ్వరం కూడా రావచ్చును. మీజిల్స్‌, డిఫ్తీరియా వ్యాధులతో పాటు చెవి బాధలు రావచ్చును. మెడ దగ్గర సర్వైకల్‌ గ్రంథులు పెద్దవవుతాయి. తలనొప్పి, గొంతు నొప్పి ఉండవచ్చును. అక్యూట్‌ కేసుల్లో తరువాత చెవినుండి చీము కారవచ్చును. సరైన సమయంలో తగిన చికిత్స చేస్తే ఒటైటిస్‌ మీడియాను పూర్తిగా నయం చేయవచ్చును.

క్రానిక్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌లో చెవుడు వస్తుంది. స్థానికంగా నొప్పి ఉండదు.చెవిలో చీము ఉండదు. జలుబు చేసినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చెవిలో వినికిడి తగ్గుతుంది. చెవిలో శబ్దాలు వస్తాయి. గుటక వేస్తే చెవిలో శబ్దం వస్తుంది. మాట్లాడుతూ ఉంటే ప్రతిధ్వని వినిపిస్తుంది. కొన్నిసార్లు చెవిలోపల దురదగా ఉంటుంది. కొంతమందిలో చెవిలో నీరు ఎండిపోయి నట్లు ఉంటుంది. ఇటువంటి కేసులు చికిత్సకు తొందరగా స్పందించవు. కుటుంబంలో పెద్దవారికి ఇటువంటి సమస్య ఉంటే, వారికి కూడా కొంతకాలం తరువాత పూర్తిగా చెవుడు వస్తుంది. ఈ రోగుల చెవులను ద్రవరూపంలోని మందులతో శుభ్రం చేయకూడదు. కొన్నిసార్లు అది ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా కలుగజేస్తుంది.

అక్యూట్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌లో చెవిపోటు ముఖ్యమైన వ్యాధి లక్షణం కనుక నొప్పిని తగ్గించే మందు లను వాటి రోగ లక్షణాలను అనుసరించి ఉపయోగించవచ్చు. క్రానిక్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌లో కాన్‌స్టిట్యూషనల్‌ మందులను వాడితే చెవిటితనాన్ని తగ్గించవచ్చు.

అక్యూట్‌ సప్పురేటివ్‌ ఒటైటిస్‌లో చెవిలో చీమును శుభ్రం చేసి దూది పెట్టాలి.

ఔషధాలు:Ear Drops: " Dreps" or zenflox-D 3-drops 3 time / day
for pain : tab. combiflam / syp combiflam paediatric dose 3 tims /day for 3-4 days.
antibiltic: Tab Elfi/cefexime kid 3 tab /day. or azithromycin kid 3 tab /day for 3-4 days

ఇంకా తగ్గక పోతే డాక్టర్ని కలవాలి.

No comments:

Post a Comment