Wednesday, 23 March 2016

Self Generated five enimies to Health - ఆరోగ్యానికి ఐదు స్వయంకృత శత్రువులు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఆరోగ్యానికి ఐదు స్వయంకృత శత్రువులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

అనాదినుండి మానవజీవనం ఆరోగ్యముగా ఉండాలని , శరీరము , ఆత్మ అందం గా ఉండాలని మానవుని ఆకాంక్ష . అందరూ కోరుకునేది అందమైన ఆరోగ్యము . అసలు అందమంటే ఏమిటి ? . రంగును బట్టిగాని , ఆకారాన్ని బట్టిగాని , పొడవును బట్టిగాని అందాన్ని నిర్వహించలేము. పురాణాలలో నల్లదైన ద్రౌపతి , సినిమాల్లో నల్లదైన వాణిశ్రీ అందమైన స్త్రీలుగా గుర్తించబడ్డారు . వారి వారి ఆరోగ్యమే అందానికి కారణము . అందుకే ఆరోగ్యం మహాభాగ్యమన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మహా గొప్పలు చెబుతాము.జీవ ప్రక్రియలో అసమతుల్యమే అనారోగ్యానికి హేతువు. చక్కని శరీర పౌష్టవం,మంచి ఆరోగ్యం మన సొంతం కావాలంటే కొన్ని ఆరో గ్య నియమాలు పాటించాలి.నియమం అంటేనే మనం హడలిపోతాం. ఎందు కంటే మనం బద్దకస్తులం కనుక.ఆరోగ్యానికి మొదటి శత్రువు బద్దకమేనని గుర్తిం చండి. ఒక్క ఆరోగ్యమే కాదు అన్ని రంగాలలో బద్దకం అందరికి శత్రువే. ఈ బద్ద కాన్ని బద్దలుకొట్టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఆరోగ్యానికి ఐదు సూ త్రాలు పాటించాల

1. బద్దకం , 2. బరువు పెరగడం ,3. కోపము , 4. అతిగా నిద్రపోవడం ,5. నిద్రలేకపోవడం ,

బద్దకము : బద్దకం చెడు దరిద్రం అంటారు పెద్దలు . ఎప్పుడు , దేనికీ బద్దకించకూడదు . సూర్యోదయానికి ముందుగా లేచి మీ అనుకూల సమయాన్ని ఎంచుకొని ప్రతి రోజు క్రమం తప్పకుండా అదే సమయానికి లేవడం. శారీరక వ్యాయామం, మీకు తెలిసిన ఆసనాలు,వాకింగ్‌ వంటి ప్రక్రియలు రోజుకు కనీసం గంట అయినా చేయాలి. వీటికోసం సమయం లేదనేవారు చాలామందే ఉన్నారు. వీరంతా బద్దకం చేతిలో బందీలైనవారే. శరీరం సమర్థవంతంగా పనిచేసేం దుకు తగుపాళ్ల లో పిండి పదార్థం, మాంస కృత్తులు, కొవ్వు, విటమిన్లు, మినరల్స్‌ తీసుకోవాలి. వీటిలో తృణ దాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పా లు, డ్రైప్రూట్స్‌, సీజనల్‌ పండ్లు విరివిగా తీసుకోవాలి. బద్దకించి ఈ బేలెన్స్ ను తప్పకూడదు . మంచినీరు భాగా తాగాలి. రోజుకు నాలుగు లీటర్ల పైగా తీసుకోవాలి. మద్య, ధూమపానం సరదాకు అలవాటైతే వాటిని దూరం చేసు కోవటం కష్టమైన పని. దీనివలన జీవన మాధుర్యాన్ని కోల్పోతామని గ్రహించాలి. దైనందిన జీవితంలో విశ్రాంతి ప్రధానమైంది. పని చేయకుండా ఉండటం సుఖ మని చాలామంది అనుకుంటారు. పని చేయకపోవటం అనారోగ్యానికి చిహ్నం. అతిగా పనిచేయటం ఆరోగ్యానికి హానికరమే.కనుక శరీరం అనుమతించిన మేరకు పనిచేసి విశ్రాంతి తీసుకోవాలి.

బరువు పెరగడం : అధిక బరువు పెరుగుట లేదా ఊబకాయము అనారోత్యాల జాబితాలలో అతిముఖ్యమైనది . బరువు అతిగా తినడం వలన , సరియైన శరీరక వ్యాయామము లేకపోవడం వలన , బద్దకము వలన , కొన్ని శారీక అనువంశిక వ్యాధులవలం సంభవిస్తుంది. మూలకారణము తెలుసుకొని తగినవిధము గా మన జీవనవిధానమును మార్చుకోవాలి. అవసరమైతే తగిన వైద్య నిపుణులను సంప్రదించి చితిత్స పొందాలి .

ప్రపంచం మొత్తం 'బరువు' మాట వింటేనే భయపడుతోంది! ఎక్కడ చూసినా వూబకాయం వూబిలో కూరుకుపోయి.. బరువు తగ్గాలని తంటాలుపడే వారే. ఉండాల్సిన దానికంటే ఎక్కువున్నవారు కచ్చితంగా బరువు తగ్గటం, తగ్గేందుకు ప్రయత్నం చెయ్యటం అవసరమే. కానీ మనమే ప్రయత్నమూ చెయ్యకుండా.. మనవైపు నుంచి ఎటువంటి శ్రమా లేకుండానే బరువు తగ్గుతున్నామంటే మాత్రం అది మంచి లక్షణం కాదు!

బరువు తగ్గిపోవటమన్నది శరీరంలో తలెత్తిన తీవ్ర అనారోగ్యానికి సూచిక! క్షయ, క్యాన్సర్‌ వంటి తీవ్రస్థాయి సమస్యల్లో ప్రధానంగా కనబడే లక్షణం... ఈ బరువు తగ్గటమే! కాబట్టి బరువు తగ్గిపోతున్నట్టు అనుమానం వస్తే తక్షణం వైద్యులను సంప్రదించి.. అందుకు కారణాలను అన్వేషించటం అత్యవసరం!

బరువు తగ్గిపోతుండటమన్నది వైద్యపరంగా చాలా తీవ్రమైన అంశం! బరువు ఎక్కువ ఉన్నవారు, బరువు తగ్గాలని భావించేవారు కావాలని డైటింగ్‌, వ్యాయామాల వంటివి ఎక్కువ చేస్తుంటారు. వారు బరువు తగ్గటం సహజం. అయితే అలాంటి ప్రయత్నాలేవీ లేకుండానే చాలా వేగంగా.. అంటే నెలకు ఒక కిలోకన్నా, లేదా ఆర్నెల్లలో 5 కిలోలకన్నా ఎక్కువగా బరువు తగ్గిపోతుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏదో తలెత్తిందని అనుమానించాలి.

కోపము : కోపము మనిషి మానసిక స్థితిని తెలియజేస్తుంది . కోపము ఎన్నో మానసిక , శారీరక అనర్ధాలకు దారితీస్తుంది . మన కోపమే మనకు శత్రువు . . . అని అన్నారు ఒక కవి . కోపము వలన మనిషి ఒంటరి జీవనం చేయవలసి వస్తుంది . రక్తపోటు పెరిగి నరాల బ్లహీనత వచ్చును . గుండె జబ్బులకు దారితీయును. తను చేసే పనులలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఎప్పుడూ కోపం గా ఉన్న వారిలో " ఎండార్ఫిన్లు " అనే హార్మోనులు తయారు కావు . దీనివల ఆయుష్ క్షీనత కలుగును .

కోపము తగ్గడానికి మనము ఎప్పుడూ దైవస్మరణ చేస్తూఉండాలి . పాలు , పండ్లు , విటమిన్‌ ' సి ' ఉన్న ఆహారము తీఉకోవాలి. ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించకుండా నలుగురితో కలిసి మెలిసి తిరుగుతూ ఉండాలి , కోపము వచ్చినపుడు మనసుని మళ్ళించే పనిలో నిమగ్నమవ్వాలి... ఉదా: పది అంకెలు ముందునుంది వెనక్కి 10... 9... 8.. లెక్కిస్తే టెన్‌షన్‌ నుంది బయటపడతాము .

అతిగా నిద్యపోవడం : అతినిద్ర (హైపర్ సామ్నియా) -- నిద్య ఎక్కువైనా ,, తక్కువైనా అనారోగ్యమే. వయసును బట్టి మనిషికి కావలసిన గంటలు తృప్తిగా నిద్రపోవాలి. ప్రతీ రోజూ అవసరానికి మించి కనీసం నెలరోజులపాటు, పగలు - రాత్రి నిద్రపోవడాన్ని అతినిద్ర అంటారు. చాలా మంది ఎక్కువ రోజులు బలవంతంగా మేల్కొనే ఉంటారు. కొన్ని రకాల రుతుస్రావ సమస్యలున్న మహిళల్లో అతినిద్ర ఉంటుంది. గురక సమస్యతో బాధపడేవారు, దీర్ఘకాల సమస్యలున్నవారు, తలకు బలమైన గాయాలైనవారికి, చిన్న మెదడులో కణితులు ఏర్పడినప్పుడు, స్థూలకాయుల్లో అతినిద్ర సమస్య ఉంటుంది. హైపర్‌సామ్నియా అని పిలిచే అతినిద్ర సమస్య ఉన్నవారు రోజుకు 10 గంటలకంటే ఎక్కువ నిద్రపోతారు. ఇది హైపోథైరాయిడ్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు ఉండేవారి లో ఎక్కువ. నార్కోలెప్సీ సమస్య ఉన్నవారు పగలుకూడా నిద్రపోతుంటారు. దీనిని ఇర్రెస్టిబుల్ స్లీప్ డిసార్డర్ అని కూడా అంటారు. క్లీన్ లెవిన్ సిండ్రోమ్ ఉన్నవారు నెలల తరబడి నిద్రపోతుంటారు. రామాయణంలో కుంభకర్ణునికి ఈ జబ్బు ఉందనుకోవచ్చు.

స్లీప్ సైకిల్...:

సాధారణంగా ప్రతి మనిషికి 6-8 గంటల నిద్ర ఉంటే సరిపోతుంది. చిన్నపిల్లలు 8-10 గంటలు, రోజుల పిల్లలు 14-20 గంటలు నిద్రపోతారు. 50 ఏళ్ల తర్వాత నిద్ర క్రమేపీ తగ్గుతూపోతుంది. 60 ఏళ్లకు 4-6 గంటలు, 70 ఏళ్లకు 4-5 గంటలు, 80 ఏళ్లకు 3-4 గంటలు మాత్రమే నిద్ర సరిపోతుంది. మెదడులో నిద్రకు సంబంధించిన భాగాన్ని ‘పీనియల్‌గ్లాండ్’అంటారు. దీని నుంచి మెలటోనిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది నిద్ర ఎంత స్థాయిలో అవసరం అవుతుందో తెలియజేస్తుంది.

7-8 గంటల నిద్రలో 4-5 స్లీప్ సైకిల్స్ ఉంటాయి. మళ్లీ ఇందులో ‘నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్, రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’ అని రెండు దశల నిద్రలు ఉంటాయి. ‘నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’లో మళ్లీ నాలుగు దశలుంటాయి. ‘రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’లో కనుపాపలు వేగంగా కదులుతుంటాయి. దీంతో పాటు కాళ్లు, చేతులు కదలడం, గుండె వేగంగా కొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. దీనినే కలతనిద్ర అంటారు. ఇక ‘నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’ను గాఢ నిద్ర అంటారు.

నిద్రలేమి: నిద్ర అందరికీ కావాలి. ఉదయం నుంచి విధులను నిర్వర్తించిన సూర్యుడు సాయంత్రానికి అలసి పశ్చిమాన విశ్రాంతి తీసుకుంటాడు. రోజంతా పనులతో అలసిపోయిన మనిషి రాత్రివేళ నిద్రలో విశ్రాంతి పొందుతాడు. అయితే కొందరు నిద్రపట్టక బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు అతినిద్ర కారణంగా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోల్పోతుంటారు. జీవితంలో సగభాగం నిద్రలో గడిపినా మనిషి దాన్ని వృథా అనుకోడు. నిజానికి ఆరోగ్యం కోసం అది అవసరం కూడా. సాధారణంగా మనిషి రోజూ 6-8 గంటలు హాయిగా నిద్రపోతే 50 శాతం వరకు జబ్బులు దరిచేరవు అనేది వైద్యులు చెబుతున్నమాట.

నిద్ర సమస్యలు:
1.నిద్రలేమి (ఇన్‌సామ్నియా)
2.అతినిద్ర (హైపర్ సామ్నియా)
3.నిద్రలో విచిత్రంగా ప్రవర్తించడం. (పారాసామ్నియా) వీటిలో నిద్రలేమి సమస్య ఎక్కువమందికి వస్తుంది


నిద్రలేమి : రాత్రిపూట కావలసినంత నిద్రలేకపోవడం. దీని వల్ల పగలు పనిలో మధ్య మధ్యలో నిద్రపోవడం. త్వరగా కొపం రావడం, ఏకాగ్రత లోపించడం. మతిమరపు, పనిలో సామర్థ్యం తగ్గిపోవడం... వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ ఎక్కువ రోజులు కొనసాగితే బి.పి., గుండెజబ్బులకు దారితీయవచ్చు. అలాగే మైగ్రెయిన్ తలనొప్పి, బ్రెయిన్‌స్ట్రోక్, కడుపులో హైపర్ అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్లు రావడం, యాంగ్జైటీ న్యూరోసిస్, డిప్రెషన్ లాంటి జబ్బులు వస్తాయి. వేళకు నిద్ర పోకపోవడం, వేళకు తినకపోవడం, నిద్రపోయేముందు పొగతాగడం, కాఫీ, టీలు ఎక్కువ తీసుకోవడం, శీతలపానీయాలు సేవించడం, తీవ్ర ఒత్తిడికి గురికావడం, కొన్నిరకాల మందులు (ఆస్థమా, గుండెజబ్బులు, మూత్రపిండాలు, లివర్ జబ్బుల, స్థూలకాయం, థైరాయిడ్ సమస్యలు... వంటి వాటికి వాడే మెడిసిన్స్), విపరీతమైన నొప్పి (తలనొప్పి, మెడనొప్పి, పంటినొప్పి, కాళ్లు-చేతులు మంటలు, కడుపులో మంటలు...) వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి.

విచిత్రంగా ప్రవర్తించడం:
కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది ఇది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో జరుగుతుంది. వీరు కొన్నిసార్లు తలుపు తీసుకుని బయటకు వెళ్లడమే కాకుండా, అనుకోని ప్రమాదాల బారిన పడుతుంటారు. మెలకువ వచ్చాక తామిలా చేశామన్న విషయమే వీరికి గుర్తుండదు. ఇంకొంతమంది నిద్రలో లేచి భయంకరంగా ప్రవర్తిస్తారు. పెద్ద పెద్దగా అరవడం, వస్తువులను పగలగొట్టడం చేస్తుంటారు. కలలో మమేకం అయిపోయి ఇలా ప్రవర్తిస్తారు. ఇది కూడా నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో వస్తుంది.

రాత్రి నిద్రలో ఇలా ప్రవర్తించినట్టు పొద్దునే వీరికి గుర్తుకు రాదు. ఈ సమస్యను స్లీప్‌టెరర్ ్రఅంటారు. ఇది 5-15 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తుంటుంది. కొందరు నిద్రలో మాట్లాడుతుంటారు. దీనిని స్లీప్ టాకింగ్ అంటారు. దీంతో పాటు కొంతమంది పిల్లలకు రాత్రిపూట పక్కతడిపే అలవాటు కూడా ఉంటుంది. 5-7 సంవత్సరాల పిల్లల్లో ఇది సాధారణమే. పదేళ్లకు పైబడిన పిల్లల్లో ఈ సమస్య ఉంటే దీనిని నక్టర్నల్ ఎన్యురోసిస్ అంటారు. భయంకరమైన కలలు రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ మంచి చికిత్స ఉంది. కౌన్సెలింగ్, మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు.

నిద్ర పరీక్షలు
నిద్ర సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించడానికి ఆధునిక పద్ధతులెన్నో అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రో ఎన్‌సెఫలో గ్రామ్ (ఈఈజీ)అనే టెస్ట్ ద్వారా స్లీప్ డిజార్డర్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో కనిపెట్టి, దానికి తగిన చికిత్స చేయవచ్చు.

నిద్రలేమి-నివారణ
నిద్రకు ఉపక్రమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు...

ఊపిరితిత్తులకు, గుండెకు సంబంధించిన జబ్బులకు మందులు వాడుతుంటే డాక్టర్ సలహామేరకు పగటిపూట వాడేటట్లు చూసుకోవాలి.

పడకగదిని నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. గది వాతావరణం మరీ వేడిగా, మరీ చల్లగా ఉండకూడదు. గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలి. గది గోడలు, కర్టెన్లు, బెడ్‌షీట్లు... తేలికపాటి రంగుల్లో ఉండాలి.

ఆల్కహాల్ తీసుకోకూడదు.

రోజూ ఒకే సమయంలో నిద్రపోవాలి.

పగటిపూట నిద్రపోకూడదు.

సాయంకాలం 30 ని.లు వ్యాయామం చేయాలి.

నిద్రించే ముందు రోజూ గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.

నిద్రకుపక్రమించడానికి 2-3 గంటల లోపల టీ, కాఫీ, పొగ... తాగకూడదు.

నిద్రపోయేముందు నవలలు, పుస్తకాలు చదవకూడదు. (ఆసక్తికరమైన అంశాలు ఉంటే నిద్ర సరిగ్గా పట్టదు)

నిద్రకు ముందు భయానక దృశ్యాలను (టీవీ, సినిమా..) చూడకూడదు. (ముఖ్యంగా పిల్లలు వీటిని చూడటం ద్వారా రాత్రి కలల్లో వచ్చే దృశ్యాలకు విపరీతంగా ప్రవర్తిస్తుంటారు.)

నిద్రపోవడానికి ముందు గోరువెచ్చటి పాలు తాగాలి.

నిద్రపోయేటప్పుడు ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినాలి.

No comments:

Post a Comment