Thursday, 24 March 2016

How regain beauty After Delivery? - ప్రసవానంతరం తగ్గిన అందం పొందడం ఎలా?


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ప్రసవానంతరం తగ్గిన అందం పొందడం ఎలా?(How regain beauty After Delivery?)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


అమ్మదనపు ఆనందం ఓ వైపు. అంతలోనే ఇంతటి లావు తగ్గుతామా.. పూర్వపు అందం సొంతం అవుతుందా అంటూ చాలామంది తల్లుల ఆందోళన. దాంతో ప్రసవం అయినప్పటి నుంచీ రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతారు. అధికబరువు కొందరి సమస్య అయితే.. పొట్టపై చారలు.. చర్మ సంరక్షణ మరికొందరిని వేధిస్తుంది. వీటిని దూరం చేసేందుకు కొన్నిదేశాల్లో మహిళలు పాటించే చిట్కాలేమిటో చూద్దాం.
* ప్రసవం అయినప్పటినుంచీ.. అధిక బరువును దూరం చేసేందుకు జపనీయ యువతలు ఏం చేస్తారో తెలుసా.. భోజనం అయిన ప్రతిసారీ కప్పు గ్రీన్‌ టీ తాగుతారు. దాంతో కొన్నాళ్లకు శరీరం చెక్కిన శిల్పంలా తయారవుతుంది.

* పరగడుపునే ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను కొద్దిగా తీసుకోవడం చాలామంది హాలీవుడ్‌ భామల అలవాటు. రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. దాంతో కొన్నాళ్లకు సన్నబడటం ఖాయం. అలాగే చర్మం నిగారింపునూ సంతరించుకుంటుందనేది వీరి నమ్మకం.

* మన భారతీయుల ప్రకారం.. పొడిబారిన చర్మానికి.. పొట్టపై పడిన చారలు దూరం చేసేందుకు కొబ్బరినూనె మించిన ప్రత్యామ్నాయం లేదు. అయితే.. చారలు పూర్తి స్థాయిలో పోవు కానీ.. సమస్య కొంతవరకు అదుపులో ఉంటుంది.

* పాపాయిని చూసుకోవడం వల్ల కొన్నిసార్లు రాత్రిళ్లు నిద్రఉండదు తల్లులకు. దాంతో.. కళ్లు ఉబ్బి.. ఎర్రబడతాయి. దీన్ని దూరం చేసేందుకు.. జర్మన్‌ మహిళలు పాటించే చిట్కా ఏంటో తెలుసా.. కామొమైల్‌ టీ బ్యాగులను వేడినీటిలో ముంచి.. చల్లారాక కళ్లపై పెట్టుకోవడం. విశ్రాంతితో పాటు.. కళ్లు ప్రకాశవంతంగానూ మారతాయి.

* ప్రసవమయ్యాక.. సరైన సంరక్షణ లేక.. చర్మం అలిసిపోయినట్లు కనిపిస్తుంది. దీన్ని తగ్గించేందుకు స్వీడన్‌ వనితలు.. చాలా సులువైన చిట్కానే పాటిస్తారు. నిద్రలేచిన దగ్గర్నుంచి.. మళ్లీ నిద్రపోయే దాకా.. అప్పుడప్పుడు బాగా చల్లనినీటితో ముఖాన్ని కడుగుతుంటారు. అప్పుడే చర్మం తేటగా మారుతుందని అంటారీ మహిళలు.

* గ్రీస్‌కు చెందిన మహిళలయితే.. ఆలివ్‌నూనెను మించిన పరిష్కారం లేదంటూ సూచిస్తారు. రోజు స్నానానికి ముందు కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుంటే చాలు.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. దాంతోపాటు.. స్నానపు నీటిలో నాలుగైదు చుక్కల ఆలివ్‌నూనెనూ వేసుకుంటారు వీరు. ఇక కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుని.. ఆ తర్వాత పంచదారతో రుద్దుకుంటే.. ముడతలు దరిచేరవని వీరి నమ్మకం.

* హాయిగా నిద్రపోవడమే తమ సౌందర్యరహస్యం అని భావిస్తారు కొందరు విదేశీ తల్లులు. అందం కోసం బ్యూటీ స్లీప్‌ను మించిన రహస్యం లేదనేది వారి భావన.

No comments:

Post a Comment