ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --బొటాక్స్ థెరపీ-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
వయసు కనిపించకుండా అందంగా ఉండాలనే కోరికతో ఎన్నోచికిత్సలకు ఆకర్షితులు అవుతున్నారు. ఆ చికిత్సలలో ఒకటి బొటిక్స్ థెరపీ. చూసే కళ్లను బట్టి అందం ఉంటుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు చేసి ఓ రేషియో ను శాస్త్రవేత్తలు రూపొందించారు. విశ్వవ్యాప్తంగా పర్ఫెక్ట్ ఫేస్ కు ఉండే రేషియో ఇదేనని అందరూ అంగీకరించారు. ఈ రేషియోను పెదాల నుంచి ముక్కు వెడల్పు వరకు లెక్కిస్తారు. బొటాక్ష్ (Botox) అనేది బొటిలినమ్ టాక్షిన్ ఎ (Botilinum Toxin A) కి ట్రేడ్ నేమ్ . 1990 లో ఎఫ్.డి.ఎ. ద్వారా కంటి కండరాల బిగువును (eye muscle spasm) తగ్గించడానికి వినియోగములోనికి వచ్చినది . తక్కువ మోతాదులో ముఖము కండాలలో ఇంజక్ట్ చేయడము వలన ఆయా కండరాలు రిలాక్ష్ అయ్యి ముఖము లోని ముడతలు , గుంటలు , లైన్స్ /గ్రూవ్స్ సరిచేయబడి అందముగా యవ్వనములో ఉన్నట్లు కనిపించును . ఈ విధానము అనుభవము ఉన్న కాజ్మెటిక్స్ స్పెసలిస్ట్స్ చే తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. సుమారు 7 -8 నెలలు దీని ప్రభావము ఉంటుంది . మళ్ళీ కావాలనుకుంటే ఎన్ని సార్లైనా తీసుకోవచ్చును .
బొటాక్ష్ వల్ల ఇంకా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి :
- మైగ్రైన్ తలనొప్పులకు పనిచేయును. నొప్పి తగ్గించుటలో సహకరించును,
- ముఖము పై ఎక్కు వగా చెమట పట్టకుండా నివారించుటలో సహకరించును .
- దీర్ఘ్కాలిక దవడ నొప్పి , నడుమ నొఫ్ఫి చికిత్సలో మంచి ఫలితాలు ఉన్న్నాయి .
- కండరాల వణుకు (muscle twitchings) తగ్గించుటలో ఉపయోగపడును .
మంచి ఆరోగ్యము ఉన్న స్త్రీ, పురుషులు ఎవరైనా తీసుకోవచ్చును .
గర్భిణి స్త్రీలు , బాలింతరాళ్లు తీసుకోకూడదు ,
నరాల జబ్బులు ఉన్న వారూ తీసుకోకూడదు (Neuro muscular disorders).
బొటాక్ష్ ఇంజక్షన్ చేసే విధానము :
ఈ ఇంజక్షన్ చాలా సులువుగా చాలా సన్నని సూది ఉన్న సిరంజ్ తో ఇస్తారు . ఏయే కండరాలకు అవసరమో అంతవరకే తక్కువ మోతాదులో ఇస్తారు . ఇది తీసుకోవాలనుకునే వారు సుమారు 10 రోజులు ముందుగా ఏవిధమైన విటమిన్లు, విటమిన్ ఇ(vit.E) , నొప్పినివారణ మందులు (anti inflamatary drugs) వాడకూదదు .
No comments:
Post a Comment