Wednesday, 30 March 2016

Dentalcare-orthodontic Treatment - దంతవైద్యం-ఆర్థోడాంటిక్‌ చికిత్స















ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -దంతవైద్యం-ఆర్థోడాంటిక్‌ చికిత్స- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 

-ఆర్థోడాంటిక్ అంటే గీకులో orthos =straight or proper, and odous=tooth అని అర్ధము . ఇది దంతవైద్యవంధానములో మొట్టమొదటి స్పెషాలిటీ. . ఆర్థోడాంటిక్‌ చికిత్సా విధానం ద్వారా పళ్ళను ఒక వరుస క్రమంలో అమర్చడానికి, చూడడానికి అందంగా ఉండేటట్లుగా మరింత బాగా చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా పళ్ళు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటూ పనిచేసేటట్లు, చిగుళ్లు, దవడ ఎముక మూలలు పంటితో కొరికినప్పుడు వత్తిడి అన్ని పళ్ళమీద సమానంగా పడేటట్లు చేయవచ్చు. 

ఆర్థోడాంటిక్‌ చికిత్స ఎందుకు అవసరమవుతుంది? 
చాలామందిలో దొంతర పళ్లు ఉంటాయి. పళ్ళు రంగుమారి ఉంటాయి. ఆర్థోడాంటిక్‌ చికిత్సావిధానం ద్వారాపళ్ళను సరి చేసి మంచిగా తయారుచేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి కేవలం అందంకోసమే కాకుండా, పంటి సామర్థ్యాన్ని పెంచి, నమలడానికి, శుభ్రంచేసుకోవడం సులువుగా ఉంటుంది. కొంతమందిలో ముందుపళ్ళ వరుసలో జిగురుగా ఉండి వరుస క్రమం తప్పి చూడడానికి అందవిహీనంగాఉంటుంది. సాధారణంగా ఈపళ్ళు అప్పటికే పాడయివుంటాయి. 

అయితే ఆర్థోడాంటిక్‌ చికిత్సా విధానం ద్వారా వీటిని సరిచేసి బాగు చేయవచ్చు. మరికొందరిలో క్రింది దవడ, పై దవడ సరిగా కలవక కొరికినప్పుడువత్తిడి అన్నిపళ్ళవి ఒకేవిధంగా ఉండవు. దీనినకూడా ఆర్థోడాంటిక్‌ చికిత్స ద్వారా సరిచేయవచ్చు. దీని వలన దవడ ఎముకలను వత్తిడి ఎక్కువై వాటికి సంబంధించిన సమస్యలతో పాటు, కొంత మందిలో తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఆర్థోడాంటిక్‌ చికిత్సావిధానం ద్వారా చాలా సరిగ్గా అన్ని పళ్ళు ఒకే రకమైన వత్తిడితో కొరికేటట్లు చేయవచ్చు.

ఏ వయస్సులో చేయించుకోవాలి? 
సాధారణంగా ఈచికిత్స చిన్నపిల్లలుగాఉన్నప్పుడు చేయిం చుకోవడం మంచిది. అయితే పెద్దవయస్సులోను చేయించు కోవచ్చు. కానీ ఎక్కువసార్లు అవసరమవుతంది. చిన్నపిల్ల విషయంలో పూర్తిగా పళ్ళు వచ్చిన తరువాత ఈ చికిత్స చేయించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. 

ఎవరితో చేయించుకోవాలి? 
ఆర్థోడాంటిక్‌ అనే ప్రత్యేక నిపుణత అర్హత కలిగిన దంత వైద్యుడు ఈ చికిత్స చేయాలి. ఈ వైద్య విధానం అవలంభించేవారిని లేదా ఆసుపత్రిలో ఆర్థోడాంటిస్ట్‌ అని పిలుస్తారు. 

చికిత్సా విధానం ఎలా ఉంటుంది? 

దీనిలో అతిముఖ్యంగా పూర్తి అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలి. కావాలసని ఎక్స్‌రేలు మరియు పళ్ళయొక్క మాదిరినమూనాలు తీసుకుని,పూర్తిస్థాయిలో పళ్ళను పరీక్షలు చేయాలి. చికిత్సప్రారంభానికి ముందు ఏ మేరకు ఫలితాలు వస్తాయో ఆర్థోడాంటిస్ట్‌ చర్చల ద్వారా తెలుసుకుంటారు. 

పలువరుసలో ఖాళీకి సహజ దంతాలు చేయించుకోవాలా? మీ పలువరుసలో ఏ విధమైన ఖాళీ లేని పక్షంలో కొన్ని సహజ దంతాలను చేయించుకోవాల్సిన అవసరంవుంటుంది. మీ దంతవైద్యులు అవసరమైతేనే చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇతర విధానాల ద్వారా ఖాళీని పెంచుతారు. ఎన్నో వస్తువుల సహాయంతో సులభతరంగా చికిత్స చేస్తారు. చాలా మందికి తెలుసున్న విధానం పేరు బెసెస్‌. ఆర్థోడాంటిక్‌ చికిత్సా విధానం ద్వారా పళ్ళను ఒక వరుస క్రమంలో అమర్చడానికి, చూడడానికి అందంగా ఉండేటట్లుగా మరింత బాగా చేయడానికి ఉపయోగిస్తారు. అంత ేకాకుండా పళ్ళు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటూ పనిచేసేటట్లు, చిగుళ్లు, దవడ ఎముక మూలలు పంటితో కొరికినప్పుడు వత్తిడి అన్ని పళ్ళమీద సమానంగా పడేటట్లు చేయవచ్చు. 
చాలామందిలో దొంతర పళ్ళ మరియు పళ్ళు రంగుమారి ఉంటాయి. ఆర్థోడాంటిక్‌ చికిత్సావిధానం ద్వారాపళ్ళను సరి చేసి మంచిగా తయారుచేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి కేవలం అందంకోసమే కాకుండా, పంటి సామర్థ్యాన్ని పెంచి, నమలడానిక, శుభ్రం చేసుకోవడం సులువుగా ఉంటుంది. 

ఫంక్షనల్‌ అప్లయన్సెస్‌ అంటే ఏమిటి? దవడ ఎముక పెరుగుదలలో అవసరమైన మార్పులు ఆర్థోడాంటిక్‌ వస్తువులు ఉపయోగించి కొన్నిసార్లు చేస్తారు. ఇలా వాడుకునే వస్తువుల దవడ ఎముక శక్తిని పెంచడంతోపాటు కొన్ని రకాల సమస్యలను తగ్గించడానికి సహాయ పడతాయి. 

ఫిక్స్‌డ్‌ అప్లయన్స్‌ అంటే ఏమిటి? తీసివేయడానికి అనువుగా ఉండే ఒక ప్లేటు సహాయంతో పళ్ళను అతి చక్కగా అమర్చడానికి చికిత్స చేస్తారు. కొన్ని సందర్భాలలో స్థిరంగా ఉండే అప్లయన్స్‌ వాడవలసి ఉంటుంది. దీనిలో (బ్రాకెట్స్‌) బాండ్స్‌ అని పిలువబడేవి తాత్కాలికంగా నోటిని పట్టుకునేట్లు చేస్తాయి. తేలికైన వైరు (బ్రాకెట్స్‌)కు కల పడం ద్వారా పళ్ళు కదిలేటట్లు చేస్తారు. ఈ విదానంలో అప్లయన్స్‌ను తీసివేయడానికి అవకాశం ఉండదు. కావున దీనిని స్థిర అప్లయన్స్‌ అంటారు. 

బ్రాకెట్స్‌ దేనితో తయారు చేస్తారు? స్థిర బెసెస్‌ అన్ని లోహాలు ఉపయోగించి చేయరు. ముఖ్యంగా పెద్దవారికి ఉపయోగిచేవాటిని ప్లాస్టిక్‌ మరియు సిరమిక్‌ వాడతారు. ఎన్‌హెచ్‌ఎస్‌తో సాధారణంగా ఈ రకమైన బెసెస్‌ లభించవు 

ఇవి ఏ విధంగా పని చేస్తాయి? వైర్లు, స్రింగులు ఒకదానికొకటి కలపడానికి నమిలేటప్పుడు డెంట్యూర్స్‌ ద్వారా పక్కపళ్ళకి వత్తిడి తగ్గిస్తారు. కొన్ని సందర్భాలలో ఇంప్లాంట్‌తో కలపవడం చేస్తారు. ఈ విధానం పైకి కనపించదు. 

ఖచ్చితమైన అమరిక అంటే ఏమిటి? ప్రతివ్యక్తికి అవసరమయ్యే విధంగా లోహ సంబంధ డెంట్యూర్స్‌ లాంటి కట్టుబడికి ఖచ్చితమైన అమరిక అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. అయితే రెండూ ఒకే విధంగా పనిచేస్తాయి. 

ఇవి ఏ రకంగా పనిచేస్తాయి? చిన్న వైర్లు ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఆహారాన్ని నమిలేటప్పుడు ఏ విధమైన ఇబ్బందిని కలిగించకుండా, పక్క దంతాలకు నొప్పిని తగ్గించి, డెంట్యూర్స్‌ కొద్దిగా కదలేటట్లు అమరి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇంప్లాంట్‌తో సముచ్ఛయంగా ఈ అమరికను ఉంచుతారు. ఇవి పైకి కనిపిస్తూ ఉంటాయి. కనుక సాంప్రదాయ లోహ కట్టుకుంటే ఉపయోగకరంగా ఉంటాయి. 

ఏ అమరిక నాకు చక్కగా పనిచేస్తుంది? 
మీ అవసరానికి తగినట్లుగా మీకు ఏ అమరిక అన్ని రకాల చక్కగా అనువుగా ఉంటుందో మీ దంతవైద్యులు మీతో చర్చించి చెబుతారు. నమిలేటప్పుడు అన్ని పళ్ల వత్తిడి ఒకే విధంగా ఉండేట ట్లుగా చేయడం డాక్టర్‌ పరిగణలోకి తీసుకుంటారు. 

బ్రెసెస్‌ ఎలాంటి జగ్రత్తలు తీసుకోవాలి? చక్కెర కలిగిన ఆహార పదార్థాలు పానీయాలు అవసరమైనంత వరకు తగ్గించడం చేయాలి. చిరుతిండ్లు, శీతల పానీయాలు మాని వేయాలి. జిగురుగా, గట్టిగా ఉండే ఆహార పదార్థాలు, సన్నితంగా ఉన్న ఆర్థోడాంటిక్‌ వస్తువులను పాడుచేస్తాయి. రోజుకు రెండుసార్లు అవసరమనుకుంటే మౌత్‌వాష్‌ ఉపయోగించండి. 

No comments:

Post a Comment