ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వైద్యనీతి , Medical morality- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
* ప్రతి వైద్య విధానం కొన్ని నీతి నియమాలతో నడుస్తుంది.
* వైద్య పరిశోధనల ఫలితాలు హక్కుల చట్రంలో లేకుండడం. జీవన్మరణాలను లాభసాటి అంశంగా భావించకుండా ఉండే ప్రపంచం నా దృష్టిలో సరైన ప్రపంచం అని మాజీ ప్రధాని 1981 ప్రపంచ ఆరోగ్య సభలో చెప్పారు.
* ఇటీవల వైద్యం వ్యాపారమయం అయ్యిందని చాలా మంది అంటున్నారు.
* 2008 ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వైద్య వ్యాపారాన్ని గురించి తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది.
* ఈ నేపథ్యంలో ఈ వారం, వచ్చేవారం వైద్యనీతి గురించి హెల్త్ బోర్డు ద్వారా తెలుసుకుందాం. అల్లోపతి వైద్య విధానానికి పరిమితమవుదాం.
* అల్లోపతి వైద్య విధానానికి పితామహుడు హిపోక్రటిస్.
* సాధారణంగా హిపోక్రటిస్ ప్రతిజ్ఞను ఎంబిబిఎస్‌లో చేరిన విద్యా ర్థులతో చేయిస్తారు.
* హిపోక్రటిస్ ప్రతిజ్ఞ గతంలో ప్రతి ఆసుపత్రి గోడలపై కనపడేది.
* ఇటీవల కాలంలో ఇది ఆసుపత్రు లలో కనిపించడం లేదు.
* మన దేశంలో అల్లోపతి వైద్య విధానంలో వైద్యనీతి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టాల పరిధిలో నియంత్రిస్తారు.
* వైద్య వృత్తిలో సహాయం చేయడం ప్రధాన అంశం. డబ్బు సంపాదన తర్వాత అంశం.
* మన దేశ ప్రజలు దయగలవారు. ఉదార స్వభావులు. ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనైనా వైద్యులను కాపాడుకుంటారు. కాబట్టి వైద్యులు నీతి నియమాలు పాటించాలి.
No comments:
Post a Comment