Wednesday, 23 March 2016

Pulmonary Hypertension - ఊపిరితిత్తుల్లో రక్తపోటు


ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఊపిరితిత్తుల్లో రక్తపోటు (Pulmonary Hypertension)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




-సాధారణంగా మనకు రక్తపోటు అనగానే గుండె గుర్తుకు వస్తుంది. అధిక రక్తపోటు కారణంగా గుండె దెబ్బ తింటుందని మనం భావిస్తుంటాం. అధిక రక్తపోటు కారణంగా గుండె మాత్రమే కాదు, మెదడు, మూత్ర పిండాలు, ఊపిరితిత్తుల వంటి ఇతర అవయవాలు కూడా దెబ్బ తింటాయి. మనం అధిక రక్తపోటు అని వ్యవహరించే స్థితిలో గుండెనుండి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. దీనిని సిస్టమిక్‌ హైపర్‌ టెన్షన్‌ అంటారు. దీని వల్ల శరీరంలోని ఇతర అవయవాలు దెబ్బ తింటాయి. గుండె, మెదడు, మూత్రపిండాలు, కంటిలోని రక్తనాళాలు, కాళ్లు, చేతుల్లో ఉండే రక్తనాళాలు దెబ్బ తింటాయి. గుండెకు సంబంధించిన రక్తపోటు వేరు. ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తపోటు వేరు.గుండెనుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను పల్మొనరీ ఆర్టరీస్‌ అంటారు. ఈ రక్తనాళాల్లో పెరిగే రక్తపోటును పల్మొనరీ ఆర్టీరియల్‌ హైపర్‌ టెన్షన్‌ అంటారు. గుండెనుంచి ఊపిరితిత్తులకు సరఫరా కావలసిన రక్తం సాధారణ పరిమాణం కంటే ఎక్కువ పరిమాణంలో సరఫరా అయినప్పుడు కాని, గుండె గోడల మధ్య రంధ్రాలు పడటం వల్ల కాని ఈ సమ్య ఉత్పన్నమవుతుంది.

రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ అనే వ్యాధిలో ఎడమ కర్ణికనుంచి జఠరికలోకలి వెళ్లే భాగం సన్నబడటం వల్ల ఎడమ కర్ణికలో రక్తం నిలిచిపోతుంది ఎడమ కర్ణికనుంచి జఠరికకు రక్తం పంపే మైట్రల్‌ కవాటం సన్నబడుతుంది. గుండెలో రక్తం నిలువ ఉండటంతో ఊపిరితిత్తులనుంచి గుండెకు చేరే రక్తం ఎదురుతంతూ ఉంటుంది. దీనితో రక్తనాళాల్లోని ఒత్తిడి ఊఇరితిత్తుల్లోని రక్తనాళాపై పడుతుంది. ఊపిరితిత్తుల వ్యాధులైన క్రానిక్‌ బ్రాంకైటిస్‌, ఇంటర్‌స్టీషియల్‌ లంగ్‌ డిసీజ్‌, పల్మొనరీ థ్రాంబో ఎంబాలిజం, బ్రాంకి ఎక్టేస్‌ి, స్లీప్‌ అప్నియా సిండ్రోమ్‌, పుట్టుకతోనే ఊపిరితిత్తుల వ్యాధులకు గురి కావడం వంటి కారణాల వల్ల ఊపిరితిత్తుల్లో రక్తపోటు సమస్య ఉత్పన్నమవుతుంది.అలాగే ఊపిరితిత్తుల్లో కొన్ని భాగాలను శస్త్ర చికిత్స ద్వారా తీసివేసిన తరువాత (లోబెక్టమీ, నీమోనెక్టమీ) కొంతమందిలో కారణం తెలియకుండా రక్తపోటు పెరుగుతుంది. ఈ విధమైన రక్తపోటును ప్రైమరీ పల్మొనరీ హైపర్‌ టెన్షన్‌ అంటారు. ఊపిరితిత్తులకు ఏ వ్యాధి సోకినా రక్తనాళాల సంఖ్య, రక్తం పరిమాణం దెబ్బ తింటాయి.

ఫలితంగా రక్త ప్రసరణలో తేడా వస్తుంది. క్రమేపీ శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మొదట్లో కష్టమైన పనులు చేయడం, మెట్లు ఎక్కడం, నడవడం తదితర సందర్భాళ్లో శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. క్రమంగా మామూలు పనులు చేస్తున్నా దగ్గు, ఆయాసం వస్తుంటాయి. పొడి దగ్గు, ఛాతీ బరువుగా ఉండటం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో ఊపిరితిత్తుల్లో రక్తపోటు అధికంగా ఉంటుంది. ఊపిరితిత్తుల్లో ఉండవలసిన సాధారణ రక్తపోటు 10 నుంచి 25 మి.లీ. మెర్క్యురీ లెవెల్‌.మామూలుగా సరఫరా కావలసిన రక్తం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ రక్తం వచ్చినా ఊపిరితిత్తులు తట్టుకోగలవు. అయితే అంతకంటే ఎక్కువ అయితే ఇబ్బంది మొదలవుతుంది. రక్తం ఎక్కువ కావడంతో ఒత్తిడి పెరుగుతుంది. క్రమంగా ఈ భారం గుండె మీద పడుతుంది. ముఖ్యంగా కుడివైపు జఠరిక మీద పడుతుంది.ఈ భారాన్ని కొన్నాళ్లపాటు గుండె తట్టుకోగలుగుతుంది. ఆ తరువాత క్రమంగా జఠరిక వెడల్పు కావడం, కండరాల మందం పెరగడం ఆరంభమవుతుంది.

                          

తొలిస్థాఇయలో దీనిని గుర్తించడానికి ఎకోకార్డియోగ్రామ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ స్థితి ఇంకా కొనసాగితే కుడి జఠరిక తట్టుకోలేక దెబ్బ తింటుంది. అప్పుడు కుడి వైపు గుండె పని తీరు దెబ్బ తింటుంది. ఈ కారణంగా కుడివైపునుంచి సరఫరా కావలసిన రక్తం ఆగిపోతుంది. ఫలితంగా కాళ్ల వాపులు, కడుపులో నీరు చేరడం, ఛాతిలో నీరు చేరం, కాలేయం పెద్దది కావడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే రక్తనాళాల్లో రక్తం డిఫ్యూజన్‌ పద్ధతి ద్వారా పక్క భాగాల్లోకి చేరుతుంది. ఈ స్థితిని పల్మొనరీ హార్ట్‌ డిసీజ్‌ అంటారు.దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వారికి ఇది ఊపిరితిత్తుల్లో సంభవించే ఆఖరుదశ. ఈ వ్యాధికి గురైన వారిలో సుమారు 40 నుంచి 50 శాతం మంది అయిదు సంత్సరాల వరకూ జీవిస్తారు. సరైన చికిత్స తీసుకున్న వారు అంతకంటే ఎక్కువకాలం జీవిస్తారు. ఈ వ్యాధి ఏ కారణంగా వచ్చిందో గుర్తించి, తగిన చికిత్స చేయడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. బాగా ఎత్తయిన ప్రదేశాల్లో ఆక్సిజన్‌ తక్కువగా ఉంటుంది. అందుకని ఆయా ప్రదేశాల్లో జీవించే వారిలో ఆక్సిజన్‌ తగ్గి, ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలు సన్నబడి రక్తపోటు వస్తుంది. గుండె, పెరికార్డియం, చర్మం, ఊపిరితిత్తులు జాయింట్లలో ఎలాస్టిక్‌ టిష్యూ ఉంటుంది.

-ఈ టిష్యూ ఎర్రబారి నొప్పు వస్తుంటే కనెక్టివవ్‌ టిష్యూ డిజార్డర్స్‌ వస్తాయి. రక్త పరీక్షల ద్వారా ఈ వ్యాధులను నిర్ధారించి చికిత్స చేయించాలి. ఈ వ్యాధఙ ఇంతకు ముంఉదగానే మనం చెప్పుకున్న అన్ని అవయవాల్లోకి ఒకేసారి రానవసరం లేదు. కొద్దిగా ముందు వెనుకగా ఒక్కొక్క అవయవంలో వస్తాయి.కొద్దిపాటి దగ్గు వస్తున్నా, ఆయాసం వస్తున్నా ఊపిరితిత్తుల్లో ఈ వ్యాధి ఉందేమోనని అనుమానిం చాలి. ఊపిరితిత్తుల్లో వచ్చే ఈ వ్యాధిని ఇంటర్‌ స్టీషియల్‌ లంగ్‌ డిసీజ్‌ అంటారు. ఎక్స్‌రేలు, హై రిజొల్యూషన్‌ సి.టి.స్కాన్‌, ట్రాన్స్‌ బ్రాంకియల్‌ లంగ్‌ బయాప్సీ వంటి పరీక్షల ద్వారా దీనిని నిర్ధారించవచ్చు.ఈ వ్యాధికి వెంటనే చికిత్స చేయకపోతే, ఊపిరి తిత్తుల పరిమాణం తగ్గి, ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరిగి గుండె ఆగిపోవచ్చు. సాధారణంగా ఈ దశలో ఊపిరితిత్తులనుంచి శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా కావలసిన ఆక్సిజన్‌ పరిమాణం తగ్గి, లోపల కార్బన్‌ డై ఆక్సైడ్‌ పెరిగిపోవడంవల్ల రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌ సంభవించవచ్చు.

ఈ స్థితిలో గుండె జబ్బులకు వాడే డయూ రిటిక్స్‌, డిజాక్సిన్‌ వంటి మందులే కాకంఉడా, రోగికి ఆక్సిజన్‌ థెరపీని కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ చికిత్స కోసం రోగిని ఆసుపత్రిలోనే చేర్పించి ఉంచవలసిన అవసరం లేదు. మందులు వాడుతూ, ఇంటి దగ్గర ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఏర్పాటు చేసుకుని రోజుకు 12 నుంచి 15 గంటలపాటు ఆక్సిజన్‌ ఇవ్వాలి. ఈ థెరపీని రాత్రి వేళల్లో చేయడం మంచిది.ఈ రోగులకు నిపిడపిన్‌, యామ్లోడెపిన్‌ వంటి కాల్షియం ఛానెల్‌ బ్లాకర్‌ మందులను తక్కువ మోతాదులో ఇవ్వవలసి ఉంటుంది. ఇవే కాకుండా ప్రొస్థాసైక్లిన్‌, నైట్రిక్‌యాసిడ్‌ వంటి మందులను ఊపిరితిత్తులలోని రక్తనాళాల్లో వేయడం వల్ల కూడా పల్మొనరీ హైపర్‌టెన్షన్‌ను తగ్గించవచ్చు. బ్రాంకి ఎక్టేసిస్‌ వల్ల తరచుగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడం, ఊపిరితిత్తులు దెబ్బ తిని ఫైబ్రోసిస్‌ వచ్చి కూడా ఈ స్థితి సంభవించవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ రాకుండా పాశ్చురల్‌ డ్రైనేజ్‌ ద్వారా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన శ్లేష్మాన్ని బైటకు తీసివేయాలి. అవసరాన్నిబట్టి యాంటిబయాటిక్స్‌ను వాడటం ద్వారా దీనిని నయం చేయవచ్చు

No comments:

Post a Comment