---యాంత్రికమయమైపోయిన ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ అనేక రకాల ఆందోళనలకు, ఆదుర్దాలకు గురవుతూ, తద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. ఇలాంటి వాటిలో మనం ప్రస్తావించుకోవాల్సిన అంశం - దంతక్షయం. దంతక్షయం అంటే సహజంగా పంటి మీద ఉండే పింగాణి లాంటి పదార్థం అరిగిపోవడం. దానికి కారణం నోటి లోపల విడుదలయ్యే కొన్ని ఆమ్లాల ప్రభావం. పంటిమీద ఉండే పింగాణిపొర పంటి లోపలి భాగానికి రక్షణ కవచంగా ఉంటుంది. పింగాణి పొర అరిగిపోతే పంటిలోపలి సున్నితమైన భాగం బయటపడుతుంది. దీనివల్ల ఆహారం తినేటపుడు పళ్ళులాగడం, చల్లని వెచ్చని ఆహార పదార్థాలు పంటికి తగిలితే ఓర్చుకోలేకపోవడం జరుగుతుంది. ఒక్కోసారి వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది.
నిర్వచనము :
కొన్ని కఠిన పరి స్థితులలో, దంతాలు విరిగి వాటిలో చిల్లులు ఏర్పడుతాయి. దీనిని దంతాలు పుచ్చి పోవటం లేదా ''దంతక్షయం (Dental caries)'' అంటారు. పళ్ళమధ్య సందులు ఏర్పడటం, పళ్ళు గుల్లగా కావడం లేదా పళ్ళు అరిగినట్లు ఉంటే దంతక్షయంగా భావించాలి. దంతక్షయం వల్ల పంటి లోపలి భాగాలు పైకి కనిపించడం, పళ్ళు నల్లగా, పచ్చగా ఉండటం జరుగుతుంది. ఈ విధంగా సున్నితమైన పంటి భాగం బయటపడడం వల్ల వేడి, చల్లని, తీపి పదార్థాలు తినేటప్పుడు, త్రాగేటప్పుడు పళ్ళు చాలా తీవ్రంగా గుంజి నట్లు అనిపిస్తాయి.ఇది ఎనామిల్‌లో కొంత ఖాళీతో ప్రారంభం అవు తుంది. ఈ దశలో నరాలు, పల్స్ దంతాలను బలహీనపరచి మంట, వాపు, నొప్పి వుండి దంతాలు ఊడిపోయేందుకు దారి తీస్తాయి. ఇది సర్వ సాధారణమైనదా?...దంతాలు పుచ్చిపోవ టమనేది సర్వసాధారణమైన దంత సమస్య. ఇది ఏ వయస్సు లోనైనా ఏ సమయంలో నైనా రావచ్చును. అయితే తీపి పదా ర్థాలు, బేవరేజస్ క్రమం లేకుండా తినటం వలన దంతాలు పుచ్చిపో వటం ప్రారంభమవుతుంది. కనుక ఇది ఇతర వయసుల వారి కంటే, చిన్న వయస్సు, యవ్వన దశలోని వారిలో ఎక్కువ ఉంటుంది. శిశువుకు కనపడే ఒక రకమైన ఈ లక్షణాన్ని నర్సింగ్ క్యారిస్(nursing carries) అంటారు.
ఎలా తెలుసుకోవాలి:
పళ్ళమధ్య సందులు ఏర్పడటం, పళ్ళు గుల్లగా కావడం లేదా పళ్ళు అరిగినట్లు ఉంటే దంతక్షయంగా భావించాలి. దంతక్షయం వల్ల పంటి లోపలి భాగాలు పైకి కనిపించడం, పళ్ళు నల్లగా, పచ్చగా ఉండటం జరుగుతుంది. ఈ విధంగా సున్నితమైన పంటి భాగం బయటపడడం వల్ల వేడి, చల్లని, తీపి పదార్థాలు తినేటప్పుడు, త్రాగేటప్పుడు పళ్ళు చాలా తీవ్రంగా గుంజి నట్లు అనిపిస్తాయి.
కారణాలు:
మనం ఏదైనా ఆహార పదార్థం తిన్నప్పుడు, త్రాగిన ప్పుడు ప్రతిసారీ మన పంటి మీది పింగాణి పొర మృదువుగా కావడం లేదా మనం తీసుకున్న ఆహార పదార్థంలో ఖనిజ లవణాలను బట్టి కొంత నష్టపోవడం జరుగుతుంది. నోటిలో లాలాజలం ఈ పరిస్థితిని తగ్గించి, మన నోటిని కాపాడుతూ ఉంటుంది.
-అయితే ప్రతిసారి ఆమ్లపు ప్రభావం నోటి మీద ఎక్కువగా ఉంటే లాలాజలం దీనిని తగ్గించడానికి కష్టమవడమే కాకుండా పళ్ళ మధ్య ఇరుకున్న చిన్న, అతి సూక్ష్మ పదార్థాలు, పింగాణి పొరను పాడుచేసి మనం బ్రష్ చేసుకున్నప్పుడు ఈ పొర కొద్ది కొద్దిగా నష్టపోవడం జరుగుతుంది.
ఇతర సమస్యలు:
ఆహారం తినేటప్పుడు కష్టమవడం, వాంతి వచ్చి నట్లు అనిపించడం, అనారోగ్యం ఫలితంగా బరువు తగ్గడం వీటికి నోటి లోపల ఆమ్లాలు వాంతి ద్వారా నోటి బయటకి రావడం జరుగుతుంది.
ఆమ్లాల ప్రభావం:
ఎన్నోరకాల అనారోగ్య పరిస్థితులు ఈ దంత క్షయానికి కారణం కడుపులో ఆమ్లాలు నోటిలోకి రావ డమే. దీనిని గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. నోటినుండి కడుపులోకి ఆహారం వెళ్ళే మార్గం పుండు పడటం మొదలైన వాటితో బాధపడే వారు మద్యం ఎక్కువగా సేవించేవారు ఎక్కువగా వాంతి చేసుకోవడం కారణంగా ఆమ్ల ప్రభావానికి గురై దంతక్షయానికి గురవుతారు.
ఇక్కట్లు:
డెంటైన్ అనేది సున్నిమైన పంటిభాగం. ఇది బయ టపడినపుడు పళ్ళు రంధ్రాలు పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డెంటిన్ అనేది సున్నితం కావున వేడి, చల్లని, తీపిపదార్థాలు తిన్నా త్రాగినా పళ్ళ బాధ కలగడం జరుగుతుంది. దంతక్షయం వలన పళ్ళు చూడడానికి అందవిహీనంగా ఉంటాయి. పళ్ళు రంగు మారి చిన్నవిగా అవుతాయి.
ఆహారం పాత్ర:
నిమ్మ, నారింజ మొదలైన సిట్రిక్ ఆమ్లం కల్గిఇన పళ్ళు, పళ్ళరసాలు పళ్ళకు హాని కలిగిస్తాయి. ఆమ్ల స్వభావం కల్గిన ఆహార పదార్థాలు, పళ్ళ రసాలు కూడా పళ్ళకు కొద్దిగా హాని కల్గిస్తాయి. సోడా గ్యాస్ కలిగిన ద్రవాలు, కూల్ డ్రింక్స్ పళ్ళకు హానిచేస్తాయి. ఆమ్ల స్వభావం కల్గిన ద్రవాలు ఆహార పదార్థాలు ఒక్కసారి భోజన సమయంలో మాత్రం తీసుకోవచ్చు. అయితే ఇలాంటి పదార్థాలు తిన్న, త్రాగినా తర్వాత ఒక గంట వ్యవధిలో బ్రెష్ చేసుకుంటే తిరిగి మినరల్స్ వృద్ధి అయి దంతక్షయం తగ్గుతుంది. ఆమ్లపూరితమైన ఆహార పదార్థాలు తిన్నా త్రాగినా పంటిపై వాటిప్రభావం ఉండి పళ్ళు గారపట్టడం జరు గుతుంది. ఇది దంతక్షయానికి, పంటి మీద పింగాణి పొర పాడవడానికి కారణం అవుతుంది. చక్కెర లేని చూయింగ్ గమ్స్ 20 నిముషాలపాటు నవలడం వలన మంచిఫలితాలు ఉంటాయి.
ఆల్కహాలు ప్రభావం:
అన్నిరకాల ఆల్కహాల్ డ్రింక్స్ దంతక్షయానికి కారణం. ఎందువల్లనంటే వాటిలో ఎక్కువగా పుల్లని పళ్ళరసాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆల్కహాలు తీసుకోకూడదు .
చికిత్స:
దంతక్షయం నివారణకు ప్రత్యేక చికిత్స ఎప్పుడూ అవసరం ఉండదు. తరచుగా దంతవైద్యడ్ని సంప ద్రించి నోటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే దంతక్షయం రాకుండా నివారించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఫిల్లింగ్ చికిత్సద్వారా అరిగిన పళ్ళకు చికిత్స చేస్తారు.
ట్రాబెర్రీని సగానికి కోసి,ఆ ముక్కతో దంతాల మీద సున్నితంగా రుద్దాలి. పచ్చగా మారిన దంతాలు తెల్లగా అవుతాయి.
No comments:
Post a Comment