Wednesday 30 March 2016

Ankylosing Spondylitis - ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రుమాటిజం:
కీళ్లు, కండరాలతో పాటు కీళ్లు, ఎముకల ఆధార కణజాలాలు, మృదు కణజాలాల వంటి చలనాంగాలకు సంబంధించిన ఇబ్బందులు, నొప్పి వంటి వాటిని వివరించేందుకు వాడే సాధారణ పదమే రుమాటిజం . గుండె కవాటాలను ప్రభావితం చేసే రుమాటిక్‌ జ్వరాన్ని వివరించేందుకు కూడా ఈ పదాన్ని వాడతారు. అయితే పలు రుమాటలజికల్‌ వ్యాధులను వివరించేందుకు ప్రత్యేక పదాలను వైద్య పరిభాషలో ఉపయోగిస్తారు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఆంక్లైజింగ్‌ స్పాండిలైటిస్, గౌట్‌, సిస్టెమిక్‌ లూపస్‌ ఎరిథెమాటసస్‌ వంటివి ఇందుకు ఉదాహరణ.
ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌! రుమాటిక్ డిసీజస్ గ్రూఫ్ లొ ఒక రకము . ఈ గ్రూఫ్ చెందిన వ్యాదలన్నిటినీ సముదాయము గా " స్పాండిలోఆర్థోపతీస్ " అని పిలుస్తారు . సాధారణంగా వెన్ను సమస్యలు పూసలు అరిగిపోవటం, వాటి మధ్య నుండే డిస్కులు దెబ్బతినటం వంటి కారణాల రీత్యా వస్తుంటాయి. కానీ ఈ సమస్య'' ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌'' మాత్రం.. మనలోని రోగనిరోధక వ్యవస్థ వెన్ను దగ్గరి కణజాలంపై దాడి చెయ్యటం మూలంగా తలెత్తుతుంది. ఇది తరచూ ఉద్ధృతమవుతుండటం, మళ్లీ ఆ ఉద్ధృతి తగ్గుతుండటం.. ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉంటుందని, ఈ వ్యాధి లక్షణమే ఇంతని తాజాగా బ్రిటన్‌ పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యాధికి కారణమవుతున్న కారకాల మీద ఆధారపడి దీని తీవ్రతలో మార్పులు వస్తున్నాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా కటి ప్రాంతంలోని కీళ్లు కూడా ప్రభావితమైన వారిలో 70 శాతం మందిలో ఇలాంటి హెచ్చుతగ్గులు కనిపిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌ ముఖ్యంగా వెన్నెముక, కటి ప్రాంతంలోని కీళ్లను మాత్రమే కాదు.. కాళ్లూ చేతుల్లోని కీళ్లు, కళ్లు, పేగులనూ ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు కొందరిలో కొన్నిరోజుల పాటు పూర్తిగా కనిపించకుండా ఉంటుంటే.. మరికొందరిలో పెరుగుతూ, తగ్గుతుంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందనేది మాత్రం తెలియదు. దీనిని కనుగొనేందుకే స్వాన్‌సీ యూనివర్సిటీకి చెందిన కూస్కీ, బృందం అధ్యయనం చేసి, సుమారు 71.4 శాతం మందిలో వ్యాధి లక్షణాలు పెరుగుతూ, తగ్గుతున్నట్టు గుర్తించారు.

కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశీలనలోనికి తీసుకోవాలి .

  • ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్‌ కి కారణము గుర్తించుట ,
  • జబ్బును అధికము చేసే రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకొనుట ,
  • ఆంకిలోసింగ్‌ స్పాండిలైటిస్ తో కూడా ఉన్న కాంప్లికేషన్‌స్ పరిశీలించడము ,
  • కీళ్ళ సంబంధిత కాంప్లికేషన్లు , బాదలు చూడడము .

No comments:

Post a Comment