Saturday, 26 March 2016

Amputation - యాంప్యుటేషన్‌(అవయవాన్ని తొలగించడం)


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -యాంప్యుటేషన్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఏదేని కారణంగా కాలు, చేయి వంటి శరీరంలోని ఒక అవయవాన్ని తొలగించడాన్ని యాంప్యుటేషన్‌ అంటారు. ఏ వయస్సులోని వారికైనా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడిన ప్పుడు యాంప్యుటేషన్‌ చేయాల్సి రావచ్చు.

యాంప్యుటేషన్‌కు కారణాలు:వ్యాధులు(diseases) : శరీరంలోని ఒక భాగాన్ని తొలగించాల్సి రావడమనేది అనేక పరిస్థితుల్లో కలుగుతుంది. కానీ ప్రధానంగా చెప్పుకోవాల్సినవి మధుమేహం, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు.

ప్రమాదాలు (Accidents): సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి, పరిశ్రమల్లో పని చేస్తే ప్రమాదాలకు గురైన వారికి యాంప్యుటేషన్‌ తప్పనిసరి అవుతుంటుంది.

పుట్టుకతో వచ్చే లోపాలు(congenital defects) : పుట్టుకతో వచ్చే లోపాల్లో అవయవం లేకపోవడం కాని, అతి చిన్నగా ఉండటం కాని జరిగితే దానిని యాంప్యుటేషన్‌గానే గుర్తిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రోస్థెటిక్‌ డివైస్‌ను రూపొందించి అమర్చడం జరుగుతుంది.

కంతులు (Tumours): ఎముకలకు సోకే కంతులకు (ఆస్టియో సార్కోమా) చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని సార్లు ఆ అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోగికి కాలు తొలగించాల్సిన పరిస్థితి వస్తే పాదాల వేళ్ల దగ్గరనుంచి తుంటి కీలు వరకూ వివిధ రకాలుగా తొలగిం చడం జరుగుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

ఫుట్‌ యాంప్యుటేషన్‌(Foot amputation) : పాదానికి సంబంధించినంత వరకూ అది కేవలం బొటన వేలుకో, కొన్ని వేళ్లకో పరిమితం కావచ్చు. లేదా పాదంలో కొంత భాగం వరకూ తొలగించాల్సి రావచ్చు. లేదా పాదం మొత్తంగా తొలగించాల్సి రావచ్చు.

ట్రాన్సటిబియల్‌ యాంప్యుటేషన్‌(Trans Tibial amputation) : మోకాలి కింది భాగంనుంచి కాలి మడమ వరకూ ఉండే భాగాన్ని తొలగించాల్సి వస్తే దానిని ట్రాన్స్‌టిబియల్‌ యాంప్యుటేషన్స్‌ అంటారు.

నీ డిసార్టిక్యులేషన్‌(Knee Dearticulation) : మోకాలి కీలు వద్ద చేసే యాంప్యు టేషన్‌ ఇది.
ట్రాన్స్‌ఫిమొరల్‌ యాంప్యుటేషన్‌(Trans femoral amputation) : మోకాలి కీలు భాగం నుంచి పైన తుంటి కీలు భాగం వరకూ తొలగించే శస్త్ర చికిత్స ఇది.
హిప్‌ డిసార్టిక్యులేషన్‌(Hip disarticulation) : ఈ రకమైన యాంప్యుటేషన్‌లో తుంటి కీలునుంచి మొత్తం తొడ భాగాన్ని తొలగించడం జరుగుతుంది.
చేతికి సంబంధించిన యాంప్యుటేషన్‌ రకాలు ఈ కింది విధంగా ఉంటాయి.
పార్షియల్‌ హ్యాండ్‌ యాంప్యుటేషన్‌(partial Hand amputation) : దీనిలో చేతి వేలును కాని, బొటన వేలును కాని, లేదా మణికట్టు కింద ఉండే చేతిలో భాగాన్ని తొలగించడం చేస్తారు.
రిస్ట్‌ డిసార్టిక్యులేషన్‌(Wrist dearticulation) : చేతిని మణికట్టు వరకూ తొలగిస్తారు.
ట్రాన్స్‌ రేడియల్‌ యాంప్యుటేషన్‌ : మోచేయి కింది భాగంనుంచి మణికట్టు వరకూ ఉండే భాగాన్ని తొలగించడం జరుగుతుంది.
ట్రాన్స్‌హ్యూమరల్‌ యాంప్యుటేషన్‌(Trans humeral amputation) : మోచేయి పైనుంచి భుజం కింది వరకూ ఉండే భాగం ఇది.
షోల్డర్‌ డిసార్టిక్యులేషన్‌(Shoulder Disarticulation) : భుజం వరకూ తొలగించే శస్త్ర చికిత్స ఇది. ఇందులో కాలర్‌ బోన్‌ను తొలగించవచ్చు. లేదా తొలగించకపోవచ్చు. షోల్డర్‌ బ్లేడ్‌ను మాత్రం అలాగే ఉంచుతారు.
ఫోర్‌క్వార్టర్‌ యాంప్యుటేషన్‌(Four quarter amputation) : దీనిలో కాలర్‌బోన్‌, షోల్డర్‌ బ్లేడ్‌తో సహా మొత్తాన్ని తీసివేయడం జరుగుతుంది.

No comments:

Post a Comment