Friday, 25 March 2016

Infection and Awareness - ఇన్‌ఫెక్షన్లు ప్రాథమిక అవగాహన


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఇన్‌ఫెక్షన్లు ప్రాథమిక అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


దేహానికి అపకారాన్ని కలుగజేసే సూక్ష్మక్రిములు (వీటిని పాథోజెన్స్‌ అంటారు) శరీరంలోకి ప్రవే శించినప్పుడు ఇన్‌ఫెక్షన్‌ కలుగుతుంది.
పాథోజెన్స్‌లో ఈ కింది రకాలుంటాయి. బాక్టీరియా, వైరస్‌, ప్రోటోజోవా, రికెట్సియే, ఫంగస్‌, పురుగులు మొదలైనవి. ఈ అన్ని రకాల క్రిములు ఒక మనిషినుంచి మరొక మని షికి అనేక మార్గాల ద్వారా అంటు (సోకు)తూ ఉంతాయి.

ఉదాహరణకు- ఒక వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిలోకి విరజిమ్మబడే తుంప రను అవతలి వ్యక్తి పీల్చడం ద్వారా, కొన్ని రకాల క్రిములు ముద్దు పెట్టుకోవడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. దోమల ద్వారా ప్రోటోజోవా రకానికి చెందిన ప్లాస్మో డియం అనే మలేరియా క్రిములు ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తాయి. పక్షుల ద్వారా, చిలకల ద్వారా సిట్టాకోసిస్‌ అనే బాక్టీరియా సోకుతుంది.

కలుషితమైన ఆహారం, నీరు, మట్టిలో కొన్ని విష క్రిములుంటాయి. ఇవి నోటి ద్వారా, శరీరంపై ఉండే గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. కొన్ని విష క్రిములు తల్లి ద్వారా గర్భధారణ సమయంలోనూ, ప్రసవ సమయం లోనూ బిడ్డకు సోకుతాయి.

ఇంక్యుబేషన్‌ పీరియడ్‌:
మనకు అపకారాన్ని కలుగజేసే క్రిములు ఒక సారి శరీరంలోకి ప్రవేశించాకా అవి తమ ఉత్ప త్తిని పెంచుతూ వృద్ధి చెందనారంభిస్తాయి. అయితే అవి శరీరంమీద ప్రభావాన్ని చూపుతూ తమ లక్షణాలను ప్రదర్శించటానికి కొంత సమయం పడుతుంది.
క్రిములు శరీరంలోకి ప్రవేశించి లక్షణాలను ప్రదర్శించడం ప్రారంభించే వరకూ ఉండే కాలాన్ని పొదగబడే కాలం లేదా ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ అని వ్యవహరిస్తారు.

ఒక మనిషిని అంటువ్యాధి సోకినప్పుడు అతని శరీరం ఆ ఇన్‌ఫెక్షన్‌ మీద పోరాటాన్ని సల్పటానికి తనలో కొన్ని యాంటీ బాడీస్‌ను అభివృద్ధి చేసుకుంటుంది. ఆ వ్యాధి తగ్గాకా కూడా ఆ యాంటిబాడీస్‌ అతడి శరీరంలో నిలువ ఉండి, మళ్లీ అలాంటి క్రిమి సోకిన ప్పుడు దానిని నివారించగలిగే స్థితిలో ఉండి ఆ క్రిమి సంబంధించినంతో అతడిలో సహజ నిరోధక శక్తిని తయారు చేస్తాయి.
శరీరంలోని వివిధ రకాల రోగాలతో పోరాడే యాంటీబాడీస్‌ తయారయ్యేట్లు టీకాల ద్వారా శరీరాన్ని కృత్రిమంగా ప్రేరేపిస్తుంటారు డాక్టర్లు.

టీకాలులోని సూత్రం:

ఫలానా వ్యాధికి సంబంధించిన పదార్థాన్ని తగు మోతాదులో టీకాలు ద్వారా శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ వ్యాధి ఏర్పడకుండానే ఆ వ్యాధితో పోరాడి గెలవగలిగే యాంటీబాడీస్‌ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అప్పటినుంచీ ఆ వ్యక్తిని ఆ వ్యాధి క్రిములు ఏమీ చేయజాలవు. అంటే అతడి శరీరం అప్పటినుంచి ఆ వ్యాధి క్రిములను నివారించగలిగే స్థితికి చేరుకుంటుం దన్నమాట. మరో మాటలో చెప్పాలంటే అతడికి ఇంక ఆ వ్యాధి రాదని అర్థం.

చికిత్స:

అంటువ్యాధులకు వైద్యపరమైన చికిత్స ఆయా వ్యాధికారక క్రిములనుబట్టి ఉంటుంది. ఉదాహరణకు - డిఫ్తీరియా (కోరింత దగ్గు), గనే రియా, న్యుమోనియా, సిఫిలిస్‌, క్షయ, టైఫా యిడ్‌వంటి బాక్టీరియా కారణంగా ఏర్పడే జబ్బు లకు యాంటీ బయాటిక్స్‌ అద్భుతంగా పని చేస్తాయి.
ప్రోటోజోవా క్రిముల వలన ఏర్పడే మలే రియా, ఫంగస్‌ వలన ఏర్పడే మధురాఫుట్‌, థ్రష్‌ వంటి వ్యాధులకు ఇతర మందులు ఉపయోగపడుతాయి.

లక్షణాలు:ఆయా వ్యాధులను బట్టి అంటువ్యాధు లక్ష ణాలు ఇలా ఉంటాయి. నీళ్ల విరేచనాలు, జ్వరం, తలనొప్పి, దద్దుర్లు మొదలైనవి.
నివారణ:పిల్లలకు అన్ని రకాల టీకాలను వేయించడం,
విదేశాలకు వెళుతున్నప్పుడు అక్కడ ప్రబలి ఉండే అంటువ్యాధుల గురించి డాక్టర్‌ను సంప్ర దించడం,
అంటువ్యాధులు ప్రబలి ఉన్న ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడి ఐస్‌క్రీమ్‌లు, అపరిశుభ్రమైన నీరు, ఆరిపోయిన లేదా సరిగ్గా ఉడకని ఆహార పదార్థాలు తినకుండా ఉండటం మొదలైన జాగ్రత్తలు పాటించాలి.

No comments:

Post a Comment