కోపము తో కాక నిద్రలో మనము అప్పుడప్పుదు పళ్ళు కొరుకుతుంటాం . రాత్రుళ్ళు పిల్లలు మరీ కొరుకు తుంటారు తెలియకుండానే . అది వ్యాధి ... మరి రాత్రులు ఇలా పళ్ళు కొరుకోవడం నిజంగా భయపడవలసినదా! ... అవును . దీన్ని బ్రూక్సిజమ్ (Bruxism) అంటారు . తమ పళ్ళు తామే అస్తమానము కొరుక్కోవడం కొంతమందిలో అలవాటు గా మారుతుంది . చాలా మంది తల్లిదండ్రులు పిల్లలలో ఇది చూసి పట్టించుకోరు . సాదారణం గా ఇది మానసిక ఒత్తిడివల్ల తెలియకుండానే వస్తుంది . కాని పిల్లల్లో మానసిక ఒత్తిడి పసివయస్సులో ఉండదు కాని చదువు బరువవుతున్న వయసులో ఉండవచ్చు .. అలవాటుగా మారవచ్చు . కొంతమంది పిల్లలలో పళ్లు సరిగ తయారవనపుడు వచ్చే ఇబ్బంది భావనవల్ల పళ్ళు కొరుకుతుంటారు . దంతవైద్యులు దీన్ని పళ్ళలో వచ్చే మార్పుగా భావిస్తారు . పళ్ళలో ఏర్పడే హెచ్చుతగ్గులవల్ల పిల్లలో వచ్చే రాపిడికి తెలియకుండ నిద్రలోను , మామూలుగాను పళ్లు కొరుకుతూ ఉంటారు . ఇది అలవాటుగా మారకూడదు .
ఈ మధ్య లక్నోలో జరిగిన ఒక పరిశోధన లో పిల్లలఓ పరీక్షలు , స్కూలులో మిగిలిన వర్కు , సెమినార్లు వంటి వాటివల్ల వచ్చే మానసిక ఒత్తిడి వల్ల ఈ పళ్ళు కొరకడం ఒక లవాటుగా వస్తుందని సూచిందినది . మిగతావాళ్ళతో తమను పోల్చిచూసుకోవడం తో వచ్చే స్పర్ధవల్ల వచ్చే ఒత్తిడి ఈ పళ్ళ కొరకడం అలవాటుకి కారణం అవుతోందని .. ఇది ఆడపిల్లలలోనూ వస్తుందని గుర్తించారు . చాలా మందిలో ఉండే ఈ మానసిక ఒత్తిడి , ఆరాటం (anxiety, stress) తమకి తెలియకుండా చేసే ఈ పళ్ళు కొరుక్కోవడం గా బహిర్గతమఫుతాయని వాళ్ళ భావన . ఇది పెద్ద వ్యాధి కాకపోవచ్చుకాని భవిష్యత్తులో అలవాటుగా మారకూడదు . మామూలుగా కాదు కాని పళ్ళు పూర్తిగా నిర్మించబడ్డాక , జ్ఞానదంతం ఏర్పడ్డాక కూడా ఈ పళ్లు వాళ్ళకి తెలియకుండా కొరుక్కుంటుంటే అది మంచి అలవాటు కాదు . పెద్దలు జాగ్రత్తపడాలి .
పిల్లలు రాత్రుళ్ళు పక్కవాళ్ళతో పడుకున్నప్పుడు పళ్ళు కొరు్కుతుంటే వాళ్ళు గమనించి చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి . పళ్ళలో హెచ్చు తగ్గులు ఉంటే దంతవైద్యుని సంప్రదించి సరిచేయించుకోవాలి . సాదారణము గా దంతవైద్యులు పిల్లలు పళ్ళు కొరికే విషయం లో చేసేది చాలా తక్కువ . ఎందుకంటే ఇది సాధారణం గా ఇతర కారణాల వల్ల వస్తుంది కాబట్టి . ఒక్కొక్కసారి ఈ " బ్రూక్సిజమ్ " విపరీతమై వారి పెద్దలకు , ఇతరులకు ఆదుర్దా , ఇబ్బంది కలుగజేస్తుంది . ముఖ్యము గా ఈ పళ్ళు కొరకడం తోపాటు ముఖం ఉబ్బటం , తలనొప్పి , దవడలు నొప్పిగా ఉండడం వంటివి వస్తే అప్పుడు తొందరపడాలి.
ముఖ్య కారణాలు :
- పాలపళ్ళు పెద్దవి గా ఉండడం ,
- పై వరుస పళ్ళు హెచ్చు తగ్గులు గా ఉండడం ,
- మానసిక ఒత్తిడి ఇతరులకి చెప్పుకోలేక తమలో తామే బాధపడుతూ ఉండడం ,
- ప్రతిదానికీ ఆదుర్ధాపడడం ,
- చాలా దూకుడుగా ఉండే ప్రవృత్తి ఉండడం ,
- నిద్రలోనే కాకుండా మాములుగా కూడా అప్పుడప్పుడు పళ్లు కొరుక్కోవడాం
- అస్తమానము గోళ్ళు కొరుక్కోవడం ,
- బొటనవ్రేలు నోటిలో పెట్టుకొని చప్పరించడం ,
- దవడ జారిందని , నొప్పిగా ఉందని అనడం ,
- బుగ్గ ఉబ్బి ఉండడం .
- పిల్లలు పళ్ళు కొరుక్కోవడం అలవాటు కి చదువో , పని ఒత్తిడో అని అనిపిస్తే రాత్రి పడికునే ముందు ఒక కప్పు వేడి పాలు పటిక బెల్లం కలిపి ఇవ్వండి .
- తనకిస్టమైన జానపద , పురాణకథల పుస్తకాలో , కార్టూన్ పుస్తకాలో చదువుతూ పడుకోమనండి .
- పళ్ళకి పెట్టుకునే " నైట్ గార్డ్ " అనే ప్లాస్టిక్ క్లిప్పులు వచ్చాయి. వైద్యుల సహాయము తో వాడండి .
- మానసికం గా పిల్లలను తయారు చేయాలి.
No comments:
Post a Comment