ఉదరకోశంలో ఏ అవయవానికి సమస్య ఎదు రైనా అది కడుపు నొప్పిగా ప్రదర్శితమవు తుంది. ఛాతీ ఎముకలు, డయాఫ్రం కిందు గానూ, కటివలయానికి పైభాగంలోనూ ఉదర కోశం అమరి ఉంటుంది. ఉదరకోశంలో జీర్ణకోశం, చిన్న ప్రేవులు, పెద్ద పేగు, కాలేయం, గాల్‌బ్లాడర్, పాంక్రియాస్ తదితర అవయవాలు ఉంటాయి. ఈ అవయవా లనుంచి ఉత్పన్నమయ్యే నొప్పినే మనం కడుపు నొప్పి అని వ్యవహరిస్తుంటాము. కొన్నిసార్లు ఉదరకోశంలోని అవయవాల నుంచి కాకుండా, ఉదరకోశానికి సమీపంలో ఉండే ఇతర అయవాలనుంచి వెలువడే నొప్పి కూడా కడుపు నొప్పిగా ప్రదర్శితమవుతుంది.
ఉదాహరణకు శ్వాసకోశాల కింది భాగం, మూత్రపిండాలు, గర్భాశయం, అండాశయం మొదలైన ఇతర అవయవాలనుంచి వెలువడే నొప్పి కడుపు నొప్పిగా అనిపించవచ్చు.
అలాగే ఉదరకోశంలోని అవయవాలకు సంబంధించిన నొప్పి ఉదరకోశానికి వెలుపలి నొప్పిగా కనిపించవచ్చు. ఉదాహరణకు పాంక్రియాస్‌కు సమస్య ఎదురైనప్పుడు అది నడుము నొప్పిగా భ్రమింపజేయవచ్చు.
అంటే ఈ నొప్పులు ఉత్పన్నమైన చోట కాకుండా, ఇతర ప్రదేశంలో బహిర్గతమవవచ్చు. ఈ రకమైన నొప్పులను వైద్యపరిభాషలో రిఫర్డ్ పెయిన్స్ అని అంటారు.
కారణాలు:
ఇన్‌ఫ్లమేషన్ (ఉదాహరణలు - అపెండిసై టిస్, డైవర్టిక్యులైటిస్, కొలైటిస్‌వంటి వ్యాధులు)
ఉదరకోశం ఉబ్బటానికి కారణమయ్యే అంశాలు (ఉదాహరణకు చిన్న ప్రేవుల్లో అడ్డం కులు, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడి పైత్యరస వాహిక (బైల్‌డక్ట్)లో అడ్డంకి ఏర్పడటం, హెపటై టిస్ కారణంగా కాలేయం వాపు చెందడం మొదలైనవి)
ఉదరకోశంలోని ఏదేని అవయవానికి రక్త సర ఫరా సక్రమంగా జరుగకపోవడం (ఉదాహరణకు - ఇస్కిమిక్ కొలైటిస్ వ్యాధి)
ఇవేకాక మరికొన్ని అంశాలు కూడా కడుపు నొప్పికి కారణమవుతాయి.
ఉదాహరణకు ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (కొన్నాళ్లు మలబద్ధకం, మరికొన్నాళ్లు విరేచ నాలు కలగడం) వంటి వ్యాధిలో కడుపు నొప్పి తీవ్రంగా ఉంటుంది.
అయితే ఈ వ్యాధిలో కడుపు నొప్పి ఎందుకు వస్తుందనే విషయం ఇదమిత్థంగా తెలియదు. కాని చిన్న ప్రేవుల కండరాలు అసాధారణంగా వ్యాకోచ సంకోచాలకు గురి కావడం కాని, చిన్న ప్రేవుల్లో ఉండే సున్నితమైన నరాలు నొప్పికి సంబంధించిన సంకేతాలను విడుదల చేయడం వంటివి కారణమై ఉంటాయని భావిస్తున్నారు.
ఈ రకమైన కడుపు నొప్పులను వైద్య పరి భాషలో ఫంక్షనల్ పెయిన్స్ అని వ్యవహరి స్తారు. ఎందుకంటే వీటిలో కడుపు నొప్పికి స్పష్టమైన కారణమంటూ కనపించదు కనుక.
వ్యాధి నిర్ధారణ:
కడుపు నొప్పిని నిర్ధారించడానికి ఈ కింది అంశాలు ఉపకరిస్తాయి.
- నొప్పి లక్షణాలు
- రోగిని భౌతికంగా పరీక్షించడం
- ఎక్స్‌రేలు, ఎండోస్కోపి తదితర పరీక్షలు
- శస్త్ర చికిత్సలు
నొప్పి లక్షణాలు:
రోగిని ప్రశ్నించడం, భౌతికంగా పరీక్షించడం ద్వారా కడుపు నొప్పికి కారణాలేమిటో తెలుసు కుని వ్యాధిని నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఈ కింది అంశాలు దోహద పడతాయి.
నొప్పి ఎలా ప్రారంభమైంది? : నొప్పి ఎలా ప్రారంభమైందనే అంశం అతి ముఖ్యమైనది. ఉదాహరణకు కడుపు నొప్పి హఠాత్తుగా ప్రారం భమైతే పెద్ద పేగుకు రక్త సరఫరాకు అంత రాయం కలిగినట్లు కాని, పిత్తనాళంలో రాళ్ల వల్ల అడ్డంకి ఏర్పడటం కాని కారణమై ఉండవచ్చు నని ఊహించవచ్చు.
నొప్పి ఏ భాగంలో ఉంది? : అపెండిసైటిస్ కారణంగా కలిగే కడుపు నొప్పి ఉదరకోశంలో కుడి కింది భాగంలో, అపెండిక్స్ ఉన్న ప్రాంతంలో ఏర్పడుతుంది.
సాధారణంగా అపెండిసైటిస్ నొప్పి బొడ్డు ప్రాంతంలో ఆరంభమై నెమ్మదిగా అపెండిక్స్ ఉన్న ఉరదకోశంలోని కుడివైపు కింది భాగానికి చేరుతుంది.
డైవర్టిక్యులైటిస్ కారణంగా ఏర్పడే కడుపు నొప్పి ఉదరకోశంలో ఎడమవైపు కింది భాగంలో ఉంటుంది.
పిత్తాశయంలో సమస్య వల్ల కలిగే కడుపు నొప్పి ఉదరకోశం కుడివైపు పైభాగంలో పిత్తాశయం ఉన్న ప్రాంతంలో ఏర్పడుతుంది.
నొప్పి ఏ తీరుగా ఉంది? : నొప్పి ఏ తీరుగా ఉందనే అంశం మరికొన్ని సమస్యలను తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. ఉదాహరణకు చిన్న ప్రేవుల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల కలిగే కడుపు నొప్పి తెరలు తెరలుగా ప్రారంభమవు తుంది. బిగబట్టినట్లుండే నొప్పి చిన్నప్రేవులు తీవ్రంగా సంకోచిం చినట్లు సూచిస్తుంది.
పైత్యరస వాహికలో రాళ్ల వల్ల అడ్డంకి ఏర్ప డిన కారణంగా కలిగే నొప్పి ఉదరకోశం ఊర్ధ్వ భాగంలో నిరంతరం కొనసాగే నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి కనీసం 30 నిముషాల నుంచి కొన్ని గంటలపాటు కొనసాగు తుంది.
అక్యూట్ పాంక్రియాటైటిస్ కారణంగా కలిగే నొప్పి చాలా తీవ్రంగా, భరించలేని స్థాయిలో ఉదరకోశం ఊర్ధ్వ భాగంలోనూ, నడుము పైభాగంలోనూ వస్తుంది.
నొప్పి కొనసాగే కాలం : ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ కారణంగా కలిగే కడుపు నొప్పి తీవ్రస్థాయికి చేరి, నెమ్మదిగా ఉపశమిస్తుంది. ఇది కొన్ని నెలలనుంచి సంవత్సరాల వరకూ కొనసాగవచ్చు.
గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడటం వల్ల కలిగే నొప్పి కొన్ని గంటలపాటు ఉంటుంది.
కడుపులో అల్సర్లు, జీర్ణకోశంనుంచి ఆమ్లాలు పైకి ఆహారనాళంలోకి ఎగదన్నడం వంటి సమస్యల కారణంగా ఉత్పన్నమయ్యే నొప్పి కొన్ని వారాలు లేదా నెలలపాటు తీవ్రంగా ఉంటుంది. తరువాత కొన్ని వారాలు, నెలలు తక్కువగా ఉంటుంది.
నొప్పి తీవ్రం కావడానికి కారణాలు : అవ యవం కందినట్లు అయి, వేడి, మంట, నొప్పి మొదలైన వాటితో కలిసి వాపు చెందడాన్ని ఇన్‌ఫ్లమేషన్ అంటారు. ఇన్‌ఫ్లమేషన్ కారణంగా కలిగేనొప్పి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, కదలి నప్పుడు తీవ్రమవుతుంది. అపెండిసైటిస్, డైవ ర్టిక్యులైటిస్, కొలి సిస్టయిటిస్, పాంక్రియాటైటిస్ వంటి వ్యాధులను దీనికి ఉదాహరణగా చెప్పు కోవచ్చు.
నొప్పిని ఉపశమింపజేసే అంశాలు : ఇరి టబుల్ బొవెల్ సిండ్రోమ్ కారణంగా కాని, మలబద్ధకం వల్ల కాని కలిగే నొప్పి మల విసర్జన అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల ఉపశమిస్తుంది.జీర్ణాశయంలో లేదా చిన్న ప్రేవుల్లో ఏదేని అడ్డంకి కారణంగా కలిగే నొప్పి వాంతి జరిగిన తరువాత కడుపు ఉబ్బరం తగ్గిపోవడంతో తాత్కాలికంగా ఉపశమిస్తుంది.
జీర్ణాశయంలో కాని, డుయోడినమ్ (జీర్ణాశ యాన్ని, చిన్న ప్రేవులను కలిగే భాగం)లో కాని ఏర్పడిన అల్సర్ల కారణంగా కలిగే నొప్పి ఆహా రాన్ని తీసుకోవడం వల్ల లేదా యాంటాసిడ్ మందులను తీసుకోవడం వల్ల ఉపశమిస్తుంది.
No comments:
Post a Comment