Friday 18 March 2016

Virus - వైరస్ - virus structure



  • ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - వైరస్ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వైరస్ అనగా జీవజాలంపై దాడి చేసే అతి సూక్ష్మమైన కణాలని అర్థం. వైరస్ అన్నది క్రింది వాటిని కూడా సూచిస్తుంది:

* జీవ(హ్యూమన్‌) వైరస్--ఇవి ఇతర జీవుల కణాలపై దాడిచేసి వ్యాధులను కలుగజేస్తాయి ,
*కంప్యూటర్ వైరస్--కంప్యూటర్ వైరస్ అనేది తనకు తానే కాపీ చేసుకుని కంప్యూటర్ యజమాని యొక్క అనుమతి లేదా అవగాహన లేకుండా కంప్యూటర్‌కు నష్టం కలిగించే ఒక కంప్యూటర్ ప్రోగ్రాం.,
* మొబైల్ వైరస్-- మొబైల్ పరికరాలకు నష్టం కలిగించే ఒక కంప్యూటర్ ప్రోగ్రాం ,

  • జీవ(హ్యూమన్‌) వైరస్ :
వైరస్ అనే పదము లాటిన్ భాష నుండి ఉద్భవించింది. లాటిన్‌లో వైరస్ అంటే టాక్సిన్ లేదా విషము అని అర్థం. వైరస్‌లు అతి సూక్షమైనవి (సుమారుగా 15-600 నానోమీటర్లు). ఇవి ఇతర జీవుల కణాలపై దాడిచేసి వ్యాధులను కలుగజేస్తాయి. ఈ దాడి ముఖ్య ఉద్దేశ్యము వైరస్‌ల సంతతిని పెంచుకోవడముతో ముడిపడి ఉంటుంది. వైరస్‌లు వాటంతట అవి విభజన చెందలేవు. విభజన చెందాలంటే వేరే జీవకణం తప్పనిసరి. వైరస్‌లలో అతి సరళమైన జన్యుపదార్థం ఒక రక్షణ కవచంచే సంరక్షించబడుతూ ఉంటుంది. ఈ రక్షణ కవచం ప్రోటీనులతో చేయబడి ఉంటుంది, దీనిని క్యాప్సిడ్ అంటారు. వైరస్‌లు చాలా రకాల జీవులపై దాడి చేయగలవు (బాక్టీరియా, జంతురాజ్యము, వృక్షరాజ్యంతో పాటు శిలీంధ్రాలు, ప్రొటిస్టా కి చెందిన జీవులు కూడా వీటి దాడికి గురవుతుంటాయి). బాక్టీరియాపై దాడిచేసే వైరస్‌ను బాక్టీరియోఫేజ్ (సరళత కొరకు ఫేజ్) అని అంటారు. వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అని, వీటిని అధ్యయనం చేసే వారిని వైరాలజిస్టులని అంటారు .

No comments:

Post a Comment