-ఊపిరితిత్తుల్లో ఉండే గాలి గదుల (ఆల్వి యోలై) మధ్య ఉండే కణజాలాన్ని ఇంటర్‌స్టిష ియమ్ అంటారు. ఈ కణజాలం దెబ్బ తిన్నప్పుడు (ఫైబ్రోసిస్ ఏర్పడ్డప్పుడు) ఏర్పడే స్థితిని ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డి) అంటారు.
ఊపిరితిత్తులకు సోకే ఇంటర్‌స్టిషియల్ వ్యాధుల్లో సుమారు 180 వరకూ దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నాయి. వాటిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి - దీర్ఘకాలిక వ్యాధులు, కేన్సరేతర వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ కాని వ్యాధులు :
వ్యాధులు:
ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజెస్‌ను ఇంటర్ స్టిషియల్ పల్మొనరీ ఫైబ్రోసిస్ అని పల్మొనరీ ఫైబ్రోసిస్ అని కూడా అంటారు. ఐఎల్‌డి వ్యాధి తాలూకు లక్షణాలు ఒక్కొక్క బాధితుడిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. అయితే ఐఎల్‌డి సోకడంలో కనిపించే సాధారణ లక్షణం వాపు, కమిలినట్లు ఎర్రగా మారడం (ఇన్‌ఫ్లమేషన్).
బ్రాంకియోలైటిస్ :
ఊపిరితిత్తుల్లోని సూక్ష్మ వాయు మార్గాలు వ్యాధిగ్రస్తమైతే దానిని బ్రాంకియోలైటిస్ అంటారు.
ఆల్వియోలైటిస్:
ఊపిరితిత్తుల్లోని గాలి గదులు వ్యాధిగ్రస్తమై నప్పుడు దానిని ఆల్వియోలైటిస్ అని వ్యవహ రిస్తారు.
వాస్క్యులైటిస్:
సూక్ష్మ రక్తనాళికలకు సోకే వ్యాధి ఇది.
ఇంటర్‌స్టిషియల్ వ్యాధుల్లో 80 శాతం కంటే ఎక్కువ వ్యాధులను మందుల వాడకం వల్ల వచ్చే న్యుమోకొనియోసిస్ వ్యాధిగా కాని, హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ వ్యాధిగా కాని నిర్ధారించడం జరుగుతుంటుంది.
ఐఎల్‌డిలో ఇతర రకాలు:
- సార్కాయిడోసిస్
- ఇడియోపతిక్ పల్మొనరీ ఫైబ్రోసిస్
- బ్రాంకియోలైటిస్ ఆబ్లిటెరాన్స్
- హిస్టియోసైటోసిస్ ఎక్స్
- క్రానిక్ ఇసినోఫిలిక్ న్యుమోనియా
- కొల్లాజెన్ వాస్క్యులార్ డిసీజ్
- గ్రాన్యులోమాటస్ వాస్క్యులైటిస్
- గుడ్‌పాశ్చర్స్ సిండ్రోమ్
- పల్మొనరీ ఆల్వియోలార్ ప్రొటీనోసిస్
ఎలా సోకుతుంది?
ఈవ్యాధి మూడు ప్రధానమార్గాల ద్వారా సోకుతుంది.
- ఏ కారణంగానైనా ఊపిరితిత్తుల కణజాలం దెబ్బ తినడం ద్వారా,
- ఊపిరితిత్తుల్లోని గాలి గదుల గోడలు వ్యాధిగ్రస్తం కావడం
- ఇంటర్‌స్టిషియంపై మచ్చలు (స్కారింగ్/ ఫైబ్రోసిస్) ఏర్పడటం
కణజాలానికి ఫైబ్రోసిస్ సోకడం ద్వారా ఆ కణజాలం శాశ్వతంగా శ్వాస తీసుకోవడానికి, ఆక్సిజన్‌ను తీసుకు వెళ్లడానికి పనికి రాకుండా దెబ్బతింటుంది.
ఈ రకమైన స్కార్ కణజాలం ఏర్పడటంతో గాలి గదులు, వాటి చుట్టూ ఉండే కణజాలం, ఊపిరితిత్తుల్లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బ తింటాయి. ఈ వ్యాధులు నెమ్మదిగా కాని, వేగంగా కాని పెరుగుతాయి.
ఐఎల్‌డికి గురైన వారిలో లక్షణాలు స్వల్ప స్థాయినుంచి తీవ్రస్థాయి వరకూ వివిధ రకాలుగా ఉంటాయి. ఐఎల్‌డి సోకిన తరువాత పరిస్థితి అదే విధంగా దీర్ఘకాలంపాటు కొనసాగవచ్చు. లేదా లక్షణాలు అతి వేగంగా మారుతూ రావచ్చు.
ఐఎల్‌డి పరిస్థితి ఇలా ఉంటుందని వివరించడం కష్టం. ఈ వ్యాధి పురోగతి చెందితే ఊపరితిత్తుల కణజాలం మందంగా మారి గట్టిపడుతుంది. అప్పుడు శ్వాస తీసుకోవడం చాలా కష్టతరంగా మారుతుంది.
ఐఎల్‌డిలో కొన్ని వ్యాధుల్లో ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు మందులతో చికిత్స చేస్తే వ్యాధి నయమవుతుంది. కొంతమందికి చికిత్సలో భాగంగా ఆక్సిజన్ ఇవ్వవలసి రావచ్చు.
లక్షణాలు:
ఐఎల్‌డిలో కనిపించే సాధారణ లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. అయితే బాధితులలో లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా కనిపించవచ్చు.
- హ్రస్వ శ్వాస, ముఖ్యంగా శారీరకంగా శ్రమ చెందినప్పుడు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది
- నిస్త్రాణ, నీరసం,
- ఆకలి తగ్గి పోవడం
- బరువు తగ్గి పోవడం
- కళ్లె లేకుండా కొనసాగే పొడి దగ్గు
- ఛాతీలో అసౌకర్యంగా ఉండటం
- ఊపిరితిత్తుల్లో రక్తనాళాలు చిట్లిపోవడం
ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్‌లో కనిపించే లక్షణాలే ఇతర వ్యాధుల్లో కూడా కనిపించ వచ్చు. కనుక వైద్య నిపుణులతో సరైన వ్యాధి నిర్ధారణ చేయించుకుని చికిత్స తీసుకోవాలి.
ఐఎల్‌డికి కారణాలు:
ఐఎల్‌డి సోకడానికి గల కారణాలేమిటనేవి ఇతమిత్థంగా తెలియదు. అయితే వాతా వరణ కాలుష్యం ఈ వ్యాధికి ఒక ప్రధాన కారణం ఇతర కారణాల్లో - సార్కాయిడోసిస్, కొన్ని రకాల మందులు, రేడియేషన్, సంధాయక కణజాల వ్యాధులు, కుటుంబ చరిత్ర మొదలైనవి ముఖ్యమైనవి.
వ్యాధి నిర్ధారణ :
పల్మొనరీ ఫంక్షన్ టెస్ట్, స్పైరోమెట్రీ, పీక్‌ఫ్లో మీటర్, రక్త పరీక్షలు, ఎక్స్‌రే, కంప్యూటరైజ్డ్ యాక్సిల్ టోమోగ్రఫీ (సి.ఎ.టి.) స్కాన్, బ్రాంకోస్కోపీ, బ్రాంకోఆల్వియోలార్ లావేజ్, లంగ్ బయాప్సి మొదలైన పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది.
చికిత్స :
ఐ.ఎల్.డి వ్యాధికి ఒక కారణము కాదుకాబట్టి వ్యాధిననుసరించి చికిత్స చేయాలి . బాధనివారణ కోసము ఆయాసము తగ్గేమందులు ... డెరిఫిలిన్ ఇంజక్షన్ లేదా మాత్రలు , కార్టికోస్టెరాయిడ్స్ (ప్రెడ్నిసొలోన్) వాడాలి .
No comments:
Post a Comment