Wednesday, 23 March 2016

Opthalmic complications of Hyperthyroid - కళ్లకు వచ్చే హైపర్-థైరాయిడ్‌ వ్యాధి లక్షణాలు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కళ్లకు వచ్చే హైపర్-థైరాయిడ్‌ వ్యాధి లక్షణాలు , Opthalmic complications of Hyperthyroid- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 


థైరాయిడ్‌ గ్రంథిలో సమస్య వస్తే అది కంటిపైన కూడా ప్రభావం చూపుతుంది. థైరాయిడ్‌ సంబంధ ఆఫ్తాల్మపతి మానసిక సమస్యలకు దారితీస్తుంది. సీతాకొకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్‌ మెడ ముందు భాగంలో ఉంటుంది. ఇది థైరాక్సిన్‌ హార్మోనును స్రవిస్తుంది. హార్మోను శరీరంలోని సాధారణ జీవక్రియలను నిర్వహించడానికి తోడ్పడుతుంది. కానీ, కొన్నిసార్లు అసాధారణంగా అధిక మొత్తంలో థైరాక్సిన్‌ స్రవిస్తే ఇది దుష్ఫ్రభావాలకు దారితీస్తుంది. దీని ఫలితంగా జీవక్రియ రేటు అధికమవుతుంది. థైరాయిడ్‌ గ్రంథి... కళ్ల కండరాలు ను కదలిస్తాయి. ఇవి ఉమ్మడి యాంటిజెన్‌ను పంచుకుంటాయి. థైరాయిడ్‌ గ్రంథిపై దాడిచేసే యాంటిబాడీలు కంటిలోని ఎక్స్‌ట్రా-అకులర్‌ కండరాలపై కూడా దాడిచేస్తాయి. ఫలితంగా కండరాలు, చుట్టు ఉన్న కొవ్వు కణజాలంలో వాపులొస్తాయి. అకస్మాత్తుగా జరిగే పరిణామం వల్ల రోగి రెప్పలార్పకుండా చూస్తాడు. 

కంటిలో మార్పులు : థైరాయిడ్‌ ప్రభావం వల్ల కళ్లకు ఏర్పడిన పరిస్థితిని 'థైరాయిడ్‌ రిలేటెడ్‌ ఆప్తాల్మపతి' లేదా 'గ్రేవ్స్‌ ఆప్తాల్మపతి' అంటారు. కంటిలో ఏర్పడే మార్పులను నిర్ధారణ పరీక్ష ద్వారా హైపర్‌థైరాయిడ్‌ అని గుర్తించొచ్చు. కళ్లు ఎర్రగా మారతాయి. చిరాకుకు గురవుతాయి. కంటివెనక బిగపట్టినట్టు ఉంటుంది. కళ్లు బయటికి పొడుచుకుని వస్తాయి. కంటిరెప్పలు ఉబ్బుతాయి. ఇలాంటి పరిస్థితిలో వెంటనే వైద్యం చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే ఒక వస్తువు రెండుగా కనిపించే డిప్లొపియా వస్తుంది. అరుదైన కేసుల్లో విస్తరించిన కండరాలు కంటి నరాన్ని ఒత్తుతాయి. ఈ నరం మెదడు నుంచి కంటి దృష్టి సంబంధ ప్రేరణను పొందుతుంది. నరం ఒత్తిడికి గురవడం వల్ల అంధత్వం కలుగుతుంది. 

చికిత్స : ఈ సమస్యకు తొలిదశలో రక్తపరీక్షలు చేస్తారు. దీని వల్ల థైరాయిడ్‌ హార్మోన్‌ స్థాయిని, యాంటి-థైరాయిడ్‌ యాంటిబాడీస్‌ను గుర్తించొచ్చు. కంటి చూపు, వర్ణాంధత, దృష్టి క్షేత్రం, కంటి ఒత్తిడి, ఎక్స్‌ట్రా-అకులర్‌ మూవ్‌మెంట్‌లను సాధారణ కంటి పరీక్షల ద్వారా గుర్తించొచ్చు. కంటి కండరాలు విస్తరించాయా? లేదా? అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ లేదా సిటి స్కాన్‌ పరీక్షలు ఉపకరిస్తాయి. ఎండొక్రినాలజిస్ట్‌ పర్యవేక్షణలో మందులు తీసుకోవాలి. మందులు థైరాయిడ్‌ హార్మోనును, వాపును తగ్గిస్తాయి. ధూమపానం, అధిక ఒత్తిడి వ్యాధి తీవ్రతను పెంచుతాయి. అందుకని ఈ సమస్యతో బాధపడేవారు వీటిని ధూమపానం మానాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. చికిత్సలో భాగంగా కంట్లో చుక్కల మందులు పోయాల్సి ఉంటుంది. కళ్లు తేమగా ఉండటానికి పైపూత మందు పూయాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు తల ఎత్తుగా ఉండటానికి అదనంగా ఇంకో దిండును పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉదయం లేచిన వెంటనే కంటిచుట్టూ ఏర్పడే వాపు తగ్గుతుంది. సమస్య ఒకసారి నియంత్రణలోకి వస్తే రోగి రెప్పలార్పకుండా చూసే పరిస్థితి నుంచి బయటపడొచ్చు. మందుల వల్ల నయం కాని కేసులకు శస్త్రచికిత్స పరిష్కార మార్గం. దీని వల్ల రెప్పలను సాధారణ స్థితిలోకి తీసుకోవచ్చు. ఒక వస్తువు రెండుగా కనిపించే డిప్లొపియను తొలి దశలోనే చికిత్స చేస్తే మేలు. ఈ దశ దాటితే శస్త్రచికిత్స ద్వారా కంటి కండరాలను పూర్వస్థితికి తీసుకురావొచ్చు. పట్టకంతో కూడిన ప్రత్యేక కళ్లద్దాలు వాడాలి. ఇక దీర్ఘకాలంగా చికిత్స లేని కేసులకు కాస్మొటిక్‌ శస్త్ర చికిత్స చేస్తారు. 

No comments:

Post a Comment