Tuesday 2 February 2016

Eczema in children - చిన్న పిల్లలలో ఎగ్జిమా




కొంతమంది చిన్నపిల్లల్లో చర్మం పొడిబారి, పొట్టుగా రాలిపోతుంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే.. వారు ఎటోపిక్ డెర్మటైటిస్ లేదా ఎగ్జిమా వ్యాధితో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. మనం ఉపయోగించే నూనె, సబ్బు, కాస్మెటిక్స్, బట్టలు, ఆభరణాలు, వాతావరణంలోని మార్పులు, తీసుకునే ఆహారం, మానసిక ఒత్తిడి.. తదితర అంశాలు ఎగ్జిమా వ్యాధికి దోహదం చేస్తాయి. పిల్లల్లో ఇది తరచూ మోచేతులు, తొడలు, బుగ్గలు, నుదురు లాంటి భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

* ఎగ్జిమాతో బాధపడే పిల్లలకు దురదలు రాకుండా ఉండేటట్లు చూడాలి. వారికి స్నానం చేయించిన వెంటనే మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయాలి. ఇలా చేస్తే చర్మం తేమగా ఉంటుంది. లేకపోతే చర్మం పొడిబారి సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడే పిల్లలకి ఆయిల్ బేస్డ్ సోపులను వాడటం శ్రేయస్కరం.

* ఇంట్లో దుమ్మూ, ధూళీ లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. కార్పెట్లు, కర్టెన్లు, బెడ్‌షీట్లు కూడా శుభ్రంగా ఉంచాలి. ఇదే వ్యాధితో బాధపడే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు 3, 4 నెలల్లోపే ఘనపదార్థాలు ఇవ్వటం వల్ల కూడా ఎగ్జిమా వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి.. కనీసం ఆరు నెలలదాకా పిల్లలకు పాలు పట్టించటం ఉత్తమం.

* సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే.. చాలా తక్కువ డోసులో స్టెరాయిడ్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్ లాంటివి వాడవచ్చు. అయితే ఇవి వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండటమేగాక, చలికాలంలో మరింత తీవ్రంగా బాధిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

No comments:

Post a Comment