అష్టావధానం అన్న మాట వర్కింగ్ విమెన్ కు అక్షరాలా సరిపోతుంది. ఒంటి చేత్తో ఎన్నో పనులు ఏక కాలంలో ఏ విధంగా చేయవచ్చో వర్కింగ్ విమెన్ కు తెలిసినట్లుగా ఎవరికీ సరిపోదంటే అతిశయోక్తి కాదు. సూపర్ ఫాస్టు ఎక్సుప్రెస్‌మాదిరిగా పరుగులు తీయాల్సిందే. ఇన్ని పనుల మధ్య ఎదురయ్యే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఈ ఒత్తిడిని జయించకపోతే అనారోగ్యం పాలు కాక తప్పని సరి.
సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే వర్కింగ విమెన్ కు ఇంటి పని స్వాగ తం పలుకుతుంది. పిల్లలు స్కూల్సు లేక కాలేజీలకు వెళ్లడానికి అవసర మైనవన్నీ సమకూర్చటం తల్లిబాధ్యతే అవుతుంది. ఈ లోగా భర్త ఆఫీసుకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకొంటూనే, తాను ఆఫీసుకు చేరుకోవటానికి సర్దుకో వాల్సి ఉంటుంది . ఇందుకో సం ఉరుకులు, పరుగులు తప్పనిసరి.ఆ తర్వాత అందుబాటులో ఉన్న వాహనాన్ని అంది పుచ్చుకొని కార్యాలయానికి పరుగులు తీస్తారు. అక్కడ పని మీద కాన్ సంట్రేషన్ చేయకపోతే సమస్యలు తప్పవు. సాయంత్రం ఇంటికి వస్తూనే మళ్లీ పని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ మొత్తం స్ట్రక్చర్ లో ఎక్కడ తేడా వచ్చినా ఒత్తిడిని ఫేస్‌చేయాల్సిందే.
శరీరంలో ఒత్తిడి ఏర్పడితే వెంటనే దానికి సంబంధించిన ర్యాడికల్సు శరీరంలో తయారు అయిపోతాయి. ఇవి ఎప్పటికప్పుడు శ రీరంలో నెగటివ్ పనుల్ని మొదలు పెడతాయి. ఇవి క్రమంగా నాడీ వ్యవస్థను ఇబ్బంది పెడతాయి. అందుచేత ఈ పరిస్థితి తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.
ఒత్తిడిని జయించేందుకు కొన్ని సూత్రాలు తెలుసుకొందాం...
బ్రేక్‌ఫాస్టును మానవద్దు...:
చాలా మంది వర్కింగ్ విమెన్ బ్రేక్ ఫాస్టును పక్కన పెట్టేస్తారు. ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకొంటారు. శరీరానికి నిరంతరాయంగా శక్తి అందుతూ ఉండాలి. అప్పుడే సజావుగా అది తన పనులు తాను చేసుకో గలుగుతుంది. రాత్రి 8-9 గంటల సమయంలో భోజనం చేసి పడుకొంటే ఉదయం బ్రేక్ ఫాస్టు ను పక్కన పెట్టేస్తారు. లేదంటే ఆఫీసుకి వెళ్లాక 10-11 అయ్యాక అప్పుడు తింటారు. అంటే రోజులో 24 గంటలు ఉంటే అందులో సగం సేపు అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9గంటల దాకా ఏమీ తీసు కోరు అన్నమాట. తర్వాత సగం సేపులోనే మొత్తం ఆహారాన్ని తీసుకొంటారు.
దీని వలన జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అంతే గాకుండా ఉదయం పూట శరీరానికి కావలసిన శక్తి ఏమాత్రం అందదు. పైగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చెపిన మాట వినక పోవచ్చు. దీంతో చిరాకు పెరిగి పోయి.. అరుపులు, ేకలతో ఇల్లు ప్రతిధ్వనిస్తుంది. దీన్ని అధిగమించాలంటే ఉదయాన్నే బలమైన బ్రేక్ ఫాస్టు తీసుకోవాల్సి ఉంటుంది.
రోజు వారీ పనుల్ని ప్రణాళికా బద్దం...:
ప్రతీ రోజు చేసే పనులు అయినప్పటికీ వాటి కోసమే చాలా సేపు వెదకులాట సాగుతుంది. ఉదయం పూట టీ మగ్‌కనిపించ లేదనో, ఆఫీసుకి వెళ్లేప్పుడు ఫైల్స కనిపించ లేదనో వెదకులాట తప్పదు. అయితే పనుల్ని క్రమబద్దం చేసుకొంటే ఈ చికాకుల్ని తప్పించుకోవచ్చు. వాస్తవానికి ఒకే దాని కోసం అదే పనిగా వెదకుతుంటే నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక అంశంలో మిస్ అయ్యామన్న ఇండి కేషన్ అదే పనిగా వెళితే .. ఇది మరో నాడీ కేంద్రాన్ని డిస్టర్బ చేస్తుంది. దీని ఫలితంగా ఒత్తిడి పెరిగి మరో విషయంపై ఏకాగ్రత లోపిస్తుంది. చివరకు ఈ చికాకు మిగిలిన వాటి మీద పడుతుంది. దీన్ని అధిగమించాలంటే ప్రణాళికా బద్దంగా సాగుట మేలు. అంటే ఉదయం చేసుకోవాల్సిన పనుల్ని ఒక చోట నమోదు చేసుకొని సరి చూసుకోవాలి.
ఖాళీ సమయంలో ఆయా పనుల్ని ఎలా చేసుకోంటునామో బేరీజు వేసుకొంటే నియమబద్దంగా సాగిపోతాయి. పనులు చేసే సమయాన్ని తగ్గించుకోవటం... అవకాశం ఉన్నప్పుడు ఈ పనుల జాబితాను సరిచూసుకోవాలి. అటువంట ప్పుడు ఎక్కడ సమయం వేస్టు అవుతోందో అన్నది అర్థం అయిపోతుంది. అటువంటప్పుడు కొద్దిపాటి సమయాన్ని ఎక్కడ మిగుల్చుకోవచ్చో ఆలోచిం చాలి. ఈ సమయాన్ని మిగిలిన పనులు ప్రశాంతంగా చేసుకొనేందుకు కేటా యించాలి. లేని పక్షంలో హడావుడి పెరిగినప్పుడు దీని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. తొందర పాటుతో పని చేస్తే గుండెల్లో దడ రావటం, తల నొప్పి వస్తుండటం వంటివి జరుగుతుంటాయి. ఈ పరిస్తితిని అధిగమించటా నికి కొందరు టాబ్లెట్లు వాడేస్తుంటారు. దీని వలన మరిన్ని అనర్థాలు వచ్చిపడు తుంటాయి.
కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోవటం...:
పనులు చేసుకొనే క్రమంలో పనుల్ని డిస్ట్రిబ్యూట చేసుకోవాలి. ద సిక్సు కీస్‌టూ పెర్ ఫామ్ లొ యువర్ ప్రోడక్టివ్ బెస్టు అనే గ్రంథంలో నియమబద్ద ప్రణాళిక గురించిన వివరాలు వర్ణించి ఉన్నాయి. ఈ ప్రణాళిక ను అమలు పరిస్తే ఒత్తిడి ని బాగా తగ్గించుకోవచ్చు. ఇందులో ప్రధానమైన అంశం పనుల్ని అప్పగించటం. ఇంటికి కావలసిన వస్తువుల్ని తెప్పించుకోవటం, ఇంట్లో సర్దుకొనే పని, హోమ్ వర్కు చేయించటం, బ్యాంకింగ్ లావాదేవీలు వంటి పనుల్ని భర్తతో కలిసి ప్లాన్ చేసుకోవటం మేలని గ్రంథకర్త సూచిస్తారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు పనులు ఆర్డరు చేసినట్లుగా కాకుండా సమన్వయం చేసుకొంటున్నట్లుగా పనుల్ని ఆర్డరు చేసుకోవాలి.
రోజు వారీ విశ్రాంతి...:
-ఆహారం, పనులకు సమయం కేటాయిస్తుంటారు. కానీ, విశ్రాంతి గురించి పెద్దగా పట్టించుకోరు. దీని వలన శరీరం పగటి పూట పూర్తిగా పని చేయటం, రాత్రి పూర్తిగా నిద్రించటం అనే ట్రెండ్ సాగుతుంది. ఇది పూర్తిగా సరి కాదు. ఎందుచేతనంటే పని లో మెరుగైన ఫలితాలు రావాలన్నా, క్వాలిటీ పరంగా బెస్టుగా ఉండాలన్నా కొద్ది పాటి విరామం అవసరం. వీలుంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత కొద్ది సేపు కనులు మూసుకొని విశ్రాంతి తీసుకోవటం ఒక పరి ష్కారం. లేదంటే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక కొద్ది సేపు విశ్రాంతి తీసు కోవాలి. దీని వలన ఆ తర్వాత నుంచి రాత్రి వరకు పనులన్నీ చక చకా సాగు తాయి. ఇలా కాకుండా కంటి న్యూగా పనిచేసుకొంటూ వెళితే మెదడు, ఇతర ముఖ్య అవయవాల మీద ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి అంటే గాఢమైన నిద్ర అవసరం లేదు. కాస్తంత కనులు మూసుకొని రిలాక్సు అయినా సరిపోతుంది.
సొంతానికి కొంత సమయం...:
ఇంటి కోసం, ఆపీసు కోసం చాకిరీ చేస్తుంటారు చాలామంది. కుటుంబ సభ్యుల కోసం, ఆఫీసు కోసం సమయాన్ని వెచ్చించక తప్పదు. ఇదంతా ఒక ఎత్తయితే, సొంతానికి కొంత సమయం ఉండాలంటారు పరిశోధకులు. ఎందుచేతనంటే జీవితం ఏ విధంగా సాగిపోతోంది, మెరుగ్గా నడుపుకోవాలంటే ఏమి చేయాలి అనే విషయాల్ని ఆలోచించుకోవాలని చెబుతారు. ఇందుకోసం అప్పుడప్పుడు కొంత సేపు ప్రశాంతంగా గడిపేందుకు ప్రయత్నించాలి. ఒంటరిగా ఉన్న సమయంలో మెదడు చురుగ్గా మారి, మరింత ఉత్తేజాన్ని పొందుతుంది. అంతిమంగా ఆనందం వైపు అడుగులు పడతాయి.
courtesy with - చిట్టా రమాదేవి, . M. Sc., M.Phil.., సీనియర్ ఫ్యాల్టీ, హైదరాబాద్@Surya Telugu daily news paper.
No comments:
Post a Comment