Monday, 15 February 2016

cataract - క్యాటరాక్టు,కంటి తెల్లపువ్వు,కంటిశుక్లం - Facts About Cataract


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -cataract,క్యాటరాక్టు,కంటి తెల్లపువ్వు,కంటిశుక్లం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కంటిలో ఒక లెన్సు ఉంది.. రానురాను ఈ లెన్సు పారదర్శకత్వాన్ని కోల్పోతుంది. చూపు మందగిస్తుంది. ఈ దశను క్యాటరాక్టు అంటారు.

క్యాటరాక్టు వచ్చిన వారికి ఈ క్రింది లక్షణములు ఉంటాయి :
          రాను రాను నొప్పి లేకుండా కంటిచూపు తగ్గుతుంది. దగ్గర దూర చూపులో వ్యత్యాసం దుర్లభం. రంగులు గుర్తు పట్టడంలో కష్టం, ఒకే దృశ్యం రెండుగ కనబడడం. కంటిపాప రంగుమారి తెల్లపడడం, మబ్బుమబ్బుగా ఉండడం.

క్యాటరాక్టును ఏవిధంగా చికిత్స చేయగలం?
సామాన్య కంటిచూపు మళ్ళీ తెచ్చుకోవడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. ఒక సామాన్య ఆపరేషన్ ద్వారా కంటిలోని లెన్సు తొలగించడమే.

క్యాటరాక్టు ఆపరేషన్ దుష్పరిణామానికి దారితీస్తుందా?
          ఇదొక సామాన్యమైన ఆపరేషన్. ఇందులో నొప్పి ఉండదు. రోగికి స్పృహ లేకుండా చెయ్యరు. మత్తుమందు ఇవ్వనవసరము లేదు.
          కంటి సంరక్షణ కోసం, క్యాటరాక్టు వచ్చిన వారిని పరీక్షించడానికి, వారికి చికిత్స చేయడానికి, జిల్లా అంధత్వ నివారణ సంఘములను, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారు.
          స్వచ్ఛంద సేవా సం)స్థల ద్వారా నేత్రచికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఆపరేషన్ తర్వాత రోగులకు ఉచితంగా కంటద్దాలు అందచేస్తున్నారు.

జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు :


    భారతదేశంలో క్యాటరాక్టు, అంధత్యానికి మూల కారణం. అంధులలో 85 శాతం, క్యాటరాక్టువల్ల చూపు కోల్పోయిన వారే.
    సరైన సమయంలో క్యాటరాక్టుకు చికిత్స చేయాలి. అశ్రద్ధ చేయవద్దు.
    క్యాటరాక్టు వృద్ధాప్యంలో వస్తుంది. కంటికి దెబ్బ తగిలిందంటే క్యాటరాక్టు ఏ వయస్సులోనైనా రావచ్చు.
    క్యాటరాక్టువల్ల ఆపరేషన్ సులభమైంది. నిశ్చింతగా చేయించుకోవచ్చు.
    ఆపరోషన్ తరువాత కంటి పరీక్ష చేయించుకొని సరైన కళ్ళజోళ్ళు వాడాలి.
    క్యాటరాక్టు వచ్చిన వ్యక్తి ఆత్మ స్థైర్యంతో ఆపరేషన్ చేయించుకొనేటట్లు చూడాలి.



  • Cataract surgery-శక్లాల సర్జరీ:
విజ్ఞానశాస్త్రం విస్తరించిన కొద్దీ.. మన `దృష్టి' మెరుగవుతోంది! అందుకు ఆధునిక `శక్లాల' సర్జరీలే సాక్ష్యం! మలివయసులో చూపునకు పట్టే గ్రహణం.. శక్లం!
పుట్టుకతోనే మన కంటిలో ఉండి.. నిరంతరం మనకు లోకాన్ని చూపిస్తుండే సహజమైన `కటకం' ముదిరిపోయి.. మబ్బుగా.. కాంతి ప్రసరించనంతటి గట్టి `కొబ్బరి ముక్క'లా తయారవ్వటమే ఈ సమస్యకు మూలం!

సర్జరీ చేసి... మబ్బుగా ఉన్న ఈ శక్లాన్ని తొలగించి ఎంతోకొంత చూపు పునరుద్ధరించటం ఒక ముందడుగు. దాని  స్థానంలో కృత్రిమ కటకాన్ని అమర్చటం మరో గొప్ప పురోగతి.
అయితే.. ఈ ప్రయోగపరంపర ఇక్కడితో ఆగిపోలేదు. ఈ కృత్రిమ కటకాలకు మరిన్ని మెరుగుదిద్దుతూ సానబెట్టే పని నిరంతరాయంగా సాగుతూనే ఉంది. అందుేక ఇప్ఫుడు సాధ్యమైనంత సహజంగా.. మన్నికగా.. బహుళ ప్రయోజనాలను చేకూర్చే విధంగా రకరకాల కటకాలు అందుబాటులోకి వస్తున్నాయి.
శక్లాల ఆపరేషన్‌ చాలా సాధారణమైపోయిన ఈ కాలంలో.. ఈ ఆధునిక కటకాలపై అవగాహన పెంచుకోవటం చాలా ఉపయోగకరం. అందుేక దీనిపై సమగ్ర కథనాన్ని మీ ముందుకు తెస్తున్నాం!

అసలేమిటి శక్లం?మన కన్ను ఓ ెకమేరాలాంటి అమోఘమైన నిర్మాణం!
మన కనుగుడ్డు మీద ఉండే తెల్లటి కార్నియా పొర, దాని వెనేక ఉండే సహజ కటకం.. ఈ రెండూ బయటి నుంచి వచ్చే కాంతి కిరణలు కచ్చితంగా లోపలి రెటీనా పొర మీద ేకంద్రీకృతమయ్యేలా చేస్తాయి. తెరలాంటి ఆ రెటీనా పొర.. ఆ కిరణ బింబాన్ని విద్యుత్‌ ప్రేరణలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది. దీంతో మనకు కళ్ళ ముందరి దృశ్యం కనిపిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగుతుండటానికి... కంటిలోని సహజమైన కటకం చాలా కీలకం!
ఎప్ఫుడూ లేత ముంజిలా.. బయటి నుంచి వచ్చే కిరణాలు సరిగ్గా రెటీనా మీద పడేలా చాలా పారదర్శకంగా ఉండే ఈ కటకం.. వయసుతో పాటు.. లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో.. బాగా ముదిరిపోయి కొబ్బరిముక్కలా తయారైపోతుంది. ఇదే శక్లం. దీని గుండా లోపలికి కాంతి కిరణాలు ప్రసరించవు. దీంతో చూపు మందగిస్తుంది!

ఎందుకిలా?

1. వయసుతో పాటు సహజంగానే రావచ్చు.
2. అతినీల లోహిత కిరణలు ఎక్కువగా సోకినప్ఫుడు
3. సహజ కటకానికి దెబ్బల వంటివి తగిలినప్ఫుడు
4. మధుమేహం వంటి సమస్యలున్నప్ఫుడు
5. స్టిరాయిడ్ల వంటి మందులు ఎక్కువగా వాడినప్ఫుడు
... సహజ కటకం దళసరిగా తయారై శక్లం ఏర్ఫడొచ్చు. సాధారణంగా 50, 55 ఏళ్ళ తర్వాత వచ్చే శక్లాలకు ఒకటి కంటే ఎక్కువ కారణాలే ఉంటాయి. పిల్లల్లో కూడా శక్లాలు ఏర్ఫడొచ్చుగానీ దీనికి చాలా వరకూ జన్యుపరమైన, వంశపారంపర్యమైన అంశాలే కారణం.
మధుమేహ బాధితులకు.. శక్లాలు ఏర్ఫడే అవకాశం ఎక్కువ. ఎందుకంటే రక్తంలో చెక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఆ చెక్కెర కటకం లోపలికి వెళ్థూవస్తూఉంటుంది. దానివల్ల క్రమేపీ కటకంలో తేడాలు వచ్చి పారదర్శకమైన కటకం.. శక్లంగా మారుతుంది. లేదా ఇప్ఫటిేక శక్లాలు ఏర్ఫడుతుంటే వాటిని త్వరగా ముదిరేలా చేస్తుంది.

శక్లం: లక్షణలేమిటి?
* చూపు మందగించి.. మబ్బుగా తయారవటం
* రంగుల మధ్య, తలాల మధ్య వ్యత్యాసం (కాంట్రాస్‌‌ట) సరిగా తెలియదు.
* అరుదుగా ఒక వస్తువు, ఒక కాంతి రెండు మూడుగా కనబడుతుండొచ్చు. ఉదా: చంద్రబింబాలు రెండుగా కనబడొచ్చు
* మిరుమిటు్ల గొల్ఫే కాంతిలో చూపు కష్టం కావచ్చు.
* కటకం మధ్యభాగం శక్లంలా మారటం వల్ల కొన్నిసార్లు తీƒణమైన వెలుతురులోకి వెళ్లినప్ఫుడు కొద్దిసేపు ఒక్కసారిగా చూపు మొత్తం కనబడకుండా పోవచ్చు. దీనివల్ల డ్రైవర్ల వంటివారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
* కొందరిలో కటకం మధ్యభాగం బాగా దళసరిగా మారి మైనస్‌ పవర్‌ బాగా పెరుగుతుంటుంది, దీంతో దగ్గరి చూపు మెరుెగనట్టనిపించవచ్చుగానీ శక్లం కారణంగా మొత్తం మీద చూపు ఇబ్బందిగా తయారవుతుంది.

మందులున్నాయా?
వాస్తవానికి శక్లాలను కరిగించే ప్రామాణికమైన మందులేం లేవు. దీనికి ఆపరేషన్‌ ఒక్కటే ఉత్తమ మార్గం. కొందరు `యాంటీక్యాటరాక్‌‌ట' చుక్కలు వాడుతుంటారుగానీ వీటితో ఉపయోగం ఉన్నటు్ట శాస్త్రీయమైన ఆధారాలేం లేవు. పైగా ఈ మందులు చాలా రీదైనవి. వీటిని ఏళ్ళ తరబడి వాడినా ఏ ప్రయోజనమూ ఉండకపోవచ్చు. కాబట్టి పనిచేస్తాయో లేదో తెలీని ఈ మందులతో సమయాన్ని వృథా చేసుకునే కంటే ఆపరేషన్‌ చేయించుకోవటం ఉత్తమం.

ఆపరేషన్‌ ఎప్ఫుడు మంచిది?

శక్లం ముదిరే వరకూ వేచి ఉండాలన్నది ఒకప్ఫటి, పాతకాలపు ధోరణి. 15-20 ఏళ్ళ క్రితం శక్లాల ఆపరేషన్‌ను చాలా నాటుగా చేసేవాళ్లు. (ఇప్ఫుడూ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇలాేగ చేస్తున్నారు.) వీటితో దుష్ర్ఫభావాలు తలెత్తి చూపు మొత్తం పోయే అవకాశం ఎక్కువ. అందుేక డాక్టర్లు శక్లం బాగా ముదిరినప్ఫుడు ఎలాగో ఏమీ కనబడదు కాబట్టి.. ఆ సమయంలో సర్జరీ చేస్తే ఫలితం ఉన్నాలేకున్నా నష్టం ఉండదని భావించేవారు. కానీ ఇప్ఫుడు అత్యాధునికమైన సర్జరీ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో... ఆల్ట్రాసౌండ్‌ తరంగాలతో `ఫేకోఎమల్సిఫిేకషన్‌' పద్ధతిలో శక్లాన్ని తొలగిస్తూ దాని స్థానంలో లోపల కృత్రిమ కటకం (ఇంట్రా ఆక్యులర్‌ లెన్‌‌స-ఐఓఎల్‌) అమర్చటమన్నది చాలా ప్రామాణికమైన.. అద్భుతమైన విధానమని చెప్ఫవచ్చు. ఇది చాలా సురక్షితమైన, చక్కటి చూపునిచ్చే పద్ధతి. కాబట్టి ఇవాల్టి రోజున.. శక్లాలు ముదిరే వరకూ ఎదురు చూడాల్సిన పని అస్సలు లేనే లేదు! శక్లాల కారణంగా రోగి దైనందిన జీవితం ఎప్ఫుడు ఇబ్బందికరంగా తయారవుతుంటే.. అప్ఫుడే సర్జరీ చేయించుకోవచ్చు, తొలిదశలో కూడా చేయించుకోవచ్చు.'

ఏమిటీ సర్జరీ?

సర్జరీకి ముందు... మధుమేహం, హైబీపీ ఉంటే సర్జరీకి వెళ్ళే ముందు వాటిని నియంత్రించుకోవటం చాలా అవసరం. లేకపోతే అధిక రక్తపోటు వల్ల కంటిలో రక్తస్రావం అవుతుంది. మధుమేహం ఎక్కువగా ఉన్నప్ఫుడు ఇన్ఫెక్షన్లు వస్తే వాటిని నియంత్రించటం కష్టం. అలాేగ రక్తాన్ని పల్చగా చేసే ఆస్ఫిరిన్‌ తరహా మందులు వాడుకుంటూ ఉంటే.. వాటిని తప్ఫనిసరిగా ఆపరేషన్‌కు రెండు మూడు ముందు నుంచీ మానెయ్యాలి.

ఆపరేషన్‌...:
ఒకప్ఫుడు ేకవలం కంటిలోని శక్లాన్ని తొలగించి వదిలేసేవాళ్లు. దానివల్ల దాదాపు ప్లస్‌ 10 పవర్‌ ఉండే సోడాబుడీ్డ అద్దాలు పెటు్టకోవాల్సి వచ్చేది. ఈ అద్దాల్లేకపోతే ఏమీ కనబడేది కాదు. మెట్ల వంటివి దిగాలంటే మహా కష్టం. దీనికి విరుగుడుగా.. మొదటగా బ్రిటన్‌నేత్ర వైద్యుడు హెరాల్‌‌డ రిడ్లే 1948లో లోపలే కృత్రిమ కటకం (ఐఓఎల్‌) అమర్చటం ఆరంభించాడు. శక్లాల ఆపరేషన్‌లో ఇదో గొప్ఫ ముందడుగు. రెండోది- లోపలి శక్లాన్ని తీసి, కృత్రిమ కటకం అమర్చేందుకు కనుగుడ్డు మీద పెద్ద కోతబెట్టాల్సి వచ్చేది. ఈ పెద్ద కోత వల్ల కార్నియా బల్లబరుపుగా తయారై.. చూపు బాగా ప్రభావితమయ్యేది. దీనికి విరుగుడుగా- ఆల్ట్రాసౌండ్‌ పద్ధతిలో.. చాలా చిన్న కోత ద్వరానే శక్లాన్ని తొలగించే పద్ధతిని 1968లో ఛాల్‌‌స ెకల్మన్‌ అనే అమెరికా నేత్ర వైద్యుడు ఆరంభించాడు. తరువాత ఆ చిన్న కోత ద్వారానే కృత్రిమ కటకాన్ని మడతబెట్టి లోపలికి పంపించి.. అమర్చటమన్న అత్యాధునిక పద్ధతి అందుబాటులోకి వచ్చింది! ఇదే ఇప్ఫుడు ప్రామాణిక చికిత్స!

  •  


కోత కీలకం!

కనుగుడ్డు కార్నియా పొర మీద ఎంత పెద్ద కోతబెడితే.. ఆ తర్వాత పెటు్టకోవాల్సిన అద్దాల పవర్‌ అంత పెరుగుతుంది. పెద్ద కోతబెట్టినప్ఫుడు.. పుండు మానిన తర్వాత కార్నియాలో ఆ కాస్త భాగం బల్లబరుపుగా తయారవుతుంది, దీంతో అద్దాల పవర్‌ ఇంకా పెరుగుతుంది. అందుేక సాధ్యమైనంత `చిన్న కోత' ద్వారానే లోపలి కటకం తొలగించటం, కొత్త కటకం అమర్చటం.. రెండూ పూర్తి చేసేందుకు విస్తృతంగా ప్రయోగాలు సాగాయి. ఆల్ట్రాసౌండ్‌ పరిజ్ఞానం సాయంతో `ఫేకో' పద్ధతిలో 2, 2.5 మిల్లీమీటర్ల చిన్నకోత ద్వారా లోపలి శుక్లాన్ని తొలగించటం తేలిక అయ్యిందిగానీ కొత్త కటకాన్ని ఆ చిన్న కోత ద్వారా లోపలికి పంపటం కష్టమైంది. కటకం పంపాలంటే కనీసం 6 మిల్లీమీటర్ల దారి అవసరమైంది. అందుేక దీనికి విరుగుడుగా మడతపెట్టే రకం `ఫోల్డబుల్‌' కృత్రిమ లెన్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సన్నటి కోత ద్వారా లోపలికి తోసి.. అక్కడ విచ్చుకునేలా చెయ్యచ్చు. 90ల నుంచీ ఈ రకం మడతపెట్టే లెన్సులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో పెద్ద కోత అవసరం తప్ఫింది.. అద్దాలు పెటు్టకోకున్నా కూడా చూపు కొంత మెరుగ్గా ఉంటుంది.

పదార్థమూ ముఖ్యమే!
కంట్లో అమర్చేందుకు కృత్రిమ కటకాలను ఏ రకం పదార్థంతో తయారుచేస్తే ఫలితాలు బాగుంటాయన్న దానిపై చాలా ప్రయోగాలు జరిగాయి. వీటిలో సిలికాన్‌, అక్రిలిక్‌ పదార్ధాలు ఉత్తమమైనవని గుర్తించారు. మళ్లీ ఈ అక్రిలిక్‌లో కూడా హైడ్రోఫిలిక్‌, హైడ్రోఫోబిక్‌ అనే రెండు రకాల పదార్ధాలతో తయారైన కటకాలున్నాయి. వీటితో ఆపరేషన్‌ తర్వాత.. శక్లాలకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువ. ముఖ్యంగా శక్లం ఆపరేషన్‌ చేసిన తర్వాత రెండుమూడేళ్లు చూపు బాగానే ఉండి.. ఆ తర్వాత మళ్లీ తిత్తి మొత్తం దళసరిగా మారుతూ చూపు తేగ్గే అవకాశం ఉంటుంది. దీన్నే `కాప్సులార్‌ ఒపేసిఫిేకషన్‌' అంటారు. ఈ రకం సమస్య అక్రిలిక్‌ కటకాలతో చాలా తక్కువనీ, ఈ కటకాల్లో కూడా వెనక భాగం పలకలుగా, ముందు భాగం గుండ్రంగా ఉండే కటకాలతో మరీ తక్కువని గుర్తించారు. కాకపోతే వీటి ఖరీదు కొంత ఎక్కువగా ఉంటుంది.

లెన్సులు
1. నాన్‌ఫోల్డబుల్‌:
* సాధారణంగా దీనితో కోత 5-5.5 మి.మీ. వరకూ అవసరమవుతుంది. కోత పెరిగిన కొద్దీ కార్నియా చదునుగా అయిపోతుంది, కోత మానటానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్లాసుల పవర్‌ ఎక్కువ అవుతుంది. అద్దాలు పెటు్టకోకపోతే బాగా కనబడదు, కాబట్టి ఎప్ఫుడూ అద్దాలు పెటు్టకునే ఉండాలి.
* వీటిలో స్వదేశీ, విదేశీ కటకాలు రెండూ లభిస్తాయి. సాధారణంగా ఈ లెన్సుతో, ఫేకో పద్ధతితో సర్జరీ చేస్తే రూ.6-8 వేల వరకూ అవుతుంది.

2. ఫోల్డబుల్‌చిన్నకోత ద్వరానే మడతపెట్టి లోపల అమర్చటానికి వీలైన ఈ లెన్సులను ఎ. సిలికాన్‌ బి. హైడ్రోఫిలిక్‌ అక్రిలిక్‌ సి. హైడ్రోఫోబిక్‌ అక్రిలిక్‌. అనే మూడు రకాల పదర్ధాలతో తయారైనవి దొరుకుతాయి.
మళ్లీ వీటిలో ప్రతి ఒక్కటీ- స్వదేశీ, విదేశీ తయారీలో ఉంటాయి, దీన్ని బట్టి వీటి రీదు కూడా మారుతుంది.

డిజైన్లూ ముఖ్యమే!
అంచులు:ఈ కటకాలలో వెనక భాగం పలకలుగానూ, ముందు భాగం గుండ్రంగానూ ఉన్న వాటితో తిరిగి శక్లం తిత్తి దళసరిగా మారే అవకాశం తక్కువని, చూపు కూడా నాణ్యంగా ఉంటుందని గుర్తించారు. కాబట్టి ఏ పదార్థంతో తయారైన కటకాన్ని అమర్చుకున్నా కూడా... ఈ రకం డిజైన్‌ వాటిని ఎంచుకోవటం మంచిది.

ఉపరితలం:
సాధారణంగా మన కంటిలోని కార్నియా పొరకు +దృష్టిలోపం ఉంటుంది, కటకానికి -దృష్టిలోపం ఉంటుంది. ఈ రెండూ కలిసి న్యూట్రల్‌గా మారి మనకు చక్కటి చూపునిస్తాయి. కానీ వయసు పెరిగిన కొద్దీ శక్లం ఏర్ఫడితే కటకానికి ఉండే -దృష్టిలోపం తగ్గుతుంది, చూపులో అస్ఫష్టత పెరుగుతుంది. అలాేగ స్థాయీవ్యత్యాసాలూ (కాంట్రాస్‌‌ట) సరిగా తెలీవు. దీనికి విరుగుడుగా కొత్తగా కంటిలో అమర్చే కటకాలను `ఏస్ఫెరిక్‌' లేదా `ఆబరేషన్‌ ఫ్రీ' తరహా డిజైన్లలో తయారు చేస్తున్నాయి. అన్ని రకాల పదార్ధాల్లోనూ లభ్యమయ్యే ఈ డిజైన్లలో.. కటకం ముందు ఉపరితలం కొద్దిగా ఉబ్బుగా ఉంచుతారు. దీంతో రాత్రిపూట, డే లైట్‌లో కూడా చూపు మెరుగవుతుంది. మంచి కాంట్రాస్‌‌ట ఉంటుంది, వాహన ప్రమాదాలు తగ్గుతాయి.

మల్టీఫోకల్‌:

సాధారణంగా ఈ కృత్రిమ కటకాలన్నీ కూడా దీర్ఘదృష్టికో, హ్రస్వదృష్టికో.. ఏదో ఒక దాని మీద మాత్రమే ేకంద్రీకరించేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఏదో ఒకదానికి పరిమితం కాకుండా వీటిని మధ్యేమార్గంగా కొంతకొంత రెంటికీ పనికొచ్చేలా అమరుస్తారు. దీంతో ఇంట్లో పనులన్నీ అద్దాల్లేకుండా చేసుకుంటారు, చదువుకూ, దూరపు చూపుకూ అద్దాలు వాడుకుంటారు. ఇవి మోనోఫోకల్‌ లెన్సులు. ఈ కాస్త ఇబ్బందినీ కూడా తగ్గించేందుకు ఇటీవలికాలంలో `మల్టీఫోకల్‌ లెన్సులు' వస్తున్నాయి. ఈ కటకాల మీద కొన్నికొన్ని వలయాలుగా ఉంటాయి. వీటిలో కొన్ని దగ్గర చూపునకు, కొన్ని దూరపు చూపునకు ఉపయోగపడతాయి. దీంతో కళ్ళద్దాలు పెటు్టకోవల్సిన అవసరం అంతగా ఉండదు. కాకపోతే ఈ రకం డిజైన్‌ లెన్సులు పెట్టించుకుంటే రెండు కళ్ళకూ చేయించుకోవాలి. ఒక్క రాత్రిపూట డ్రైవింగ్‌ వంటివి చేసేవారికి మాత్రం వీటి వల్ల ేగ్లరింగ్‌ సమస్య రావచ్చు, కాబట్ట వారు మోనోఫోకల్‌ అద్దాలు పెట్టించుకోవటం మంచిది.

మూవీ అబ్జార్బింగ్‌ లెన్స్:
సాధారణంగా మన కంటిలోని సహజమైన కటకం.. అతినీల లోహిత కిరణలను కొంతవరకులోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. కృత్రిమ లెన్సుకు ఈ స్వభావం ఉండదు. దీంతో ఈ కిరణాలు లోపలికి వెళ్లి రెటీనాను దెబ్బతీసే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ కృత్రిమ లెన్సులను కూడా అతినీలలోహిత కిరణాలు లోపలకు సోకకుండా ఉండేలా రంగు కలిపి.. తయారు చేస్తారు. మాక్యులర్‌ డీనరేషన్‌ వంటి సమస్యలు రాకుండా వృద్ధులకు ఇవి మంచివే. ఇవి అక్రిలిక్‌ లెన్సులన్నింటిల్లోనూ అందుబాటులో ఉంటాయి.
* కాబట్టి అన్ని కటకాలూ మంచివే అయినా ఇవాల్టి రోజున స్తోమతును బట్టి సాధ్యమైనంత మన్నికైన కటకానికి వెళ్ళటం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది.
* ప్రస్తుతం శక్లాన్ని తొలగించేందుకు- `ఫేకోఎమల్సిఫిేకషన్‌' సర్జరీ పద్ధతి ఉత్తమం.
*దీనికి తోడుగా... దీర్ఘకాలం మన్నికైన, సురక్షితమైన ఫలితాల కోసం లోపల- ఫోల్డబుల్‌, ఎక్రిలిక్‌ హైడ్రోఫోబిక్‌ కటకాన్ని ఎంచుకోవటం మంచిదని చెప్ఫవచ్చు.

No comments:

Post a Comment