Sunday 14 February 2016

Stomach - స్టమక్‌ ఫ్లూ






ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Stomach-స్టమక్‌ ఫ్లూ- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఫ్లూ అనగానే తుమ్ములు, ముక్కు కారటం, గొంతునొప్పి గుర్తుకొస్తాయి. కానీ  స్టమక్‌ ఫ్లూ అనే సమస్యలూ ఉన్నాయని మీకు తెలుసా?

నిజానికి స్టమక్‌ ఫ్లూ మామూలు ఫ్లూ ఒకటి కాదు. జలుబు లక్షణాలతో కూడిన మామూలు ఫ్లూ వైరస్‌ల వల్ల వస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవుల వంటి పలు కారకాలతో వచ్చే స్టమక్‌ ఫ్లూ ఒక జీర్ణకోశ సమస్య. కలుషిత ఆహారం, అపరిశుభ్ర నీరు, లాక్టోజ్‌ పడకపోవటం మూలంగా ఇది రావొచ్చు. మల విసర్జన అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోకపోవటం కూడా దీనికి దారితీయొచ్చు. గర్భిణులకు, చిన్నపిల్లలకు, పోషణ లోపంతో బాధపడేవారికి, రోగ నిరోధకశక్తి తక్కువగా గలవారికి, వృద్ధులకు దీని ముప్పు ఎక్కువ.

లక్షణాలు:* కడుపు కండరాలు పట్టేయటం
* కడుపు నొప్పి
* వికారం
* వాంతి
* నీళ్ల విరేచనాలు

స్టమక్‌ ఫ్లూ కారక సూక్ష్మక్రిములను బట్టి జ్వరం, తలనొప్పి, లింఫ్‌ గ్రంథుల వాపు వంటివీ ఉండొచ్చు. ఈ ఫ్లూ తీవ్రమైతే ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి తరచుగా ద్రవాలు తీసుకుంటే డీహైడ్రేషన్‌ బారినపడకుండా చూసుకోవచ్చు.

No comments:

Post a Comment