Thursday, 11 February 2016

Pain disapears with exercise - వ్యాయామం వలన నొప్పి మాయం

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Pain disapears with exercise - వ్యాయామం వలన నొప్పి మాయం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  
  •  

కాళ్ళు భుజాలు కొంచెందూరంగా ఉంచి గోడకు ఆనుకొని నిల్చోండి. నెమ్మదిగా నెమ్మదిగా గోడకుర్చీ వేసినట్లు కనిపించే విధంగా మోకాళ్ళను నడుముకి 98 డిగ్రీలు ముందుకు ఉండేట్లు క్రిందకు నడుముని జార్చండి. నడుము ముందుకు రాకూడదు. గోడను తాకే ఉండాలి. మళ్ళీ మామూలుగా రండి. ఇలా అయిదుసార్లు చేయండి. బోర్లా పడుకోండి, ఒక కాలు కండరాల్ని గట్టిగా బిగించి పెైకి లేపండి. అలా పెైకి లేపిన కాలుని 10 అంకెలు అనుకునేంతవరకూ అలాగే ఉంచండి. ఆ తర్వాత రెండో కాలుతో కూడా అలాగే చేయండి. అలా ఒక్కో కాలుతో అయిదుసార్లు చేయండి.

వెల్లకిలా పడుకోండి. చేతులు పక్కకి చాచి పడుకోవాలి. చేతులు పక్కకి చాచి పడుకోవాలి. ఒక కాలుని పెైకి లేపాలి. పది అంకెలు లెక్కపెట్టేంత వరకూ అలాగే ఉంచాలి. అలాగే రెండో కాలుతో చేయాలి. ఒక్కో కాలుతోనూ అయిదుసార్లు అలా చేయాలి. అలా చేసేటప్పుడు క్రింద ఉన్న కాలుని నిటారుగా ఉంచలేకపోతే మోకాలు దగ్గర కొద్దిగా వంచండి. రెండో కాలుని ఎత్తండి.ఒక కుర్చీలో నిటారుగా కూర్చొని ఒక కాలుని చాచి, రెండో కాలుని కొద్దిగా పైకెత్తుతూ అయిదేసిసార్లు ఒక్కో కాలుతోనూ చేయాలి. వీపు అనేటట్లు పడుకోవాలి. మోకాళ్ళను వంచి నెమ్మదిగా తలనెత్తి చేతుల్ని చాచి మోకాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చేతుల్ని మోకాళ్ళకు తాకుతూ పది అంకెల్ని లెక్కపెట్టాలి. తిరిగి మామూలుగా వచ్చి మళ్ళీ చేయాలి. అలా పదిసార్లు చేయాలి.

-వెల్లకిలా పక్క మీద పడుకోండి. కాళ్ళని చాచి నెమ్మదిగా మోకాళ్ళను ఛాతీవెైపు తేవాలి. వాటి వెనుక చేతులుంచి అలా చేతులతో మోకాళ్ళను చాతిని ఎంత దగ్గరగా తేగలరో అంత దగ్గరగా తీసుకురండి. తలని పెైకి లేవనీకండి. కాళ్ళని క్రిందికి తెచ్చిన తరువాత నిటారు చేయకండి. అలా అయిదు సార్లు చేయాలి.కాళ్ళని దూరంగా ఉంచి నిల్చోండి. చేతుల్ని నడుము మీద ఉంచండి. మోకాళ్ళని నిటారుగా ఉంచండి. వీలెైనంత వెనక్కి నడుమును వంచండి. అలా ఆ భంగిమలో ఒకటి, రెండు సెకండ్లు శరీరానుంచి మళ్ళీ మామూలు భంగిమలోకి రావాలి. ఇలా రోజూ చేస్తే నడుముకి మంచింది.ఇలాంటి సమస్యల వల్ల సాధారణంగా నడుమునొప్పి, మెడనొప్పి వస్తుంటాయి. ఒక వేళ మెడలోంచి నొప్పి చేతుల్లోకి ప్రాకినట్టుండటం, తిమ్మిర్లు, మొద్దుబారినట్టుండడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వెైద్యుణ్ని కలవాలి.

నడుమునొప్పి కాళ్ళలోకి ప్రాకినా, తిమ్మిర్లెక్కినా మనకు వెన్ను సమస్యలున్నాయన్న అనుమానం రావాలి. నరాల మీద ఏదెైన కారణాల వల్ల వెన్నుపూసలో ఒత్తిడి పడితే, ఆ నరం వెళ్ళే మార్గంలో నొప్పి, తిమ్మిర్లు వస్తాయి.చాలా మంది ఈ సమస్యల్ని పట్టింకోకుండడం చూస్తుంటాం. అలాంటి వాళ్ళలో సమస్య తీవ్రమై శస్త్ర చికిత్స తప్పనిసరవుతుంది. మొదటి స్థాయిలో ఇంటువంటి సమస్యల్ని పసిగట్టు వెైద్యుణ్ని కలవాలి. మొదటి స్థాయిలో గుర్తించే లక్షణాల్ని ‘రెడ్‌ప్లాగ్స్‌’ అంటారు.

ఒక కుర్చీలో నిటారుగా కూర్చొని ఒక కాలుని చాచి, రెండో కాలుని కొద్దిగా పెైకెత్తుతూ అయిదేసిసార్లు ఒక్కో కాలుతోనూ చేయాలి. వీపు అనేటట్లు పడుకోవాలి. మోకాళ్ళను వంచి నెమ్మదిగా తలనెత్తి చేతుల్ని చాచి మోకాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చేతుల్ని మోకాళ్ళకు తాకుతూ పది అంకెల్ని లెక్కపెట్టాలి. తిరిగి మామూలుగా వచ్చి మళ్ళీ చేయాలి. అలా పదిసార్లు చేయాలి.

- * మెడ, నడుమునొప్పి చేతుల్లోకి కాళ్ళలోకి వ్యాపిస్తే వెంటనే వెైద్యుడికి చూపించాలి.
 * చేతులూ, కాళ్ళలో తిమ్మిర్లు మంటలు, మొద్దుబారినట్లనిపిస్తున్నా అలసత్వం చేయకూడదు.
    *చిన్నదెైనా పెద్దదెైనా దెబ్బ తగిలినా తర్వాత మెడ, నడుములో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పితో పాటు జ్వరం వస్తే ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చి ఉండవచ్చుననే అనుమానం రావాలి.
   * నొప్పితో పాటు ఆకలి తగ్గినా, బరువు తగ్గినా వెన్నులో ఇన్‌ఫెక్షన్‌ గాని, కణితలు గాని వచ్చి ఉండవచ్చనే అనుమానం రావాలి. కాళ్ళలో గాని, చేతుల్లో గాని కండరాలలో పటుత్వం తగ్గినా, మలమూత్రాల మీద అదుపు తప్పినా, నడకలో మార్పు ఉన్నా వెంటనే వెైద్యుణ్ని సంప్రదించాలి.

    చాలా వరకు వెన్ను సమస్యలు మందులు, ఫిజియోథెరపిలతో తగ్గిపోతాయి. 5 శాతం కన్నా తక్కువ మంది రోగుల్లోనే శస్త్రచికిత్సల అవసరముంటుంది. వెన్ను శస్త్రచికిత్స గురించి ప్రజలలో చాలా అపోహలున్నాయి. వెన్ను శస్త్రచికిత్స జరిపితే కాళ్ళు, చేతులు పడిపోతాయని, ముందుకు వంగిలేకపోవడం బరువులెత్తకపోవడం లాంటివి చేయకూడదని ఎక్కువకాలం బెడ్గరెస్ట్‌ తీసుకోవాలని, నపుంసకత్వం కలగవచ్చని, ఆడవాళ్ళలో ప్రసవ సమయంలో వెన్నుకి మత్తు ఇవ్వడం వల్ల నడుమునొప్పి వసుందని భయాలున్నాయి. వెన్ను వంకర, (స్కోలియోసిస్‌, కైఫోసిస్‌) వస్తుంటే నడుము పెరిగే దాకా ఆగాలనుకుంటారు. అది తప్పు. ఏ వయస్సులో గుర్తిస్తే ఆ వయస్సులోనే శస్త్రచికిత్స చేయడం మంచిది. ఆగిన కొద్దీ వంకర వయసుతో పాటు పెరగవచ్చు. పెరిగే కొద్ది శస్త్రచికిత్స కష్టమవుతుంది.

    కొంతమంది మెడకు, నడువుకు వెైద్యుల సలహా లేకుండా మెడకు కాలర్‌లు, నడుముకి బెల్టులు వాడుతుంటారు. ఇది తప్పు, అలా ఎక్కువ కాలం వాడడం వల్ల మెడ, నడుము భాగాల్లో కండరాలు బలహీనపడతాయి. దీంతో వెన్ను సమస్యలు వస్తాయి. అందుకని వెైద్యుల సలహ ప్రకారం ఎన్ని రోజులు పెట్టుకోమంటే అన్ని రోజులే ఆ బెల్టులు వాడాలి. సలహ లేకుండా వీటిని ప్రయత్నించవద్దు.విపరీతంగా నొప్పి ఉందా? బెడ్ రెస్ట్‌ తీసుకుంటే తగ్గిపోతుందని కొందరు నెలల కొద్దీ విశ్రాంతి తీసుకుంటుంటారు. 48 నుంచి 72 గంటలకన్నా ఎక్కువ విశ్రాంతిని తీసుకోవడం మంచిందికాదు. అలా కదలకుండా ఉంటే కండరాలు బలహీనమయి, భవిష్యత్తులో వీటివలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

    మనం సరెైన పద్దతిలో బరువులెత్తకపోయినా వెన్ను నొప్పి కలగవచ్చు. ఎక్కువసేపు ఒకే భంగిమలో కదలకుండా కూర్చున్నా నడుము, మొడ నొప్పి రావచ్చు. పద్దతి ప్రకారం వ్యాయామం చేయకపోయినా, ఊబకాయంవల్లా, మానసిక ఒత్తిళ్ళు, ధూమపానం, సరెైన ఆహారం తీసుకోవకపోవడం వల్లా వెన్ను సమస్యలు రావచ్చు. మనం కూర్చునే కుర్చీల విషయంలో, వాటిలో కూర్చునే విధానంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. కుర్చీలో వెనక్కి జరిగి కూర్చోవాలి. కుర్చీ వెనుక భాకం మెడవరకూ ఉంటే మంచింది. కూర్చున్నప్పుడు మోకాలు తుంటి కన్నా ఎత్తులో ఉండకూడదు. పాదాలు రెండింటిని నేలమీద ఆన్చాలి. లేకపోతే పుట్‌ రెస్ట్‌ మీద ఉంచుకోవాలి. రోజు కనీసం అరగంట పాటు వారంలో అయిదు రోజులు నడవడం లేదా వ్యాయామం చేయాలి. నడక వల్ల నొప్పులు దూరమవడమే కాక, రక్తంలోంచి ఎముకలు కాల్షింని ఎక్కువగా తీసుకుని ఎముకలు గట్టిపడతాయి. సిగరెట్లు లాంటి అలవాట్లు మానుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము, యోగా, పుస్తకపఠనం, ఆటలు, సంగీతంలాంటివి తోడ్పడతాయి. సమతులాహారాన్ని తీసుకోవాలి. తిరుతిళ్ళు మానేయాలి.

  •     Courtesy with : G.P.Vడాక్టర్‌ జి.పి.వి.సుబ్బయ్య--    స్పైన్‌ సర్జన్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌, లక్డికాపూల్‌, హైదరాబాద్‌..

No comments:

Post a Comment