మహిళల్లో వచ్చే కొన్ని ప్రత్యేక సమస్యల గురించి చెప్పుకోవడము కష్తముగాను , ఇబ్బందిగాను ఉంటుంది. ఒక్కోసారి వైద్యుల వద్దకు వెళ్ళడానికి సైతం సందేహ పడుతుంటారు. వాటిలో ఒకటి వెజినల్ డిశ్చార్జి . ఇది చాలా స్త్రీలలో సర్వసాధారణము . దుర్వాసన , లోదుస్తులపై మరకలు , దురద లేదా మంట వంటి ఇతర ప్రభావాలతో సతమతం అవుతూ ఉంటారు. వెజినల్ పరిశుభ్రత , వాష్ లు , మొదలైన వాటిగురించి అపోహలు , సంశయాలు ఉంటుంటాయి. అసలు వాస్తవాలు తెలుసుకుంటే సంశయాలు వేధించవు .
వెజీనా మహిళ శరీరము లోపల ఉండే మజిల్ ట్యూబ్ .ఇది సర్విక్స్ నుండి వెజైనల్ ఓపెనింగ్ వరకూ సాగుతుంది. బయటి భాగాన్ని " వల్వా" గా పిలుస్తారు. భాహ్య సెక్స్ అవయవాలు వెజైనల్ ఓపెనింగ్ చుట్తూ ఉంటాయి. సహజ సెక్రిషన్ల ద్వారా దానికదే క్లీన్ చేసుకునే మాదిరిగా వెజైనా డిజైన్ చేయబడి ఉంటుంది. సహజ ఋతుక్రమము తో పాటు... క్లియర్ లేదా తెల్లని ద్రవాల ఉత్పత్తి సహజముగా సాగుత్తూ ఉంటాయి.వెజైనల్ దిశ్చార్జి ప్రతిసారీ చెడ్డ లక్షణము కాదు . ఇన్‌ఫెక్షన్ లేదా మరే ఇతర సమస్యలతోనో ఇబ్బంది పడుతున్నట్లు కాదు. వైట్ డిశ్చార్జి సెక్సువల్ గా ట్రాన్స్ మిట్ అయ్యే ఇన్‌ఫెక్షన్ అనుసంధానము అయివుంటుందని చాలా మంది అపోహ . డిశ్చార్జి మోతాదులో మార్పులు 100 శాతము హార్మోనల్ ... ఇంకా చెప్పాలంటే ఇది ఋతుక్రమం సైకిల్ కు లింకై ఉంటుంది. ఋతుక్రమ సైకిల్ లో వెజైనల్ డిశ్చార్జి లక్షణం , మోతాదు మారుతూ ఉంటాయి. అండం విడుదల సమయములో చిక్కగా సాగినట్లు ఉంటుంది. ఆరోగ్యవంతమైన డిశ్చార్జి గాఢమైన వాసన , రంగు ఉండదు. . . కాకుంటే అసౌకర్యవంతమైన తడి ఉంటుంది. అంతే.
ప్రేగులు తర్వాత స్త్రీల శరీరములోకెల్లా అత్యధిక బ్యాక్టీరియా ఉండే శరీరభాగము వెజైనా. అత్యంత సాధారణ వెజైనల్ బ్యాక్టీరియా ల్యాక్టోబాసిల్లస్ . ఇది లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి చేయడము ద్వారా వెజైనా ఎసిడిటీ ని కాపాడుతూ ఉంటుంది. దీనివలన ఏర్పడే యాంటీ-బ్యాక్టీరియల్ యాక్టివిటీ వెజైనా ను విభిన్న ఇన్‌ఫెక్షన్ ల నుండి పరిరక్షిస్తుంది. దురదలు , డిశ్చార్జి , ఇన్‌ఫ్లమేషన్ మొదలైన వాటికి ప్రధాన కారణము సహజ బ్యాక్టీరియల్ సమతుల్యత ఉల్లంఘన , ఎసిడితీ స్థాయిలలో మార్పులు . వెజైనా పి.హెచ్ . అంటే తక్కువ ఎసిడిటీకి లేదా ఎక్కువ ఆల్కలైన్ ఉన్నట్లైతే ల్యాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా మోతాదు పడిపోతుంది. . . ఇతర బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీని వల్ల " బ్యాక్టీరియల్ వెజినోసిస్ లేదా థ్రష్ వంటి ఇన్‌ఫెక్షన్ వచ్చి దురద , ఇర్రిటేషన్ , అసాధారణ డిశ్చార్జి వంటి సమస్యలు వస్తాయి.
ప్రవేటు భాగాల్లో ---పరిశుభ్రత సరిగా పాటించక పోవడము , ఎక్కువ సోప్ నీరు వాడడము , బిగుతు దుస్తులు ధరించడము , సింథటిక్ లోదుస్తులు వాడడము , సురక్షితం కాని సెక్స్ , సెంటెడ్ ట్యాయ్లెట్ పేపర్లు , సెంటెడ్ టాంపన్లు లేదా స్ప్రేలు వంటి పరిమళాల ఉత్పత్తులు అతిగా వాడడము , ఎక్కువ సార్లు వాష్ చేయడము మున్నగు వాటివలన మంచి బ్యాక్టీరియా ఫ్లుష్-అవుట్ కావడము ముఖ్యకారణము ,.
ప్యూబిక్ హెయిర్ --- సాధారణ సబ్బుతో శుభ్రము చేసుకోవాలి . పేలు , గజ్జి , తామరల వంటి ఇన్‌ఫెక్షన్‌లు రాకుండా జాగ్రత్తపడాలి. యానస్ , వెజైనా నడుమ ఉండే ప్రదేశాన్ని నీట్ గా స్క్రబ్ చేయాలి . ముందుగా వెజైనా వాష్ చేసి యానస్ ను వాష్ చెయ్యాలిగాని ... యానస్ వాష్ తరువాత వెజైనాను టచ్ చెయ్యకూడదు ... ఇక్కడ ఉండే క్రిములు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ కి కారణమవుతాయి. ప్యూబిక్ హెయిర్ ను ఎప్పటికప్పుడు సేవ్ చెయ్యాలి . సెక్స్ తరువాత తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి. ఋతుస్రావ సమ్యములో పరిశుభ్రత మరింత ఎక్కువగా పాటించాలి. ప్యాడ్స్ తరచు మారుస్తూ ఉండాలి. కాటన్ అండర్ వేర్ లను ధరిస్తుండాలి. లోదుస్తులు బాగా గాలి ఆడే విధంగా ఉండాలి.
వెజైనా ఆరోగ్యానికి .--- . వెజైనల్ డిశ్చార్జీలు ఎప్పుడూ మహళల్ని ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఈ రోజుల్లో సరియైన పరిశుభ్రతకోసము అనేక ఫార్ములేషన్లు లేదా వెజైనల్ వాష్ లు అందుబాటులో ఉంటున్నాయి. .సబ్బుల ష్తానే ఈ వాష్ లను క్రమము తప్పకుండా వాడుకోవచ్చు . ఇవి వెజైనా ఆరోగ్యాన్ని , పరిశుభ్రతను మెయింటైన్ చెయ్యడము లో సహకరిస్తాయి. కొన్ని పార్ములేషన్లు ఎలర్జిక్ అవునా కాదా చూసుకోవాలి. వెజైనల్ డిశ్చార్జీలు సాధారణంగా ఉన్నట్లైతే ఎవరికీ ప్రత్యేకమైన వాష్ లతో పని ఉండదు. డిశ్చార్జి ఇబ్బందిగా , అసాధారణముగా ఉన్నప్పుడు గైనొకాలొజిస్ట్ ను సంప్రదించి మంది సలహా ను తీసుకోవాలి.
No comments:
Post a Comment