ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Dehydration,నిర్జలీకరణం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
నిర్జలీకరణం అనగా నేమి ?
శరీరం నుంచి అధిక మోతాదులో నీరు నష్టపోవడాన్ని నిర్జలీకరణం అంటారు. మన శరీరం లో ఉన్న వ్యవస్థలు పని చేయడానికి నిర్ణీత మోతాదులో నీరు అవసరం. కనీసం 8 గ్లాసుల నీరు రోజుకు అవసరం ఈ అవసరం మనిషి రోజు చేసే పని,వయసును బట్టి మారుతూ వుంటుంది. చాలా శరీరక శ్రమ చేసే వారికి దీనికి రెండు నుంచి మూడింతలు త్రాగవలసి వుంటుంది. శరీరంలో సహజంగా జరిగే జీవ ప్రక్రియలు అవసరమైన నీరు మనం అందించ వలసి వుంటుంది. తగిన మోతాదులో తీసుకొనక పోయినా, తీసుకొన్న దానికంటే అధికంగా నష్ట పోయినా నిర్జలీకరణం సంభవిస్తుంది.
నిర్జలీకరణకు కారణాలు:
అన్నవాహిక (జీర్ణ వ్యవస్ధ) నుంచి అధికంగా నీరు నష్టపోవడం మూలాన ఈ స్ధితి ఏర్పడవచ్చును.
దీనికి కారణాలు:
- ప్రేగుల లోపల ఉపరితలంలో వాపు, హాని కలిగి ఉండడం.
- బాక్టీరియా,వైరసుల మూలంగా అధికంగా ద్రవం స్రవించడం, దీనిలో చూషణ (absorption) కన్నా స్రవించడం అధికంగా వుంటుంది.
- నోటి ద్వారా తీసుకునే నీరు సరిపడా లేకపోవడం, ఉదా: కడుపులో త్రిప్పుట, వాంతులు.
- వడదెబ్బ (sun stroke) ,
- కొన్ని దీర్ఘకాలిక వ్యాదులు (Diabetes , peptic ulcers ,T.B. etc.)
లక్షణాలు చిహ్నాలు
నిర్జలీకరణకు గుర్తు కొద్ది రోజులలో అధికంగా బరువు తగ్గిపోవడం.
(కొన్ని మార్లు కొద్ది గంటలలో త్వరిత గతిన బరువు తగ్గడం 10 శాతం కన్నా ఎక్కువ వున్నప్పుడు సమస్యకు తీవ్రంగా పరిగణించ వలసి వుంటుంది.
కొన్ని సార్లు వేరే జబ్బు లక్షణాలతో కలిసి వుండి గుర్తించడం కష్టం కావచ్చు.
- ఎక్కువ దాహం
- ఎండి పోతున్న నాలిక
- చర్మము ఎండి పొవుట
- తల తేలికగా అనిపించడం. (ముఖ్యంగా నిలుచున్నప్పుడు)
- బలహీనత
- మూత్రం రంగు ముదురు పసుపులో వుండడం లేక మూత్రం తక్కువ గా రావడం.
- నిర్జలీకరణ తీవ్రంగా వున్నప్పుడు శరీరంలో వుండే రసాయనాల మార్పు రావచ్చు. మూత్ర పిండాలు అసఫలిత కొద్ది సమయాలలో ప్రాణ హాని కూడా కలుగవచ్చు.
- చికిత్స
సివియర్ టైప్ లో 24 గంటలు నోటిద్వారా ఏమీ ఇవ్వకూడదు. I.V salines , I.V antibiotics, I.V vitamins ఇవ్వాలి . ఈవిషయము లో డాక్టర్ తప్పనిసరి .
మోడరేట్ టైప్ లో కొంతవరకూ ఐ.వి.ఫ్లూయిడ్స్ ఇస్తూ నోటిద్వారా అవసరమైన ద్రవపదార్ధాలు ఇవ్వవచ్చును.
మైల్డ్ టైప్ లో అన్నీ నోటిద్వారానే ఇవ్వవచ్చును . ఈ క్రింది విధము గా నోటిద్వారా ఇవ్వాలి ....
- * రోగికి దాహం తగ్గేంతవరకు 'అరలీటరు నీళ్లలో పిడికెడు చక్కెర, మూడు చిటికెల ఉప్పు కలిపి' లేదా 'ఓఆర్‌ఎస్' పొడిని ప్యాకెట్‌పై సూచించిన విధంగా నీళ్లలో కలిపి తాగించాలి.
- * కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ తాగించొచ్చు.
- * వాంతులు విరేచనాలతో కలుషితమైన దుస్తులను మార్చి, శరీరాన్ని నీళ్లతో శుభ్రపరచాలి.
జాగ్రత్తలు--:
- తొలుత మెత్తగా ఉండే ఘనాహారాన్ని మొదలుపెట్టి క్రమంగా రెగ్యులర్ ఫుడ్ తీసుకోవాలి.
- ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా నీళ్లు కాచి తాగడం మంచిది.
- ఆహారంపై మూతలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
- తినడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
- వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో కాఫీ, ఆల్కహాలిక్ డ్రింక్స్, కూల్‌డ్రింక్స్ వంటివి తీసుకోకూడదు. పాలు కూడా తాగకూడదు.
వాంతులు, విరేచనాలు ఆగకుండా అవుతున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
No comments:
Post a Comment