నిత్యం వేధించే సమస్యల్లో నిద్రలేమి ఒకటి. దీనికి ఆహారపుటలవాట్లూ, అనారోగ్య సమస్యలతో పాటూ జీవనశైలీ కారణమే. అందుకే ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో సరి చూసుకుని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. తీసుకున్న ఆహారానికి తగిన శారీరక శ్రమలేకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. అలాని ఎప్పుడు పడితే అప్పుడు వ్యాయామం చేయొచ్చు అనుకోవద్దు. ముఖ్యంగా నిద్రపోవడానికి కనీసం రెండుగంటల ముందు వ్యాయామం చేయకూడదు. వాటివల్ల కండరాలు ఉత్తేజితమై శరీరం చురుగ్గా మారుతుంది. దాంతో వెంటనే నిద్రపట్టదు. అలాగే నిద్రపోవడానికి కనీసం నాలుగైదు గంటల ముందు కాఫీ, టీ లాంటివి తీసుకోవద్దు. వీటిల్లో ఉండే కెఫీన్ నిద్రను దూరం చేస్తుంది.
తరచూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లూ, అంతర్జాలంలో శోధన చేసే అలవాటు మీకుందా? ఇదీ నిద్రలేమికి దారితీస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. ఇలాకాకుండా పడుకోబోయే ముందు కాసేపు మంచి పుస్తకం చదివే అలవాటు చేసుకోండి. చాలామంది పడుకొనే ముందు స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది అనుకుంటారు. దానివల్ల శరీరానికి చురుకుదనం వస్తుందే తప్ప ఓ పట్టాన కునుకు రాదంటున్నారు అధ్యయన కర్తలు. అందుకే పడుకోవడానికి కనీసం గంట ముందు మాత్రమే స్నానం చేయాలి. నిద్రపోయే ముందు ఎక్కువగా హింస ఉండే టీవీ కార్యక్రమాలూ... రణగొణధ్వనులతో వస్తోన్న మ్యూజిక్ వినడం వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. ఇలాంటివి కలత నిద్రకు కారణమవుతాయి.
సుఖనిద్రకు కొన్ని సూచనలు...:
* నిద్రపోయే ముందు బ్రష్ చేసుకొని, ముఖం, కాళ్ళూ, చేతులూ కడుక్కోవాలి.
* నిద్రపోయే రెండు గంటల ముందు ఏమీ తినడం కానీ తాగడం కానీ చేయకూడదు.
* నిద్రకు ముందు మద్యం సేవించరాదు.
* ప్రశాంతంగా, చల్లగా, గాలీ వెలుతురు వచ్చే ప్రదేశంలో నిద్రించాలి.
* మంచి నిద్ర కోసం కుడివైపు తిరిగి పడుకోవడం మంచిది.
* నిద్రించే సమయంలో వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
* నిద్రకు గంట ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది.,
* నిద్రపోయే ముందు మాడుకు, అరికాళ్ళను నువ్వుల నూనెతో మృదువుగా మసాజ్ చేసుకుంటే ఉపయుక్తం.,
* నిద్రకు ముందు ఒక కప్పు వెచ్చటి పాలు తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది.
* పడకపై చేరిన తరువాత టివి చూడడం, రాయడం లేదా ఆలోచించడం వంటివి చూయవద్దు.
* చక్కటి సంగీతాన్ని వినడం వల్ల త్వరగా నిద్రలోకి జారుకోగలం.
* పడుకోవటానికి 2 గంటల ముందు నుంచి ఇంట్లో తక్కువ కాంతినిచ్చే దీపాలు వాడుకోవాలి.
No comments:
Post a Comment