అందాలను ఇనుమడింపచేయడానికి అందుబాటులో ఉన్న కాస్మెటిక్ చికిత్సలలో ఇప్పుడు అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ తాజాగా వచ్చిన అధునాతన చికిత్స. అల్ట్రాసౌండ్ విధానంలో సర్జరీ లేకుండా కొవ్వును కరిగించడం ఈ చికిత్స ప్రత్యేకత. శరీరంలోని ఒక నిర్ధిష్టమైన భాగంలో కొవ్వును కరిగించడం ఈ విధానం ప్రత్యేకత. ఏ భాగంలో కొవ్వును కరిగించాలో ఆ భాగంలో మాత్రమే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపించి కొవ్వును కరిగిస్తారు. శరీరంపై ఎటువంటి గాటు లేకుండా, నొప్పి అనేది లేకుండా ఈ చికిత్స జరుగుతుంది. ఈ చికిత్స వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ చికిత్సతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని కొన్ని భాగాల్లో కొవ్వు అధికంగా పెరుకుపోవడం మూలంగా శరీరాకృతి దెబ్బతింటుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు, స్ట్రోక్, అథెరొస్కెరోసిస్, అర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చిపడతాయి. అధిక బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. ఈ సర్జరీకి ప్రత్యామ్నాయం నాన్ సర్జికల్ లైపొసక్షన్. సాధారణంగా ముఖం, నడుము, పిరుదులు, మెడ, బుగ్గలు, భుజాల కింద కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగిస్తే శరీరం మళ్లీ పూర్వాకృతి సంతరించుకుంటుంది. లైపోసక్షన్‌ను లైపోప్లాస్టీ (ఫ్యాట్ మోడలింగ్) అని కూడా అంటారు.
చికిత్సా విధానం:
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను కరిగించి, శరీరాకృతిని అందంగా తీర్చిదిద్దడానికి అల్ట్రాసౌండ్ తరంగాలను శరీరంలోకి పంపిస్తాము. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకునే నడుము, పిరుదులు, తొడలు, పొట్ట తదితర ప్రాంతాలలోనుంచి కొవ్వును కరిగించడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ ద్వారా శరీరంలోని కొవ్వు శాశ్వతంగా తొలగిపోతుంది. ఒకసారి తొలగించిన కొవ్వు కణాలు మళ్లీ ఏర్పడే అవకాశం లేదు. రక్త నాళాలు, నరాలకు సంబంధించిన కణజాలానికి ఎటువంటి హాని జరగకుండా అల్ట్రాసౌండ్ తరంగాల ద్వారా చర్మంలోపల ఉండే కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఒకసారి తొలగించిన కొవ్వు కణాలు మళ్లీ జీవం పోసుకోలేవు. దీని వల్ల ఇవి శాశ్వతంగా తొలగిపోయినట్లే.
నిర్ధారణ:
శరీరంలో కొవ్వు ఏ మేర పేరుకుపొయింది. నీటి శాతం ఎంత ఉంది? కండరాల పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలను బీసీఏ (బాడీ కంపోజిషన్ అనలైజర్) ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మెడికల్ హిస్టరీని పరిశీలించడం, పేషెంట్‌తో డిస్కస్ చేసి కొవ్వు తొలగించుకోవాలనుకుంటున్న ప్రదేశం ఫోటోలు, మెజర్‌మెంట్స్ తీయడం జరుగుతుంది. ఆ తర్వాతే నాన్ లైపోసక్షన్‌కు సలహా ఇవ్వడం జరుగుతుంది.
చికిత్సా విధానం:
ఏ భాగంలో కొవ్వును కరిగించాలో నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రదేశంలోకి అల్ట్రాసౌండ్ వేవ్స్‌ని పంపించడం జరుగుతుంది. ముందుగా అల్ట్రాసొనిక్ జెల్ అప్లై చేసిలో ఫ్రీక్వెన్సీలో అల్ట్రాసోనిక్‌వేవ్స్‌ని ఫ్యాట్ సెల్స్ పైకి పంపించడం జరుగుతుంది. ఈ ట్రీట్‌మెంట్‌లొ రక్తనాళాలపై, నారాలపై ఎటువంటి ప్రభావం ఉండదు. పూర్తిగా సురక్షితమైన ట్రీట్‌మెంట్ ఇది. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవాలని కోరుకునే వారికి ఇది ఉపయుక్తమైన ట్రీట్‌మెంట్. వారంలో రెండు రోజులు ఈ ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చికిత్స ద్వారా 10నుంచి 15 కేజీల బరువు తగ్గవచ్చు. శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉన్నట్టయితే సులువుగా బరువు తగ్గుతారు. తక్కువ సిట్టింగ్స్‌లో ట్రీట్‌మెంట్ పూర్తవుతుంది. నొప్పి ఉండదు. శరీరంలో కుట్లు, గాట్లు ఏర్పడవు. ఎక్కువకాలం తిరిగి ఫ్యాట్ చేరకుండా ఉంటుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. లేజర్ ట్రీట్‌మెంట్, స్కిన్ ట్రీట్‌మెంట్ వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆకర్షణీయ రూపం కోరుకునే వారు అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే ఫలితం బాగుంటుంది.
కరిగిన కొవ్వు ఏమవుతుంది?
మనం తీసుకునే ఆహారం జీర్ణమైన తరువాత కొంత కొవ్వు శక్తిని ఇచ్చే సాధనంగా మారుతుంది. కొంత కొవ్వు క్యాలరీల రూపంలో ఖర్చయిపోతుంది. మిగిలిన కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. అది ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడలు, నడుము భాగాలలో నిల్వ అవుతుంది. అల్ట్రాసౌండ్ తరంగాలు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంతో అందులోని కొవ్వు ద్రవరూపంలో కాలేయం లోకి చేరుకుంటుంది. అక్కడ జీర్ణక్రియ పూర్తి చేసుకుని విసర్జన జరుపుకుంటుంది.
చికిత్సా కాలం ఎంత?
చికిత్సాకాలం 6 నుంచి 18 సెషన్లు ఉంటుంది. వారానికి రెండు సెషన్ల చొప్పున మూడు నుంచి 18 వారాలలో చికిత్స పూర్తవుతుంది. అయితే శరీరాకృతిని అందంగా మలచుకోవడం అన్నది రోగి చేతుల్లో కూడా ఉంటుంది. శరీరంలో నుంచి కొవ్వు తొలగిపోయిన తర్వాత రోగి బరువు తగ్గిపోతాడు. పాత అలవాట్లు మానకపోతే ఈ చికిత్స చేయించుకుని ప్రయోజనం ఉండదు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలను చేయడం వంటి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకుంటే శరీరం అందంగా మారడం చాలా సులభం.
ప్రయోజనాలు:
నాన్ సర్జికల్ లైపోసక్షన్ శరీరంపై ఎటువంటి గాట్లు లేకుండా, సర్జరీ లేకుండా, నొప్పి లేకుండా కొవ్వును కరిగించే చికిత్సా విధానం. నొప్పి ఉండదు. అనస్థీషియా అవసరం లేదు. మామూలుగా సర్జరీతో కూడిన లైపోసక్షన్ చేసుకున్న వారు సాధారణ స్థితికి రావడానికి వారం, పదిరోజులు పడుతుంది. కాని, నాన్ సర్జికల్ విధానంలో ఎటువంటి విశ్రాంతి అవసరం లేదు. వెంటనే తమ విధులకు హాజరుకావచ్చు. ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ఆస్కారమే లేదు. శరీరంపైన దద్దుర్లు, చర్మం కందిపోవడం వంటివేవీ ఉండవు. చికిత్స కోసం ప్రతి సెషన్ అరగంటపాటు ఉంటుంది. ఫలితాలు మొదటి సెషన్‌లోనే కనపడడం చాలా అరుదైనప్పటికీ 4 సెషన్లు పూర్తయ్యేసరికి చెప్పుకోదగ్గ శారీరక మార్పులు స్పష్టంగా కనపడతాయి. శరీరంలో ప్రతి భాగానికి కనీసం 6 నుంచి 18 సెషన్లు అవసరమవుతాయి. ఒకసారి కొవ్వు కణాలను తొలగించిన తర్వాత అవి మళ్లీ ఆ ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉండవు. చికిత్స చేసుకున్న తరువాత ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.
- డాక్టర్ జి. కిషోర్‌రెడ్డి,హెల్తీ కర్వ్ ్స స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్,రీబాక్ షోరూమ్ పైన,ఆర్‌టిఎ ఆఫీస్ సమీపంలో,తిరుమలగిరి,సికింద్రాబాద్
No comments:
Post a Comment