ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - worms in the Stomach and intestine, కడుపు-పేగుల లో పురుగులు,చిన్న పిల్లలకి కడుపులో పురుగులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కడుపులోకి పురుగులు ఎలా చేరతాయి...:
పురుగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు, ఆహారం. సరిగ్గా ఉడికించని మాంసం తినడం, ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు సరిగ్గా శుభ్రపరచకుండా తీసుకోవడం వల్ల చాలా సూక్ష్మక్రిములు కడుపులోకి చేరతాయి. కాళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా మట్టిలో అపరిశుభ్రమైన పరిసరాలలో తిరగడం వల్ల హుక్ వార్మ్‌వంటి పురుగులు వ్యాప్తి చెందుతాయి . కడుపులో పురుగులున్నాయంటే అవి ప్రోటోజోవా, హెల్మింథస్ (ప్లాట్, నిమటోడ్) వర్గానికి చెందిన పరాన్న జీవులు అయ్యి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి... ఆస్కారిస్ వార్మ్స్, పిన్ వార్మ్స్, హుక్ వార్మ్స్, ఫ్లాట్ వార్మ్స్ (నులి పురుగులు, నట్టలు, నులిపాములు, ఏలిక పాములు) లాంటివి. పురుగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణములు. చిన్న పిల్లలు మర్మాంగాల వద్ద, పృష్ట భాగంలో గోక్కుని వేళ్లను నోట్లో పెట్టుకోవడం వల్ల వారి నుంచి వారికే పురుగులు వ్యాపిస్తాయి.
వివరణ-- కడుపులో చేరే అనేక క్రిముల వల్ల నీళ్ల విరేచనాలు, డయేరియా వంటి సమస్యలు కనిపిస్తాయి.సాధారణంగా కడుపులో, పేగుల్లోకి చేరడానికి అవకాశం ఉన్న సూక్ష్మజీవులివి.
బద్దెపురుగులు :
ఇవి సరిగా ఉడికించని పోర్క్ వంటి ఆహారం వల్ల కడుపులో చేరే పరాన్న జీవులు. ఈ తరహా జీవులు ప్రధానంగా ఫ్లాటీహెల్మింథిస్, నిమాటీ హెల్మింథిస్ జాతికి చెందినవై ఉంటాయి. ఇందులో నులి పురుగు లేదా ఆస్కారిస్ వార్మ్స్ ఉంటాయి. అవి ప్రధానంగా చిన్న పేగుల్లో ఉంటాయి. అపరిశుభ్రమైన ఆహారం, నీరు, సరిగా వండని ఆహారంతో ఈ క్రిములు వాపిస్తాయి.బద్దె పురుగులు-వీటిలో చాలా విభజనలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా జీర్ణ వ్వవస్ధలో చొచ్చుకుని పోతాయి. అక్కడ నుండి ఇవి ఆతిధేయులు (HOST) నుంచి ఆహారాన్ని గ్రహిస్తాయి(పీల్చుకుంటాయి).
పిన్ వార్మ్ లేదా త్రెడ్ వార్మ్ లేదా సీట్ వార్మ్:
ఇవి నిమటొడా వర్గానికి చెందిన జీవులు. మలద్వారం దగ్గరలో ఉండి దురదను పుట్టిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు మట్టిలో తమ మర్మావయవాల వద్ద గోకి మళ్లీ వేళ్లు నోట్లో పెట్టుకోవడం వల్ల ఇవి వ్యాపిస్తాయి.
హుక్ వార్మ్ (ఎన్‌కైలోస్టోమా):
ఇవి కూడా నిమటోడా వర్గానికి చెందినవే. ఇది చర్మం ద్వారా శరీరంలోకి పొడుచుకుని వెళ్ళి, రక్తనాళాల ద్వారా కాలేయం, మూత్రాశయం వంటి భాగాలలో వృద్ధి చెందుతాయి. ఇవి 1 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల కంటికి కనిపించవు. అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుంది.
ఎంటమీబా ,జియార్డియా :
ఇది ఏకకణ సూక్ష్మజీవి. ఇది అపరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది. దీని వల్ల అమీబియాసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. జియార్డియా వంటి ఏకకణ జీవులు పొట్టలోకి, రక్తప్రవాహంలోకి వెళ్లి శరీరమంతటా దురదలు పుట్టిస్తాయి.
వుకరేరియా బ్రాంకప్టై :
ఫైలేరియాసిస్ (బోదకాలు) చాలా రకాల పరాన్న జీవుల చర్మాన్ని లిఫ్ గ్రంధులో చొచ్చు కొని పోయి ఆయా భాగాల్లో వాపును కలిగిస్తాయి.
పరాన్నజీవులు ఆతిధేయులు ( Host ) శరీరంలో లోపల లేక వెలుపల కణాలలో కానీ శరీర భాగాలలో గానీ చొచ్చుకొని పోయి వాటి నుంచి ఆహార పదార్థాలను పీల్చుకుంటాయి. కొన్ని పరాన్నజీవులు ముఖ్యంగా ఏలిక పాముల వ్యాధి గ్రస్థులను చేసేస్తాయి. ఏలిక పాములు సన్నగా, పొడవుగా, ఎముకలు గానీ, ఏవిధమైన చర్మం గానీ లేకుండా పిల్లలను గుడ్ల నుంచి లార్వాల వరకు పొదిగి, పెరిగిన పాములు చర్మం, కండరాలు, ఊపిరితిత్తులు మరియు పేగులో స్థిరపడేటట్లు వదులుతూ వుంటాయి.
లక్షణాలు:
ఏ లక్షణాలు వుండవు, బహు కొద్ది లక్షణాలు వుండవచ్చును.
కొన్నిమార్లు లక్షణాలు వెంటనే కలుగుతాయి. కొన్నిమార్లు 20 సం,, వరకు పడుతాయి.
కొన్నిసార్లు ఈ పరాన్న జీవులు మొత్తంగా లేదా కొన్ని కొన్ని భాగాలుగా మల విసర్జన నుంచి బయట పడతాయి.
అన్నవాహిక, జీర్ణ వ్యవస్థ, (అన్నాశయము, పేగులు, కాలేయము, పెద్దపేగు, గుదము).పై బాగాలలో వున్న ఏలిక పాములు కడుపులో నొప్పి కలిగిస్తాయి.
బలహినత, విరేచనాలు, ఆకలి లేక పోవడం బరువు తగ్గిపోవడం, వాంతులు, రక్తహీనత, పౌష్ఠికాహార లోపం, విటమిన్లు, ధాతువులలోపం, కొవ్వు పదార్ధాల, ప్రోటీన్ల లోపం వంట లక్షణాలు కలుగ చేస్తాయి.
గుద ద్వారము వద్ద దురద, మానము వద్ద దురద, నిద్రలేమి, ప్రక్కలో మూత్రం పోయడం,కడుపులో నొప్పి వంటి లక్షణాలు నులి పురుగులు వల్ల కలిగే ఇన్ ఫెక్షన్లు కనబడుతాయి.
చర్మం – వాపులు, నోటితో లేదా ద్రవంతో కూడిన తిత్తులు, బొబ్బలు, మొఖం వాపు, ముఖ్యంగా కండ్ల చుట్టూ కనబడుతుంది.
అలర్జీ లక్షణాలు – చర్మం మీద దద్దుర్లు, చర్మంలో దురద, గుదద్వారం చుట్టూ దురద,
అవర ప్లూక్సీ – కాలేయం వాపు, పెద్దగా పెరగడం,జ్వరం,కడుపు నొప్పి, విరేచనాలు, చర్మం పసుపు రంగులో మారడం.
లింఫ్ గ్రంధులు ఏనుగు కాళ్ళు, (శోషరసనాళ గ్రంధులు) పురుష బీజాశయాలలో వాపు,
ఇంకా->
నీళ్ళ విరేచనాలు, కడుపులో నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఆహారం తీసుకుంటున్నా బరువు తగ్గిపోతూ ఉండటం, విరేచనాలలో రక్తం, పురుగులు కనిపించడం, మర్మావయవాల వద్ద దురద, శ్వాసలో దుర్గంధం, కళ్ళ చుట్టూ నల్లటి చారలు, చిన్న పిల్లల్లో ముఖంపై తెల్ల మచ్చలు రావడం అప్పుడప్పుడు ఆకస్మికంగా జ్వరం రావడం, దగ్గు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, మూత్రంలో రక్తం పోవడం, అనీమియాకు గురికావడం, నిద్రలో ఉన్నప్పుడు పళ్ళు కొరకడం. కొన్ని సందర్భాలలో పురుగులకు సంబంధించిన లార్వాలు మెదడులోకి వెళ్ళడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కారణాలు:
కణజాలాల్లో ఉండే ఏలిక పాములు మరియు బద్దె పురుగులు. ప్రేగులలో ఉండే ఏలిక పాములు – మలవిసర్జనం లో ఏలిక పాములు గుడ్లు వుంటాయి. వీటితో కలుషితం అయిన ఆహారం కానీ,నీరు కానీ యాధృచ్చికంగా మనుషులు తీసుకొనడం సంభవింవచ్చు.అప్పుడు అవి వారి శరీరంలోని ప్రేగులలో పెరిగి, రక్త ప్రసరణ ద్వారా శరీరం లోని ఇతర భాగాలకు ముఖ్యంగా ఊపిరితిత్తులకు చేరుతాయి. ఇవి 40cm వరకూ పెరుగుతాయి.
హాని కలిగించే కారణాలు:
మల విసర్జనలో కలుషితం అయిన నీరు
అపరిశుభ్ర వాతావరణం (పరిసరాలు)
పచ్చి లేక పూర్తిగా ఉడకని, కూరగాయలు,చేపలు,మాసం తినడం,
జంతువుల (గొర్రెలు, కోళ్ళు, బర్రెలు) ను అపరి శుభ్ర పరిసరాలలు,మానవాసాలకు దగ్గరగా ఉంచుకోవడం.
ఎలుకలు క్రిమికీటకాలతో ఇన్ఫెక్షన్లు,
పౌష్ఠికాహార లోపం మరియు ఇతర జబ్బులు వున్న వ్యక్తులు,
దోమలు ఇతర కీటకాలు అధికంగా ఉన్న పరిసరాలు.
ఆటస్ధలాలో పిల్లలు మట్టిలో ఆడడం మూలాన వాటిలో ఉన్న పరాన్న జీవులు చేతులకు అంటవచ్చును.
నివారణోపాయాలు:
ద్రవపదార్ధాలు
విశ్రాంతి
కుటుంబంలో అందరికి పరీ్క్షలు చేయించి వైద్యం చేయించడం.
వైద్యం పూర్తయ్యే వరకు లోపలి బట్టలు, దుప్పట్లు, బట్టలు, వేడి నీటిలో ఉడక పెట్టడం,
చేతులు తరచుగా పరిశుభ్రం చేసుకోవడం, పచ్చి కూరలు, పూర్తిగా ఉడకని ఆహారం తీసుకోకూడదు.
నీటిని మరిగించి తాగాలి.
పండ్లు,కూరగాయలు శుభ్రంగా కడిగి వాడుకోవాలి.
కడుపులో పురుగుల నివారణకు ఆహారనియమాలు:
తేనె, వెల్లుల్లి, గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పళ్లు, క్యారట్ వంటి ఆహారం కడుపులోని పురుగులను తగ్గించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా తేనె, పుప్పొడి పండ్ల విత్తనాలు శరీరంలో పురుగులను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తాయి.
పురుగులు పేగుల్లో నుంచి బయటపడాలంటే బవెల్(Bowel) కదలికలు సరిగ్గా ఉండాలి. అప్పుడే విరేచనాల ద్వారా పురుగులు బయటకు వస్తాయి. కాబట్టి ఇందుకు దోహదపడే విధంగా మంచినీరు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కడుపులో బద్దె పురుగులు, ఏలికపాము వంటివి పుదీనా రసం పరకడుపున తీసుకోవడం ద్వారా మలముద్వారా అవి బయటపడిపోతాయి.
ఆహారం జీర్ణం అవ్వడంలో తోడ్పడే ఎంజైమ్‌ల వల్ల చిన్నపేగు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎంజైమ్‌లు వృద్ధి చెందాలంటే విటమిన్-సి, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
కలుషితమైన నీళ్లను తాగకూడదు.
No comments:
Post a Comment