శరీరములో ఏర్పడే మలిన పదార్ధాలను బయటకు పంపే సహజ వ్యవస్థ మనశరీరములో వుంది . అయితే అత్యుత్సాహముతో తినే అనవసర పదార్ధాలవల్ల అనేక విషపూరిత పదార్ధాలు ఏర్పడతాయి. వాటిని విసర్జించాలంటే శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతి ఉపవాసము వల్ల పరిమిత, సులువుగా జీర్ణమయ్యే అహార పదార్ధాలలో లభిస్తుంది.
విషపదార్ధాలతో ఇబ్బంది :
విషపదార్ధాలను శరీరము నుండి విసర్జించడాన్నీ డి-టాక్సిఫికేషన్ అంటారు. ఆల్కహాల్ , రసాయనిక పదార్ధాలు , ఫాస్ట్ ఫుడ్స్ , స్ప్రైసెస్ లతో ఉన్న తిళ్ళు , ఆహారము ద్వారా ఏర్పడే ఇతర విషపూరిత వాయువులు , విషపదార్ధాలు ఏవైనా కావచ్చు. ఇవి శరీరములో పేరుకుపోతే సహజ శరీర విసర్జక వ్యవస్థ పని చాలా కస్టమవుతుంది. అందువల్ల జీవన చర్యలు మందగిస్తాయి. ఫలితం గా జీర్ణవ్యవస్థ , హార్మోన్ వ్యవస్థ , విసర్జక అవయవముల పనితీరు అస్తవ్యస్తం అవుతుంది.
విషపదార్ధాలు - pre radicals : ఇవి స్వతంత్రముగా ఉండగలిగే మోలిక్యులా స్పీసెస్ -unpaired electron in an atomic orbital. ఇవి ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడము గాని ఇవ్వడము గాని చేయుచూ oxidants గా లేదా reductants గా పనిచేయును .important oxygen-containing free radicals in many disease states are hydroxyl radical, superoxide anion radical, hydrogen peroxide, oxygen singlet, hypochlorite, nitric oxide radical, and peroxynitrite radical.కణజాలము డామేజ్ చేయును. ముఖ్యము గా కొవ్వుకణాలు , న్యూక్లియక్ యాసిడ్స్ , ప్రోటీన్లు లపై దాడిచేయును.
O2-,superoxide anion,
H2O2, hydrogen peroxide,
OH :hydroxy radical,
RooH : organic hydrogenperoxide,
RO : alkoxy and ROO:peroxy radicals,
HOCI : hypochlorous acid,
ONOO : peroxynitrite,
అలసట ఏ అవయాలకి :
చర్మము మీద పొక్కులు , తట్టు , కీళ్ళనొప్పులు , అజీర్ణము వంటివి అలసటను కలుగ జేస్తాయి. విసర్జక అవయవాలైన కాలేయం , మూత్రపిండాలు , పేగుల పని భారము ఎక్కువై దెబ్బతింటాయి. ఇతర ముఖ్య అవయవాలైన గుండె , ఊపిరితిత్తులు , మెదడు కూడా దీని ప్రభావానికి లోనై ఇబ్బంది పెట్టే అనేక వ్యాధులు కలుగుతాయి.
ఎలా తప్పించుకోవాలి :
ఈ అవస్థకు మూల కారణమైన పదార్ధాలను తినకూడదు . సహజసిద్ధమైన సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని మితముగా తీసుకోవాలి. అర్హులు ఉపవాసము చేసి పండ్లు , తాజా పండల రసాలు త్రాగగము వలన 1-2 రోజులలో విషపదార్ధాలను బయ్టకు పంపేయవచ్చును.
తినకూడని పదార్ధములు : మాంసము , పాల ఉత్పత్తులు , ఆల్కహాల్ , ప్రోసెస్ చేసిన తీపిపదార్ధాములు , వేపుళ్ళు , ఊరగాయలు .అనవసరము గా చీటికి మాటికి మందులు వాడరాదు .
తినవససిన పదార్ధములు :
తాజా పండ్లు , కూరలు , ఆకుకూరలు ,
వనమూలికలతో చేసిన టీ , పానీయాలు ,
బాదం , వాల్ నట్ , జీడిపప్పు , పొద్దుతిరుగుడు , గుమ్మడి విత్తనాలు ,
బ్రౌన్ రైస్ , గోధుమ , జొన్న లతో చేసినవి .
ఎక్కువగా మంచినీరు త్రాగాలి ,
యాంటీ ఆక్షిడెంట్స్ -- విటమిన్ A,విటమిన్ C, విటమిన్ E, సెలీనియం ,వంటి విటములు తీసుకుంటుండాలి.
ఉపవాసము చేయకూడని వారు :
గర్భిణీలు , పాలిచ్చే తల్లులు , డయాబెటీస్ ఉన్నవారూ , తక్కువ రక్తపోటు ఉన్నవారు , ఫుడ్ ఎలర్జీ ఉన్నవారూ ,టీనేజర్స్ ఉపవాసము చెయ్యకూడదు. లంకణం పరమ ఔషము అనంటారు. ఇది అందిరికీ పనికిరాదు . ఉపవాసము ఉంటే జీర్ణాసయానికి విశ్రాంతి అభించి ఆరోగ్యము గా ఉంటుంది.
No comments:
Post a Comment