Thursday, 11 February 2016

Glossitis- నాలుక పూత ,నాలుక మీద పగుళ్ళు - Geographic tongue (benign migratory glossitis)



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Glossitis-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




నాలుక (Tongue) పూర్తిగా కండరాలతో చేయబడిన నోటిలోని భాగం. ఇది ఆహారాన్ని నమలడం మరియు మింగడంలో ఉపకరిస్తుంది. దీనివల్లనే మనకు రుచి తెలుస్తుంది. లాలాజలం దీన్ని ఎప్పు డూ తడిగా ఉంచుతుంది. మనం మాట్లాడడానికి కూడా ఇది సహకరిస్తుంది. ఇది నోటి అడుగుభాగంలో క్రింది పల్లు నుండి గొంతు వరకు వ్యాపించింది.

నిర్మాణము:

* ఉపకళా కణజాలము: జిహ్వా మొగ్గలు కలిగి ఉండి, రుచిని తెలియజేస్తాయి.
* గ్రంధులు: వీటి స్రావాలు నాలుకను తేమగా ఉంచుతాయి.
* కండరాలు: ముఖ్యంగా చారల కండరాలు. నాలుక చలనంలో తోడ్పడతాయి.

నాలుక పూత:
* నాలుక పూత ఒకరకమైన శిలీంద్ర సంబంధమైన వ్యాధి. నోరుమంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అది నోటి మాటలకు వర్తిస్తుంది అనుకోండి. కాని నోటిని అపరిశుభ్రంగా ఉంచుకుంటే మాత్రం నోటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నోరు మన మాట వినదు సరికదా. పైగా నోరే మనలోని జబ్బులను బయటపెడుతుంది.

అపుడప్పుడు అందరికీ నోరు పూత వస్తుంటుంది. నోటి పూత కారణంగా నాలుక నోటి లోపలి బుగ్గలు, పెదవులు, ఎర్రగా పూసినట్లు కనిపిస్తుంది. కారం తగిలితే మంట పుడుతుంది. నోటి వెంట లాలాజలం ఊరుతుంది. ఏమి తినాలన్నా నొప్పితో చాలా బాధపడాల్సి ఉంటుంది. నాలిక పైనఅంతా చిన్ని చిన్ని పుండ్లు కూడా వస్తాయి. దీనికి కారణం ముఖ్యంగా నోటి అపరిశుభ్రతే. అంతేకాకుండా ఒక్కోసారి శరీరంలో బికాంప్లెక్ లేమి వలన, వైరస్ వలన, ఫంగస్, బాక్టీరియాల ఇన్‌ఫెక్షన్ కడుపులో పురుగులు, మెటాలిక్ పాయిజినింగ్ దీర్ఘకాలిక అనారోగ్యం, మానసిక ఒత్తిడి, అజీర్ణవ్యాధి, దంతాల వ్యాధులు, ఏదైనా మందులు తీసుకొంటే అవి
వికటించినపుడూ ఇలా నోరు పూస్తుంది. కనుక ఎంతైనా మన నోరును మన జాగ్రత్తగా ఉంచుకోవాలి .

Treatment : 

కారణాన్ని బట్టి చికిత్స చేయవలసి ఉంటుంది.
నోటి శుబ్రత పాటించాలి ... మౌత్ వాస్ తో నోరు పుక్కలించాలి. (Listril Mouth wash, Dresin mouth wash)
నాలుక , నోరు ఇన్‌ఫెక్షన్‌ అయితే ... యాంటిబయోటిక్స్ (oflaxin+ornidazole), యాంటి ఫంగల్ (flucanazole+Candid oral paint)వాడాలి.
పోషకాహార లోపం ఉంటే మంచి విటమిన్లు ఉన్న ఫుడ్ తినాలి , రక్తహీనత ఉంటే ఐరన్‌ +ఫోలిక్  యాసిడ్  వాడాలి.
ఇర్రిటేషన్‌ కలిగించే ఆహారములు అనగా --- కారము మసాలా తో ఉన్న ఆహారపదార్ధములు , ఆల్కహాల్ , పుగాకు (టొబాకొ) ఉత్పత్తులు తినకూడదు . 
బి.కాంప్లెక్ష్ మాత్రలు లేదా సిరప్ రెగ్యులర్ గా తీసుకుంటుండాలి. 

No comments:

Post a Comment