Tuesday, 2 February 2016

Food Colors Merits and Demerits - ఆహారములో రంగులు లాభ నస్టాలు

  • [Foods.jpg]
ఆహారములో రంగులు లాభ నస్టాలు : మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ఆహార పదార్థాలలో కల్తీ అనేది ముఖ్యమైనది. అక్రమ ధనార్జన చేయాలన్న ఆశతో ప్రజల అజ్ఞానాన్ని, అజాగ్రత్తను ఆసరా తీసుకుని, కొంత మంది మానవ మనుగడకు అవసరమైన ఆహార పదార్థాలలో హానికరమైన పదార్థాలను కలుపుతున్నారు.
ఏమి తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి వంటి కీలక ప్రశ్నలకు సమాధానంగా, సమగ్ర సమాచారం---

రంగుల్లో విటమిన్లు:
రంగుల ఆహారము చూసేందుకు అందముగా ఉండడమేకాక ఎన్నో విటమిన్లు కలిగి ఉండి ఆరోగ్యాన్నిస్తుంది. ఏయే రంగుల ఆహారములో ఏ విటమిన్లు ఉంటాయో చూడండి.

తెలుపు : పాలలా మెరిసే వెల్లుల్లి , ఉల్లిపాయలు, పాలు వంటి తెలుపురంగు ఆహారములో 'ట్యూమర్ల'నుంచి మనల్ని కాపాడే 'అల్లిసన్' ఉంటుంది. ఇక పుట్టగొడుగుల్లో వ్యాధులతో పోరాడే శక్తి ఉన్న రసాయనాలు , కణాలు పాడవకుండా ఆపే శక్తి ఉన్న 'ప్లావయినాడ్స్' ఉన్నాయి .

ఎరుపు,పర్పుల్, పింక్ : ఈ రంగులలో ఉండే ఆహారములో 'యాంథోసియానిన్స్' ఉంటాయి, ఇవి శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్లు గాను, రక్తము గడ్డకట్టకుండా ఆపేందుకు గాను సహాయపడతాయి. కాన్సర్ కారకాలతో కూడా పోరాడగలుగుతాయి.ఉదా: టమాటో(లైకోఫిన్‌), ముదురు పర్పుల్ రంగుగల ద్రాక్ష మొదలగునవి.

పసుపు : ఈ రంగుతో ఉన్న ఆహారము రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరంజ్ రంగులో ఉండే ఆహారములో 'బీటాక్రిప్టాక్సాన్థిన్(beta cryptaxanthin) అనే యాంటిఆక్సిడెంట్ ఉంటుంది. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే 'విటమిన్ -సి- ఉంటుంది. ఇది శరీర కణాలు పాడవకుండా ఆపుతుంది,కళ్లకు రక్షణ కూడా ఇస్తుంది.

ఆకుపచ్చరంగు : ఈ రంగులో ఉన్న ఆహారములో ఐరన్ , కాల్షియం, ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనతను సరిచేస్తుంది. కంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాన్సర్ తో పోరాడే లివర్ ఎంజైముల ఉత్పత్తికి దోహదం చేస్తుంది.

బ్రౌన్ , ఆరంజ్ : ఈ రంగు ఆహారములో విటమిన్ -ఎ- ఎక్కువగా ఉంటుంది, కంటి జబ్బులు రాకుండా 'బీటాకెరోటీన్లు' కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతముగా ఉండేందుకు దోహదము చేస్తాయి.
కృత్రిమ రంగులపై కుతూహలం వద్దు !

అందాలకు నిలయం ప్రకృతి. అంతా రంగులమయం ఆకులు, పూలు, పక్షులు, కీలకాలు...ఇలా ప్రతిదీ ఎంతో అందంగా కనిపిస్తుంది. ముచ్చటైన రంగులతో మన మనసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆహ్లాదాన్నిద పంచుతోంది. అలాంటి రంగులు ఆధునిక మానవ సమాజంలో ఎంతో ప్రాధాన్యత సంతరిచుకుంది. అయితే ప్రకృతి సహజమైన రంగులు మనకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంటే నవనాగరికతా ప్రభావంతో మనం కృత్రిమ రంగులతో ఖుషీచేసుకుంటున్నాం. మనకు సహజంగా లభించిన శారీరక రూపానికి మరింత వన్నెదిద్దాలన్న కుతూహలం మనలో ఉండడం తప్పుకాదు. కాని అవే తప్పనిసరి అనుకోవడం తప్పు. సహజసిద్ధమైన రంగులనే వినియోగిస్తే అందానికి తోడు ఆరోగ్యం లభిస్తుంది. అంతేగాని రసాయానాలతో కలగలిసిన ఆర్టిఫిషియల్‌ రంగులను ఉపయోగిస్తూ మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం. ఇటువంటి వ్యాపారాన్ని మనమే ప్రోత్సహిస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాం.

cosmetics-&-skin-Care : రంగులను వినియోగించే ముందు మనం కొంత ఆలోచన చేయాలి. శరీరానికి, ఆరోగ్యానికి హాని కలిగించని అవసరాలనే ఎంచుకోవాలి. అంటే ఆహారం విషయంలో మనం జాగ్రత్తపడాల్సిందే. ఆహారం మన జీవనధారం. ఇంతటి ముఖ్యమైన ఆహారాన్ని సైతం రంగులతో ముంచెత్తడం మరో క్లిష్టపరిణామం. అంగడిలో వండే స్వీట్లు, హాట్లు- పండ్లు, ఫలహారాలు, శీతల పానీయాలు రంగు రంగుల ఆకారాలతో మనలను ఊరిస్తూ ఉంటాయి. అవి తినడానికి ఆరాటపడతాం. అంతటితో సరిపోదు. ఇంటికి తీసుకుని పోయి భార్యాబిడ్డలకు అందిస్తాం. అంటే ఆ రంగులు చేసే అపకారాన్ని మనతోబాటు మన ఆత్మీయులకు చేరవేస్తున్నామన్న మాట. అంగడి వంటే కాదు ఇంటి వంటను సైతం రంగులతో నింపనిదే కొందరికి గొంతు దిగదు. ఇల్లాలు చేసే పిండి వంటలు సైతం రంగుల హంగులకు దూరం కాకపోవడం విడ్డూరమే మరి.

విశేషంగా ఆకట్టుకుంటున్నాయి : అందానికి అవసరమనుకుంటున్న కాస్మాటిక్స్‌ వినియోగం దేశ పరిధిలో వేల కోట్ల రూపాయలకు మించిపోయిందట. కాదా మరి. నఖములు, శిరోజాలు, నుదుట బొట్టు, కంటిరెప్పకు, కనుబొమ్మలకు, ముఖము, పెదిమలు నఖశిఖ పర్యంతం కృత్రిమరంగులతో నింపేస్తున్నాం. బట్టల రంగుల గురించి చెప్పేదేముంది. కట్టే బట్ట, నెత్తిన జుట్టు మనలను నిద్రపోనీయవు.

నిజమే మరి. మగవారికైనా మగువలకైనా ఈ రెండింటిపట్ల ఉండే శ్రద్ధ మరి దేని మీదా ఉండదంటారు. అంతేనా మన శరీర ఛాయ, మన పర్సనాలిటీకి తగిన రంగులు ఎంచుకోవడంలోనూ మనం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటాం. రంగులపై మనకుగల కాంక్షను మన బలహీనతగా భావించిన ఉత్పత్తిదార్లు రంగు రంగుల ఉత్పత్తులు సరికొత్త పేర్లతో ప్రవేశపెట్టి మనలను ఆకర్షిస్తూనే ఉన్నారు. పౌడర్లు, బ్యూటీ క్రీములు, నెయిల్‌ పాలిష్‌లు, స్టిక్కర్లు, షాంపూలు, హైర్‌డైలు బ్యూటీపార్లర్లు వినియోగదార్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం బ్యూటీ పార్లర్ల వ్యాపారం రాష్ట్ర పరిధిలో 500 కోట్లను దాటిందంటున్నారు. ఆర్థిక నిపుణులు. అంటే రంగుల చట్రంలో మనమెంతగా ఇరుక్కుపోయామో తెలుసు కోవచ్చు.

లాభంకంటే నష్టమే ఎక్కువ : మనం తినే అన్నం తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటున్నామేగాని అది మన ఆరోగ్యాన్ని ఏ మేరకు నష్టం కల్గిస్తుందో వైద్యులు ఎంతగా చెప్పినా మన బుర్రకెక్కడం లేదు. ఇక మనం తినే మందుల మాటకొస్తే నకిలీ మందులు 40 శాతానికి చేరాయంటున్నారు పరిశీలకులు. అసలే నకిలీ ఆపైన అనుమతించని రంగులతో చేసే టాబ్లెట్సు, క్యాప్స్యూల్స్‌, టానిక్స్‌ వినియోగిస్తే మనపని అంతేమరి. సరే అన్నీ, అంతా రంగులమయమా అంటే అలా అనుకోవడమూ సరికాదు. మన దేహానికి హాని కలిగించే రంగులకు దూరంకావాలి. అంటే సౌందర్య సాధనాలు, ఆహార పదార్థాలు అన్నమాట. తక్కిన గృహాలంకణలు అంటే ముగ్గులు, ఇంటికి వేసే రంగులు, రంగు టివి, రంగుల సినిమా, ధరించే వస్త్రాలు మొదలైనవి వినియోగించినా పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. ఏదిఏమైనా కృత్రిమ రంగుల వినియోగంతో మనం పొందే లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు వైద్యులు. ఆహార రూపంలో లోనికి పంపే రంగులతో జీర్ణాకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువట. గ్యాస్ట్రోఐటిస్ , అజీరం, ఆకలి మందం, మలబద్ధకం వంటి రుగ్మతలు తలెత్తే అవకాశముంటుంది.

స్పష్టమైన విధానం అనుసరించాలి : శరీర ఉపరితలంపై వినియోగించే రంగులతో దురదలు, మచ్చలు వంటి చర్మవ్యాధులు, చర్మం పొడారిపోవడం, మృదుత్వం తగ్గిపోవడం కద్దు. తలపై వినియోగించే షాంపూలతో జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు రాలిపోవడం అనుభవమే. కనుక రంగుల విషయంలో మనం స్పష్టమైన విధానం అనుసరించాలి. కృత్రిమ రంగులకు దూరంగా ఉండాలి. ప్రభుత్వం అనుమతించిన రంగులతో నష్టం లేదు గాని అందం కోసం రంగులను ఆహ్వానిస్తున్నా, ఇతరులను అనుకరిస్తున్నా ఆర్థికంగానే కాదు ఆరోగ్యాన్ని సైతం నష్టపోవడం తగని పని. మన బలహీనతలే ఉత్పత్తిదారులకు, వ్యాపారులకు ఆటవిడుపు. తమ ఉత్పత్తి పేరు చెప్పి అసత్యాలను ఆశువుగా చెప్పించి మనలను రంగుల వలలో బంధిస్తూనే వుంటారు. అందుకే ప్రకృతి సహజమైన రంగులను ఇష్టపడదాం. ప్రభుత్వం అనుమతించిన రంగులనే వినియోగిద్దాం. అవైనా ఆహారానికి, శరీరానికి మినహాయించి.

ప్రతిఒక్కరూ కృషిచేయాలి : ‘రసాయన సంబంధిత రంగులను వాడడం తప్పనితెలిసినా చాలా మంది వినియోగిస్తూనే ఉన్నారు. అందుకు గల కారణాలను కాసేపు పక్కన పెడితే, వాటినిప్రోత్సహించడం వల్ల ఎంతటి అనర్థం వాటిల్లుతుందో ఒక్కసారి అలోచించాల్సిన అవసరం ఎంతోఉంది. రసాయనాల మిశ్రమాల కర్మాగారాల నుంచి వచ్చిపడే వ్యర్థాల కారణంగా మన పట్టణాలు, గ్రామాలు మాత్రం క్రమంగా దుర్గంధభరితంగా మారిపోతున్నాయి. ఈ కారణంగానే కలరా, హెపటైటిస్‌, ప్లేగు లాంటివి విజృంభిస్తున్నాయి. అందువల్ల ఇలాంటి కృత్రిమ రసాయన మిశ్రమ రంగులను దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని నా అభిప్రాయం.

No comments:

Post a Comment