ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Diabetes less with good sleep-చక్కని నిద్రతో మధుమేహం దూరం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
గాఢనిద్ర లేకుండా, తరచూ అంతరాయాలతో సతమతమైతే మధుమేహం ముప్పు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. మధుమేహానికి నిద్ర నాణ్యతకూ మధ్య సంబంధాన్ని ఈ అధ్యయనంలో గుర్తించారు. పిల్లలు, యుక్తవయస్కుల్లో గాఢనిద్ర తగ్గితే రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే శక్తి తగ్గటం వల్ల టైప్-2 మధుమేహం తలెత్తే అవకాశం ఎక్కువవుతుందని చికాగో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. కేవలం మూడు రోజులపాటు ఇలా గాఢ నిద్రకు దూరమైతే ఇన్సులిన్ నిరోధకత తగ్గుతున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ వల్ల శరీరంలో చక్కెరను నియంత్రించటానికి ఎక్కువ మోతాదుల్లో ఇన్సులిన్ అవసరమవుతుంది. ఇది మధుమేహానికి ముందస్తు సంకేతంగా భావించవచ్చు.
నిద్ర గంటలు తగ్గినకొద్దీ మధుమేహం ముప్పు పెరుగుతుందని గత ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ప్రస్తుత తాజా అధ్యయనంలో తొలిసారిగా నాణ్యత లేని నిద్ర కూడా మధుమేహం ముప్పును పెంచే అవకాశం ఉందని సూచిస్తోంది. గాఢనిద్ర వయసు మీద పడుతున్న కొద్దీ తగ్గిపోతుంటుందనీ, ఫలితంగానే మధుమేహం వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తోందనీ పరిశోధకులు అంటున్నారు.
No comments:
Post a Comment