Friday, 12 February 2016

Causes for more weight - అధిక బరువుకి కొన్ని కారణాలు






ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Causes for more weight,అధిక బరువుకి కొన్ని కారణాలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    అవగాహనాలేమితో చేసే కొన్ని పనులు.. సమస్యల్ని తెచ్చిపెడతాయి. బరువు తగ్గాలనుకునే వారికీ ఇది వర్తిస్తుంది. కేవలం తక్కువగా తినడం.. ఎక్కువగా వ్యాయామం చేయడం వల్లే సన్నబడరు. ఆ క్రమంలో జరిగే కొన్ని లోపాల్నీ సరిదిద్దుకోవాలి.

నిద్రలేమి జీవక్రియల వేగాన్ని తగ్గిస్తుంది. ఆకలి హార్మోన్లుగా పరిగణించే లెప్టిన్‌, గ్రెలిన్‌పై ప్రభావం చూపుతుంది. ఆహారం తీసుకుంటున్నప్పుడు లెప్టిన్‌... తినడం ఆపమంటూ మెదడుకి సంకేతాలనిస్తుంది. గ్రెలిన్‌ ఆకలిని క్రమబద్ధీకరిస్తుంది. అధ్యయనాల ప్రకారం నిద్రలేమి వల్ల లెప్టిన్‌ పనితీరు తగ్గుతుంది. అదే బరువు పెరిగేందుకు దారితీస్తుంది. అందుకే వేళకు నిద్రపోవడం ఓ అలవాటుగా మార్చుకోవాలి.

చక్కెర తీసుకుంటున్నారా: కాఫీ, టీల్లో చక్కెర ఎక్కువగా వేసుకోకపోవచ్చు. మిఠాయిలు మానేయొచ్చు. కానీ చాలా పదార్థాల్లో తీపి శాతం కనిపించకుండా ఉంటుంది. అలాంటి వాటిల్లో హెల్దీ బార్స్‌, శీతల పానీయాలూ, సాస్‌లూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పళ్ల సమస్యలూ, మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి దాడిచేస్తాయి. బరువూ పెరుగుతారు. కాబట్టి వాటిని కొనేముందు పదార్థాలపై రాసున్న వివరాలను చదవాలి. చక్కెర శాతం ఎక్కువ అని రాసి ఉన్న వాటిని మానేయాలి. నేరుగా చక్కెర అని రాయకపోవచ్చు కానీ.. సుక్రోస్‌, గ్లూకోజ్‌, ఫ్రక్టోస్‌, మాల్టోస్‌, ఫ్రూట్‌జ్యూస్‌ కాన్‌సన్‌ట్రేట్‌ అని రాసి ఉంటాయి. వీటి శాతం కాస్త ఎక్కువగా ఉన్నా చక్కెర ఉన్నట్టే.

కెలొరీలు లెక్కిస్తున్నారా: బరువు తగ్గాలంటే ఆహారం కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది.. తక్కువ కెలొరీలు అందుతాయి. కానీ దానివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందువు. వాస్తవానికి ఏదయినా పదార్థం తీసుకునే ముందు మోతాదు కన్నా నాణ్యత గురించి ఆలోచించాలి. కేవలం కెలొరీలనే పరిగణించకుండా.. ఒక పదార్థం తినడం వల్ల అందే పోషకాలపై దృష్టిపెట్టాలి. సమృద్ధిగా పోషకాలనందించే వాటినే ఎంచుకోవాలి. ముఖ్యంగా విటమిన్లూ, ఖనిజాలూ, యాంటీ యాక్సిడెంట్లూ అందించే పండ్లూ, కూరగాయలూ, తృణధాన్యాల్ని తీసుకోవాలి. ఇంట్లో వండిన పదార్థాలను తినడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫాస్ట్‌ఫుడ్‌ బరువు పెరిగేందుకు కారణం అవుతుందని గుర్తించాలి.

హార్మోన్ల సమస్యలు: హైపోథైరాయిడిజం, పీసీఓడీ... లాంటివన్నీ హార్మోన్ల పనితీరులో మార్పుల వల్లే ఎదురవుతాయి. వీటివల్ల త్వరగా బరువు పెరుగుతారు. తిరిగి తగ్గడం కష్టమవుతుంది. ఇలాంటి సమస్యను నిర్ధరించుకునే ముందు డాక్టర్‌ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. ఏ ఒక్క సమస్య ఉందని తేలినా... శుద్ధిచేసిన పిండిపదార్థాలను మానేసి మేలుచేసే ప్రొటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. కూరగాయలూ, అత్యవసరమైన ఫ్యాటీ ఆమ్లాలూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

No comments:

Post a Comment