Friday, 12 February 2016

Gastritis - గ్యాస్ట్రిటిస్‌ - gastritis home remedy



  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Gastritis - గ్యాస్ట్రిటిస్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 

జీర్ణాశయంలో నిశ్శబ్దంగా ఉండి పొంచి ఉండే ముప్పు గ్యాస్ట్రిటిస్‌. జీర్ణాశయా నికి లోపల వైపున అనేక మ్యూకస్‌ పొరలు ఉంటారుు. వీటిలో వాపు, మంట, తాపం ఏర్పడితే దీన్ని గ్యాస్ట్రిటిస్‌ గా పరిగణిస్తారు. ఇది ముదిరితే అల్సర్‌లు, కణితిలు వంటివి ఏర్పడటంతో పాటు కొన్ని సార్లు క్యాన్సర్‌కు కారణం కావచ్చు. జీర్ణాశయ కుఢ్యం నుంచి ఎంజైము లు, ఆమ్లాలు స్రావితం అవుతాయి . ఈ కుఢ్యం లేక గోడ కు గ్యాస్ట్రిటిస్‌ కారణంగా ఇబ్బంది ఏర్పడుతుంది. దీని ఫలితంగా ఎంజైము లు, ఆమ్లాల విడుదలలో ఆలస్యం జరిగి జీర్ణప్రక్రియ కుంటు పడుతుంది. అదే సమయంలో ఇక్కడ మెుదలైన ఇన్‌ ఫెక్షన్‌ ఇతర ప్రాంతాలకు పాకుతుంది. చిన్నదిగా మెుదలై పెద్దదిగా మారటం గమనించదగిన లక్షణం. అందుచేత గ్యాస్ట్రిటిస్‌ను  ప్రాథమిక సమయంలోనే గుర్తించి చికిత్స తీసుకోవటం మేలు. లేని పక్షంలో ఈ సమస్య కారణంగా జీర్ణ కోశం లోనే కాక ఇతర ప్రాంతాల్లోని ఆరోగ్య సమస్యలకు కారణ భూతం కావచ్చు. వయస్సు మళ్లిన వారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది.

-సమస్య కొంత కాలం పాటు ఉండి తగ్గిపోతే ఎక్యుట్‌ గ్యాస్ట్రిటిస్‌అనీ, ఎక్కువ కాలం బాధిస్తుంటే క్రానిక్‌ గ్యాస్ట్రిటిస్‌ అనీ వ్యవహరిస్తారు. గ్యాస్ట్రిటిస్‌కు స్పష్టమైన లక్షణాలు లేనందున దీన్ని ప్రత్యేకంగా గుర్తించటం కష్టం. పొత్తి కడుపులో నొప్పి ద్వారా దీన్ని చెబుతారు. ఈ నొప్పి కూడా పొడుస్తున్నట్లుగా, నిలిపివేసి నట్లుగా, ఒక్క చోటే మెలిపెట్టినట్లుగా ఉంటుంది. కడుపులో కాస్త పై భాగంలో మధ్యగా ఈ నొప్పి కేంద్రీ క్రతమై ఉంటుంది. కొన్ని సార్లు ఎడమ వైపుకి విస్తరించినట్లుగా కూడా అనిపించవచ్చు. దీంతో పాటు వాంతులు, ఆకలి లేక పోవటం, బరువు  తగ్గటం వంటి లక్షణాలు తోడుగా ఉంటాయి. కొంతమందిలో నలుపు రంగులో విరోచనం కావటం, రక్తపు వాంతులు వంటి లక్షణాల్ని గమనించవచ్చు. కొంత మందిలో ఇన్‌ ఫ్లమేషన్‌ కనిపించకుండానే గ్యాస్ట్రిటిస్‌ బయట పడుతుంది. జీర్ణాశయ కుఢ్యపు అంచుల్లో ఇన్‌ ఫెక్షన్‌ సోకుతుంది. దీన్ని ఎరోసివ్‌గ్యాస్ట్రిటిస్‌ గా వ్యవహరిస్తారు. ఇది బ్లీడింగ్‌, అల్సర్‌ లకు కారణ భూతం అవుతుంది. మొత్తం మీద కడుపు నొప్పి, వాంతులు, నొప్పితో కూడిన జ్వరం, మూత్రం, మలంలో రంగు మారటం, కడుపు నిండుగా ఉండటం వంటి  లక్షణాల్ని ప్రాథమికంగా చెబుతారు. వాంతి అయినప్పుడు రక్తం జీర కనిపించినా, మలంలో రక్తం పడుతున్నా గ్యాస్ట్రిటిస్‌ గా అనుమానించవచ్చు. ఈ లక్షణాల్ని ఒకేసారి  గమనించవచ్చు. లేదా క్రమంగా పెరుగుతూ వెళ్లవచ్చు.

గ్యాస్ట్రిటిస్‌ కు కారణాల్లో మందుల వాడకం, రసాయనాల వినియోగం, సర్జికల్‌ ఇన్‌ ఫెక్షన్‌ తో పాటు ఆల్కహాల్‌ వినియోగాన్ని చెప్పవచ్చు. మద్యం ఎక్కువగా తాగే వారిలో దీన్ని గమనించవచ్చు. మద్యం లో ఉండే ఆల్కహాల్‌.. శరీరంలోకి ప్రవేశించాక విష ఉత్పన్నకాలుగా విడిపోతుంది. ఈ విష పదార్థాలు జీర్ణాశయ పొరలపైప్రభావం చూపుతాయి. తక్కువ మోతాదులో ఆల్కహాలు చేరినప్పుడు అది హైడ్రో క్లోరిక్‌ ఆమ్ల స్రావితానికి ప్రేరేపించును అధిక మోతాదులో అయితే మాత్రం దీనికి భిన్నంగా విష పదార్థాలే నేరుగా ప్రభావితం చూపుతాయి. దీంతో పాటు ఎక్కువ కాలం ఆస్పిరిన్‌, ఐ బూప్రొఫిన్‌ వంటి మందుల్ని వాడినా కానీ సమస్య ఏర్పడవచ్చు.

హెలికోబాక్టర్‌ పైలోరి వంటి బ్యాక్టీరియాల వలన ఇన్‌ ఫెక్షన్‌ తలెత్తినప్పుడు కూడా గ్యాస్ట్రిటిస్‌కు దారి తీయవచ్చు. వాస్తవానికి ఈ బ్యాక్టీరియా చాలామంది లో దాగి ఉంటుంది. ఇన్‌ ఫెక్షన్‌ కు గురైనప్పుడు మాత్రం అనేక జీర్ణాశయ సమస్యలకు కారణం అవుతుంది. జీర్ణాశయ పొరల్లో ఉండే కణాలతో కలిసి ఈ బ్యాక్టీరియా కాలనీలుగా ఏర్పడినపుడు మాత్రం గ్యాస్ట్రిటిస్‌ ఏర్పడుతుంది. అపరిశుభ్ర ప్రాంతాల్లో శానిటేషన్‌ జాగ్రత్తలు సరిగ్గా లేని కారణంగా ఒకరి నుంచి ఒకరికి ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. విష పదార్థాలు తాగినప్పుడు, పైత్య రసం వెనక్కి స్రావితం అయినపుడు, స్వయం భక్షణ (ఆటో ఇమ్యూన్‌ డిసార్డర్‌) పరిస్థితులు తలెత్తినపుడు కూడా గ్యాస్ట్రిటిస్‌ ఏర్పడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో పాటు జీర్ణాశయ గ్రంథి కణాలు ప్రత్యేక పరిస్థితుల్లో మెటా ప్లాసియా స్థితికి లోనవుతాయి. అంటే తిరిగి మార్పు చెందలేని రీతిలో ఆ కణాలు రూపాంతరం చెందుతాయి. అప్పుడు జీర్ణాశయ గోడలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎండో స్కోపీ ద్వారా జీర్ణాశయాన్ని మొత్తంగా పరిశీలించి చూసినప్పుడు మాత్రమే గ్యాస్ట్రిటిస్‌ను గుర్తించేందుకు వీలవుతుంది. లేదా బయోప్సీ ద్వారా పరిశీలించవచ్చు. ఎక్సురే పరీక్ష ద్వారా కడుపులోని ఇన్‌ ఫెక్షన్‌ ను శోధిస్తారు. రక్త పరీక్ష చేసి రక్త కణాల సంఖ్యను చూడటంతో పాటు రక్తం లో పైలోరీ బ్యాక్టీరియా ఉన్నదీ లేనిదీ గమనించవచ్చు. ఎనీమియా, బ్లీడింగ్‌ కండీషన్‌ ను నిర్ధారించుకొనేందుకు సైతం రక్త పరీక్ష అవసరం. మూత్ర పరీక్ష, మల పరీ ల ద్వారా కూడా ఇన్‌ ఫెక్షన్‌ను నిర్ధారించుకోవచ్చు. వీటి ఆధారంగా గ్యాస్ట్రిటిస్‌ ను గమనించవచ్చు.

చికిత్స:

సాధారణంగా గ్యాస్ట్రిటిస్‌ చికిత్సలో సమస్య ఏ కారణంగా ఉద్భవించిందో గమనించి దీనికి తగినట్లుగా చికిత్స చేయిస్తారు. ఐ బూ ప్రొఫిన్‌, ఆస్ప్రిన్‌ వంటి మాత్రల వినియోగాన్ని నిలిపివేయమని సూచిస్తారు. రాంటి డిన్‌, ఫెమటిడిన్‌ వంటి మందులు జీర్ణాశయంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి వేస్తాయి. ఒమెప్రజోల్‌, లాన్సో ప్రజోల్‌, పెంటాప్రజోల్‌, రాబెప్రజోల్‌ వంటి ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటర్సు లను అవసరానికి అనుగుణంగా వైద్యులు సూచిస్తారు. పైలోరి బ్యాక్టీరియా ను గుర్తించినట్లయితే ఈ మందులతో పాటు ఆమాక్సిలిన్‌, క్లారిత్రో మైసిన్‌వంటి 
యాంటి బ్యాక్టిరియాలను లుపుతుంటారు. గ్యాస్ట్రిటిస్‌ సమస్య చిన్నదిగా కనిపించినా, దీని నుంచి ఉద్భవించేఇతర సమస్యలు బలమైనవి కావటంతో ప్రాథమికస్థాయిలోనే చికిత్స తీసుకొంటే మేలు.

Courtesy with : డా ఆర్‌ వి రాఘవేంద్ర రావు,--సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ మరియు లివర్‌ట్రాన్సుప్లాంటు సర్జన్‌-హైదరాబాద్‌@Surya Telugu daily-Jan-7-2013

No comments:

Post a Comment