Monday 15 February 2016

Health with behaviour - ప్రవర్తనతో ఆరోగ్యం



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Health with behaviour, ప్రవర్తనతో ఆరోగ్యం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నలుగురితో సఖ్యంగా ఉంటూ, సభ్యతగా వ్యవహరించే వారే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారనే ఒక కొత్త నిజమొకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. బార్ట్స్‌లోని హైజిన్ కౌన్సెల్‌కు చెందిన వైరాలజీ ప్రొఫెసర్ జాన్ ఆక్స్‌ఫర్డ్ ఈ విషయాన్ని వివరిస్తూ సభ్యత, సంస్కారంతో వ్యవహరించే వారే ఆరోగ్య విషయాల్లో ఎక్కువ శ్రద్ధగా ఉంటున్నట్లు పరిశోధనల్లో వెల్లడయినట్లు చెప్పారు.

ఇతరులకు బాధ కలిగించే రీతిలో వ్యవహరించే వారు తెలియకుండానే తమ ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీసుకుంటున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయన్నారు. అలా కాకుండా సభ్యతగా వ్యవహరించే వారు తరుచూ జలుబు, దగ్గు, డయేరియా వంటి సమస్యల బారిన పడ టం ఉండదని ఆయన చెప్పారు.

సఖ్యంగా వ్యవహరించే వారిలో ఆరోగ్యం బాగుంటుందని, దానికి కారణం వారిలో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండటమేనని ఆయన వివరించారు. ఆరోగ్యం కోసమైనా ఇతరులతో సఖ్యంగా వ్యవహరించడబం అలవర్చుకోవాలని ఆయన హితపు పలికారు. సరియైన ప్రపర్తన అన్నది కేవలం మనుషులతో కలిసిపోవడానికే కాద ని, అది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంగానో తోడ్పడుతుందని గ్రహించాలన్నారు.

శరీర వ్యవస్థను మార్చుకోవడం అటుంచితే, ఎవరికైనా తమ ప్రవర్తనను మార్చుకోవడం ఏమంత కష్టం కాదని, ఒకవేళ కొంత క ష్టమే అయినా, ఆరోగ్యం ముఖ్యమైనప్పుడు అందుకు సిద్ధం కావలసిందేనన్నారు ప్రొఫెసర్ జాన్ ఆక్స్‌ఫర్డ్. ఆరోగ్యం మీద ఇంత ప్రభావం చూపుతుందని తెలిసిపోయిన తరువాతైనా మన ప్రవర్తన మీద ఒక ప్రత్యేక దృష్టి సారించవలసిందేగా!

No comments:

Post a Comment