Monday, 15 February 2016

Stress reducing ways - ఒత్తిడిని తగ్గించే మార్గాలు

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Stress reducing ways,ఒత్తిడిని తగ్గించే మార్గాలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



* శరీరాన్ని సాధ్యమైనంతవరకూ సాగదీసేందుకు ప్రయత్నించండి. అలాగని యోగా చేయమని కాదు. ముందుగా నిటారుగా నిల్చుని ముందుకు వంగాలి. అలాగే చేతుల్ని వెనక్కి పెట్టి రెండింటినీ కలిపి భుజాలను సాధ్యమైనంత వరకూ వెనక్కి సాగదీయాలి. మెడను సవ్య, అపసవ్య దిశలో గుండ్రంగా ఐదారుసార్లు తిప్పడం లాంటివన్నీ ఒత్తిడిని తగ్గించే మార్గాలే.

* నిశ్శబ్దంగా ఉన్న గదిలో కూర్చుని కళ్లు మూసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ, దృష్టంతా దానిమీద ఉంచి హాయిగా విశ్రాంతి తీసుకోండి. ముందు ముక్కుతో గాలి తీసుకుని అది వూపిరితిత్తులకు చేరనివ్వాలి. కొన్ని సెకన్లు అలాగే ఉండి తరవాత నోటితో వదిలేయాలి. ఇలా ఐదు నిమిషాలు చేయగలిగితే, ఎంతో మార్పు కనిపిస్తుంది.

* పగటి కల కూడా ఒత్తిడిని తగ్గించేందుకు చక్కని పరిష్కారం అంటారు నిపుణులు. హాయిగా కళ్లు మూసుకుని నచ్చిన ప్రదేశాన్ని వూహించుకోవాలి. చిన్నతనాన్ని గుర్తుతెచ్చుకోవాలి. అద్భుతం సాధించినట్లు కలగనాలి. ఇలాంటి చిన్నచిన్న వూహలు ఒత్తిడిని దూరం చేసి ఉత్సాహాన్నిస్తాయి.

* ఒత్తిడి తగ్గించే వైవాహిక జీవనం :సాధారణంగా వైవాహిక జీవితాన్ని సుఖసంతోషాలతో అనుభవించే పురుషులు ఏ రకమైన మానసిక ఒత్తిడికి లోనుకావడం లేదట. పైపెచ్చు.. రోజువారీ జీవితంలోనూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్టు తాజాగా అమెరికాకు చెందిన కిన్స్ ఇనిస్టిట్యూట్‌ నిర్వహించిన తాజాగా అధ్యయనంలో తేలింది.అలాగే, మహిళలకు కూడా రతిలో సరైన భావప్రాప్తి లభిస్తే శరీరానికి, మనసుకు ఆనందాన్నిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శృంగారం అంటే సక్రమమైన శృంగారంగా వుండాలని, అక్రమ మార్గాల ద్వారా పొందే శృంగారంలో ఆనందం కంటే ఆందోళన, గిల్టీ ఫీలింగ్స్‌ ఎక్కువగా ఉంటాయని వారు చెపుతున్నారు. అందుకే భర్తతో లేదా తనకు ఇష్టమైన పురుషుడితో ఏకాంతంగా శృంగారం పొందిన స్త్రీలు రోజంతా ఆనందంగా ఉంటారని వారు చెపుతున్నారు.

ఒత్తిడిని తగ్గించే చిట్కాలు:


రోజు నిద్రలేచే సమయానికి 15 నిమిషాల ముందు నిద్రలేవండి. 
వేగంగా నడవండి. ఆఫీసుకెళ్లడానికి మోటారు వాహనానికి బదులుగా సైకిల్‌ను వాడండి. 
మిమ్మల్ని అభినందించే వారితో గడపండి. కాదని చెప్పడం నేర్చుకోండి. 
బిగ్గరగా నవ్వడం సాధన చేయండి. 
దీర్ఘశ్వాస తీసుకుని వదలండి. 
సాయంత్రం వేళ టీవీ లేకుండా గడపండి. ఆటలకు కొంత సమయం కేటాయించండి. 
ఒక సమయంలో ఒకే పనిచేయండి. 
కాఫీ తాగడం మానండి. 
ప్రతీ రోజూ మీకు ఆహ్లాదాన్ని, నవ్వించే సాహిత్యాన్ని చదవండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు పది లేదా 100 వరకు అంకెలను లెక్కపెట్టండి. 

No comments:

Post a Comment