ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Post-delivery infections,ప్రసవం తర్వాత ఇన్‌ఫెక్షన్‌లు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
-చాలామంది మహిళలు ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోరు. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు కాన్పు జరిగిన తర్వాత వారు తీసుకోకపోవడంతో మహిళల్లో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. డెలివరీ తర్వాత స్ర్తీలలో ఇన్‌ఫెక్షన్, జ్వరం రావడం, యూరినరీ ప్రాబ్లమ్స్, బ్రెస్ట్ ప్రాబ్లమ్స్, నరాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ తర్వాత మహిళలు ప్రసవానంతర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
మహిళల్లో కాన్పు తర్వాత ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌లను పర్పురల్ ఇన్‌ఫెక్షన్స్ అంటారు. ఈ ఇన్‌ఫెక్షన్‌లు ప్రసవం తర్వాత రక్తం లేనివాళ్లు, ప్రెగ్నె న్సీ సమయంలో బిపి ఉన్నవాళ్లు, బాగా నీరసంగా ఉన్నవాళ్లకి వస్తాయి. దీంతో డెలివరీ సమయంలో బాగా బ్లీడింగ్ కావడం, మాయ కిందికి ఉండడం, డెలివరీ తర్వాత మాయ ముక్కలు లోపలే ఉండిపోవడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌లు ఏర్పడతాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ల మూలంగా మహిళలకు ఒళ్లు నొప్పులు, నీరసం, కడుపు నొప్పి, వాసనలతో కూడిన వెజినల్ డిశ్చార్జ్ జరుగుతుంది. గర్భాశయం ఇన్‌ఫెక్షన్ వల్ల పొట్ట మొత్తం, శరీరంలో మొత్తం ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తుంది.
- ఇన్‌ఫెక్షన్‌ల నివారణ, చికిత్సలు...:
-గర్భం సమయంలో ఏవైనా గాయాలు ఏర్పడితే చాలా జాగ్రత్తగా వాటికి వైద్యం చేయించుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే మహిళలకు టెంపరేచర్, పల్స్ చెకప్, బిపి, లీవర్, లంగ్స్ చెకప్ చేస్తారు. గర్భం తర్వాత స్కిన్ ఇన్‌ఫెక్షన్, గర్భాశయం కరెక్ట్‌గా మూసుకున్నదా లేదా అని డాక్టర్లు చూస్తా రు. వెజినల్, సర్విక్స్ నుంచి యూరిన్, బ్లడ్ టోటల్ కౌంట్, డిఫరెన్షియల్ కౌంట్‌ను డాక్టర్లు పరీక్షిస్తారు. బ్లడ్ టెస్ట్‌తో పాటు ఎక్స్‌రే, మలేరియా టెస్ట్‌లను సైతం నిర్వహిస్తారు. డెలివరీ సమయంలో రక్తం తక్కువగా ఉన్నవారికి రక్తం ఎక్కిస్తారు. అవసరమైన వారికి యాంటీబ యాటిక్స్‌ను అందిస్తారు.
ఇక డెలివరీ జరిగే గది పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకో వాలి. దీనివల్ల ప్రసవం జరిగే మహిళలను ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షించవచ్చు. డెలివరీకి ముందు లోపల తక్కువగా పరీక్షలు చేయడం మంచిది. స్టెరైల్ కండీషన్‌లో డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రసవానికి ముందు, తర్వాత మహిళలు వ్యక్తిగత పరిశు భ్రతను పాటిం చాల్సి ఉంటుంది. శుభ్రమైన నీటితో స్నానం చేయడంతో పాటు లోకల్‌పార్ట్స్‌ను ప్రతి రోజూ శుభ్రపరుచుకోవాలి. గాయాలు ఏర్ప డితే వెంటనే వైద్యం చేయించుకొని యాంటి బయాటిక్స్ మందులను వాడాలి. స్టెరైల్ ప్యాడ్స్‌ను వాడడం శ్రేయస్కరం. బాగా ఇన్‌ఫెక్షన్ ఉంటే విడిగా ఉండే గది లో విశ్రాంతితీసుకోవాలి. మాయముక్కలను శుభ్రం చేయాలి.
- యూరినరీ సమస్యలు...:
- బ్రెస్ట్ సమస్యలు...:
పాలు రానివారికి, తక్కువగా వస్తున్నవారికి సైకలాజికల్‌గా వారిని ప్రిపేర్ చేయాలి. శిశువును ఎల్లప్పుడు తల్లి పక్కనే ఉంచడం మంచిది. తల్లికి పాల సమస్య ఉంటే సరైన పోషకాహారం, విశ్రాంతి అవసరమన్న విషయం గమనించాలి. ఇక పాలు ఎక్కువ రావడానికి ప్రత్యేకంగా ఎటువంటి మందులు లేవన్న విషయం తెలుసుకోవాలి.
- సబ్ ఇన్‌వల్యూషన్...:
- రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకోవడం...:
- డాక్టర్ . పద్మావతి ,గైనకాలజిస్ట్,గాయత్రి నర్సింగ్ హోం ,రాజీవ్ నగర్ క్రాస్‌రోడ్ ,హైదరాబాద్.
No comments:
Post a Comment