Friday 18 March 2016

Foods that Improve your Haemoglobin - ఐరన్ కలిగిన ఆహారం

ఆరోగ్యవంతుని శరీరములో 4 గ్రాముల వరకూ ఐరన్ వుంటుంది. ఇందులో షుమారు 2.5 గ్రాముల వరకు రక్తములో హిమోగ్లోబిన్ లో ఉంటుంది. ఐరన్ ఎక్కువగా కాలేయం, మాంసం, గుడ్లు, ఎండబెట్టిన పండ్లు, రాగులు, ఆకుకూరలు, మొదలైన వాటిలో వుంటుంది. అయితే వీటన్నింటిలో వివిధ పరిమాణాలలో వుంటుంది. ఒకేరకం ఆహార పదార్ధాలలో కూడా అది పండించిన నేలను బట్టి, ఇతరములైన పరిస్థితులను బట్టి ఐరన్ పరిమాణములలో మార్పుంటుంది. ఉదాహరణకు బచ్చలికూరలో ఐరన్ అధికంగా వుంటుందనే అభిప్రాయం మనలో చాలా మందికి ఉంటుంది. 

అది నిజమే కానీ ఆ ఐరన్ ని శరీరం తగినంత మోతాదులో మాత్రమే జీర్ణం చేసుకోగలదు. మిగిలినదంతా శరీరానికి ఉపయోగ పడదు. శాకాహారంలో లభించే ఐరన్ కీ మాంసాహారంలో లభించే ఐరన్ కీ వ్యత్యాసం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ రెండు రకాల ఐరన్ లో మొదటిది మాంసం, చేపలు, చికెన్లలోను, రెండో రకం బ్రెడ్, సిరియల్స్, కూరగాయలు, కోడిగుడ్లు లోనూ దొరుకుతుంది. 

ఐరన్ లోపము పెద్దవారిలో కంటే పిల్లల పైనే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల ఎదుగుదలకు ఐరన్ అత్యవసరం. ఐరన్ లోపం వల్ల ఎనీమియా ఏర్పడుతుంది. మానసికంగా వారిలో కుదురు ఉండదు. ఏకాగ్రత లేకపోవడం, చీటికీ మాటికీ కోపం, విసుగూ, బద్దకం, ప్రవర్తనలలో లోపాలు వీటన్నిటికీ ఐరన్ లోపమే కారణం. 

ఒక అంశం పైన దృష్టి కేంద్రీకరించాలన్నా, మెమరీ పెరగాలన్నా, ఆక్సిజన్ అవసరం. ఐరన్ లోపం వీటన్నిటికీ వ్యతిరేకంగా పని చేస్తుంది. ఇటీవల యుక్త వయస్సులలో ఐరన్ లోపం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందన్న అంశం పైన సర్వే జరిగింది. ఐరన్ తగినంతలేని వాళ్ళ అకడమిక్ రికార్డ్ సక్రమంగా లేదని తేలింది. పదహారు, పదహేడేళ్ళ వయసుల వారిలో ఐరన్ ట్రీట్మెంటు తర్వాత వారి మూడ్స్, ఏకాగ్రత మారాయని తేలినది.

No comments:

Post a Comment