Friday 18 March 2016

Green for health - ఆకుపచ్చని ఆరోగ్యం

  • ఆకుకూరల్లో ఏయే పోషకాలు ఉంటాయో తెలుసుకుందాం.
  • పచ్చిమిర్చి, పాలకూర, బ్రకోలి (ఆకుపచ్చని కాలిఫ్లవర్) లాంటి వాటిల్లో యాంటి ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరంలోని కణజాలం త్వరగా పాడవకుండా కాపాడటం వాటి సహజలక్షణం.
  • మంచి విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
  • ఆహారం బాగా జీర్ణమవడానికి అవసరమైన మంచి పీచు పదార్ధం వీటిలో అధికంగా ఉంటుంది.
  • సహజంగానే ఆకుకూరల్లో కొవ్వు, సోడియం, కెలోరీలు తక్కువ. కొలెస్ట్రాల్ శూన్యం.
  • ఆకుకూరల్లో పైటోకెమికల్స్ ఉంటాయి. వాటిలో గుండె జబ్బులు, క్యాన్సర్లు, చక్కెర వ్యాధులు రాకుండా చూసే సమ్యోగ పదార్ధాలుంటాయి.
  • వేర్వేరు రకాల పచ్చని కూరలు వేర్వేరు విటమిన్లు కలిగి ఉంటాయి. పాలకూరలో ఇనుము, విటమిన్ 'ఎ' అధికం. ఆస్పరాగస్ అనే మరో కూరలో సి విటమిన్, ఫోలేట్‌లు సమృద్దిగా ఉంటాయి.


ఆహారపోషణలో ఆకుకూరల ప్రాధాన్యత:
  • ఆకుకూరల్లో లభించే పత్రహరితానికి మన శరీరంలో క్రిముల్ని నశింపజేసే గుణం ఉంది.
  • ఆకుకూరల్ని పచ్చివి నమలటం వలన పళ్ళ మధ్యలో మిగిలిపోయిన ఆహార పదార్ధాల్ని బయటకు తీసుకురాగలుగుతాయి. పళ్ళకు హాని చేసే క్రిముల్ని నాశనం చేస్తాయి.
  • శరీరంలోని, ప్రేగుల్లోని బ్యాక్టీరియాను వ్యతిరేకంగా పోరాడే గుణం కూడా పత్రహరితానికి ఉంది. ఆకుకూరల్లో ప్రొటీన్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి.
  • ద్రవపదార్ధాల్ని మాత్రమే తీసుకోవల్సిన అవసరం ఉన్నవారికి అవసరమైన ప్రొటీన్లని ఆకు కూరలు అందిస్తాయి.
  • రక్తలేమి, బలహీనతలతో బాధపడుతున్న వారికి ఆకుకూరల్లో లభించే ఇనుము స్వస్థతనిస్తుంది. ఆకుకూరల్లో ఎసిడిటి సమస్యని తగ్గించే ఖనిజాలు ఉన్నాయి.
  • సువాసనా భరితమైన కొత్తిమీరని వంటల్లో విరివిగా వాడుతుంటాం. ఇది అరుగుదలకు, ఆకలి పుట్టించడానికి బాగా పనిచేస్తుంది. ప్రతి వంద గ్రాముల కొత్తిమీర నుంచి మనకు పది మిల్లీ గ్రాముల ఇనుము, 135 మిల్లీ గ్రాముల విటమిన్ 'సి', ఇవేకాక విటమిన్ 'ఎ', కాల్షియం, ఫాస్పరస్ ఇంకా పలు ఇతర పోషక పదార్ధాలు లభిస్తాయి. కొత్తిమీర రసాన్ని ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
  • పాలకూర త్వరితంగా జీర్ణమవుతుంది. దగ్గు, అస్తమాలను తగ్గించటం, శరీరంలోని విషపదార్ధాలను బయటికి పంపడంలో చక్కగా పని చేస్తుంది. పాలకూరలో అమినో ఆసిడ్స్, ఇనుము, విటమిన్ 'ఎ', ఫోలిక్ ఆసిడ్ మొదలైన శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి.
  • పాలకూర రక్తలేమికి మంచి మందుగా పని చేస్తుంది. పాలకూరలో ఉన్న ఖనిజాలు ఎసిడిటిని తగ్గించగలుగుతాయి. అయితే పాలకూరలో ఉండే ఆక్సాలిక్ ఆసిడ్ అనే ఉప్పు జీర్ణరసాల్లో కరగదు. కిడ్నీలో రాళ్ళ సమస్యకు ఇది హానికరంగా పరిణమిస్తుంది. కాబట్టి అటువంటి సమస్యలు ఉన్నవారు పాలకూరని వాడకూడదు.
  • మెంతి కూర వైద్యపరంగా ఆకుకూరల్లో రాణిలాంటిదే. దీనిని తింటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గ్యాస్‌ని నివారిస్తుంది.
  • దగ్గు, వాంతులు, పొట్టలో పురుగులు, కీళ్ళ నొప్పులు మొదలైన అనారోగ్యానికి మెంతి కూర మంచి మందు. ఇందులో అత్యధిక స్థాయిలో ప్రొటీన్లు, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము ఉన్నాయి. ఖనిజాలు, విటమిన్లు కూడా హెచ్చు మోతాదులో ఉన్నాయి.
  • మెంతులు రక్తలేమికి చక్కని వైద్యంగా పని చేస్తాయి.


అన్నీ సమపాళ్ళలో ఉన్న ఆహారం:
నార లేదా పీచు తో కూడిన స్వాభావిక ఆహార పదార్ధాలు మనం తీసుకునే భోజనంలో 50 శాతం దాకా తప్పనిసరిగా ఉండాలి. కండరాల కదలికలకు నార లేదా పీచుతో కూడిన ఆహారపదార్ధం సహాయపడుతుంది. తాజా కూరగాయలతో కూడిన సలాడ్ లు, బచ్చలి కూర, మరీ ఎక్కువగా ఉడకని కాయగూరలు కలసి జీర్ణశక్తిని పెంచుతాయి. సాధ్యమైనంత వరకు వేపుడు పదార్ధాలను, మసాల కలిపిన ఆహారపదార్ధాలను తినడం మానండి, దీనివల్ల కడుపులో ఆమ్లత్వము పెరిగి చిర్రుబుర్రులాడే మనస్తత్వము అలవడుతుంది. కడుపునిండా కాకుండా సగం కడుపునిండేలా తినండి. భోజనంతో పాటు నీళ్ళను తాగకండి. జీర్ణ కోశంలో ఉత్పత్తి అయ్యే రసాలను తాగే నీళ్ళు పలుచపరుస్తుంది. భోజనం చేసిన అరగంట తరువాత నీళ్ళను తాగండి. రాత్రి అన్నము అన్నది పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు చేయండి. ప్రొద్దున్నే లేచిన తరువాత గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని ఒక గ్లాసుడు నీళ్ళు తాగండి. ఇది పేగులను వదులుగా చేసి పేగుల విసర్జన క్రియను సులభతరం చేస్తుంది.

No comments:

Post a Comment