Friday 18 March 2016

The importance of sesame seeds - నువ్వు గింజల ప్రాధాన్యత

ఆరోగ్యానికి నువ్వులు కచ్చితంగా తినాలి, శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన విటమిన్లను నువ్వులు కలిగి ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోగాలేంటో తెలుసుకుందాం. 

ఒక కప్పు నువ్వులు ఒక గ్లాసు పాలలో కంటే మూడూ రెట్లు అధికంగా కాల్షియం శరీరానికి అందించగలవు. 

నువ్వుల్లో కాల్షియంతోపాటు ఇతర ప్రధాన పదార్థాలైన మాంగనీసు, కాపర్, ఐరన్, ఫాస్ఫరస్ సమృద్దిగానే ఉంటాయి. 

ఇక విటమిన్ల విషయానికొస్తే విటమిన్-బి1, జింక్, విటమిన్-ఇ సమృద్దిగా ఉంటాయి. 

పైవాటితో వాటు ఆరోగ్యానికి అవసరమైన పోషక విలువలు, పీచు పదార్థం కూడా నువ్వుల్లో అధికంగానే ఉంటాయి. 

నువ్వుల్లో సిసమిన్, సిసమోలిన్ అనే రెండు పదార్థాలు ఉంటాయి. ఇవి రెండు కూడా అధిక రక్తపోటును నివారించేందుకు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాదు కాలెయం ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా కాపాడటంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. 

నువ్వులు తినడం వల్ల శరీరానికి ఇన్ని పోషకాలు అందటంతోపాటు, అనారోగ్యాన్నుంచి కాపాడే వ్యాధి నిరోధక లక్షణాలు కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయని తెలియకే వీటిని చాలా తక్కువగా ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో మాత్రమే తింటున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నువ్వులు వల్ల అనేక ఉపయోగాలున్నాయని తెలిసింది కదా ఇంకెందకు ఆలస్యం రోజూ మీ డైట్ లో కాసిన్ని నువ్వులకు స్థానం కల్పించి ఆరోగ్యాన్ని ఆహ్యానించండి.

No comments:

Post a Comment