Tuesday, 9 February 2016

X-ray merits and demerits , ఎక్స్ రేలు లాభ నస్టాలు



ఎక్స్‌రేల గురింఛి మనలో తెలియనివారు లేరు కదా. మనుషుల శరీరంలోకి చూసే ఎక్స్‌రేలను క్రీ.శ.1859లో రాంటోజెన్ అనే శాస్తవ్రేత్త కనిపెట్టాడు.రాంటోజెన్ అనే శాస్తవ్రేత్త. ఆయన చేసే కొన్ని పరిశోధనలలో ఒక ప్రత్యేకమైన తెర ఉపయోగించేవాడట. ఆ తెరను దేనితో కప్పినా, ఎంతగా కప్పినా దానినుండి వెలుగు రావటం రాంటోజెన్‌కు ఒక వింతగా తోచింది.సాధారణంగా తెలియనిదానిని, ఊహించేదానిని ‘ఎక్స్’ అని అంటుంటారు.అందుకే రాంటోజెన్ ఈ తెలియని కిరణాలను (కిరణాన్ని ఇంగ్లీషులో ‘రే’ అంటారు) ఎక్స్‌రే అన్నాడు. రాంటో జెన్ తెలియక పెట్టిన ముద్దుపేరే ఇప్పటివరకు ‘ఎక్స్‌రే’ అని పేరుగా నిలిచిపోయింది.

ఉపయోగాలు:* మన శరీరంలో చాలా రోగాలు ఎక్స్‌రేల ద్వారా కనిపెట్టవచ్చు. మనం ఎక్కువగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, ఎముకలు, జీర్ణకోశ వ్యాధులలో ఎక్స్‌రేలను వాడుతున్నాం.
* దాదాపు 20-25 సంవత్సరాల క్రిందట నుండి ఎక్స్‌రేల సహాయంతో స్కానింగ్ అనే చర్యను జరుపుతున్నాము. స్కానింగ్‌వల్ల శరీరంలోని ఏ భాగాన్నయినా చూడవచ్చు.
* వైద్యరంగంలోనేగాక స్ఫటికాల పరిశోధనలలో కూడా ఎక్స్‌రేలను ఉపయోగించవచ్చు.
*విమానాశ్రయాలలో, నావికా కేంద్రాలలో కస్టమ్స్ అధికారులు యాత్రికుల సామానులలో ఉండే వస్తువులను ఎక్స్‌రేల సహాయంతో కనిపెట్టుతున్నారు.
*ఎక్స్‌రేల ద్వారా వేలిముద్రలు గుర్తించి, నేరస్థుల ఆచూకి తెలుసుకొంటారు.
* కేన్సరు వ్యాధి తొలిదశలో గుర్తించుటకు, కేన్సరు వ్యాధికి వైద్యం చేయుటలో ఎక్స్‌రేల ఉపయోగం ఉంది.

ఎక్స్‌రేలు - ప్రమాదాలు:* కేన్సరును గుర్తించే ఎక్స్‌రేలు, కేన్సరుకు వైద్యం చేసే ఎక్స్‌రేలు కేన్సరు వ్యాధే కలిగించవచ్చు.
* ఎక్స్‌రేలవల్ల కంటి శుక్లం, పిల్లలు కలగకపోవుట, పుట్టకతో అంగవైకల్యం రావచ్చు.
* ఎక్స్‌రే విభాగాలలో పనిచేసే సిబ్బందికి, డాక్టర్లకు, శాస్తవ్రేత్తలకు ఎక్స్‌రేల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరగవచ్చు.

రోగులపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు:
* ఏ రోగికైనా ఎక్స్‌రేలు ఉపయోగించకుండా రోగాన్ని నిర్ణయించగలిగినపుడు ఎక్స్‌రేలు తీయరాదు.
* గర్భవతులకు ఎక్స్‌రే తీయుట చాలావరకు మానాలి.
* మర్మాంగాలపై ఎక్స్‌రేలు పడకుండా వీలున్నంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. క్రీ.శ.1895 ప్రాంతంలో ఎక్స్‌రేలు కనిపెట్టినపుడు ప్రమాదాల గురించి తెలియక ఎక్స్‌రేలను బాగా వాడారట! ఈమధ్యకాలంలో వైద్యరంగంలో వచ్చిన వ్యాపార దృష్టి రోగులలో ఎక్కువగా ఎక్స్‌రేల పిచ్చి, ఎక్స్‌రేల అనవసరపు వాడకానికి కారణమట!

No comments:

Post a Comment