చాలా మంది నడివయస్సు స్త్రీలలో రక్తస్రావము ఒక సాధారణ సమస్య . నెలసరి 4-5 రోజులు ఏబాధాలేకుండ స్రవించే ఋతుస్రావము సహజమైనది . అది నొప్పితోనో , క్రమము లేకుండానో , అధికంగానో ఎక్కువరోజులు ఉంటే అది వ్యాధి లక్షణము . అందులొ ఎక్కువ రోజులు స్రవిస్తూ ... మనిషి నీరషం పడుతుంటే బహు కారణాలలో గర్భాశయం లో గడ్డలు (uterine fibroids) ఒక కారణం కావచ్చును .
గర్భాశయంలో ఏర్పడే గడ్డలను యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు. యుటిరైన్ ఫైబ్రా యిడ్స్‌తో 15నుంచి 20శాతం బాధపడు తున్నారు.సాధారణంగా గర్భాశయ గడ్డలు 35 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స అనేది ఫైబ్రాయిడ్ సైజుని బట్టి అది ఏర్పడిన స్థానాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. సంతానం కలుగని దంపతుల్లో స్త్రీలకు సంబంధించిన కారణాల్లో యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ ముఖ్యకారణంగా ఉంటున్నది. సాధారణంగా ఈ వ్యాధి పిల్లలు కనే వయసులో ఉన్న వారిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
గర్భాశయ గడ్డలు గర్భాశయ గోడలను ఆధారం చేసుకుని ఎదుగుతాయి. కేవలం గర్భాశయ కండరాల సహాయంతో వృద్ధి చెందుతూ, మిల్లీమీటర్ నుంచి సెంటీమీటర్ వరకూ పెరుగుతాయి. గర్భాశయ రక్తనాళాల నుంచి వీటి ఎదుగుదల ఆరంభమవుతుంది. మృదుకణ జాలంతో నిర్మితమై గులాబీ వర్ణంలో ఉంటాయి. వీటిని చుట్టూ కప్పి ఉంచి పొరల వంటి భాగం ఏమీ ఉండదు. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఒకటే ఉండి పరిమాణంలో పెద్దది ఉండొచ్చు. లేదాచిన్నచిన్న గడ్డల రూపంలో ఒకటి కంటే ఎక్కువగా కలిసి ఏర్పడవచ్చు.
ఈవిధంగా ఏర్పడే గడ్డలు గర్భాశయ కుహరాన్ని శిథిలం చేస్తాయి. ఎందువల్ల ఫైబ్రాయిడ్స్ ఉన్నవారిలో సంతానం కలుగదంటే, సాధారణంగా గర్భాశయ గడ్డలు 4రకాలుగా ఉంటాయి. వాటిలో కార్నుయల్ ఫైబ్రాయిడ్‌గా పిలువబడే గడ్డల కారణంగా గర్భాశయ అంచుకు ట్యూబ్స్‌ను కలిసే భాగాన్ని మూసివేస్తాయి. అలాగే ఫలదీకరణ చెందిన అండం ఫైబ్రాయిడ్స్ పై (సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్)న పొదిగినట్లయితే ఎండోమెట్రియం కుదించుకుపోతుంది. తద్వారా గర్భాశయంలో ఎదగాల్సిన పిండానికి పోషణ సరిగ్గా అందకపోవడం వల్ల గర్భం దాల్చిన మొదటిరోజుల్లోనే అబార్షన్ అయి పోయే అవకాశాలు ఉంటాయి.
కారణాలు :
- ఈస్ట్రోజన్ హార్మోన్ల విడుదలలో హెచ్చుతగ్గులు.
- అధిక బరువు, ఊబకాయం.
-ఋతుచక్రం పది సంవత్సరాలకే ప్రారంభం కావడం.
- వంశపారపర్యంగా...
లక్షణాలు:
- రక్తస్రావం అధికమవడం, ఋతుస్రావం ఎక్కువ రోజులు ఉండటం, రక్తం ముద్దలుగా(బ్లడ్ క్లాట్స్) పడటం జరుగుతుంది.
- ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.
- మలాశయం మీద ఒత్తిడి వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.
- పెల్విక్ భాగంలో ఒత్తిడి పెరగటం వలన ఉదరమునకు కింది భాగములో బరువుగా అనిపిస్తుంది. నొప్పి ఉంటుంది.
- నడుము భాగము పెరగటం, ఉదరము రూపు మారిపోవడం జరుగుతుంది.
- సంతానలేమి ఉంటుంది.
-మత్తుగా ఉండటం, శ్వాసలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.
- ఋతుస్రావం ఆగిపోవడం లేక ఋతుస్రావం ఎక్కువ కావడం కనిపిస్తుంది.
-అధిక మెతాదులో రక్తస్రావం, తీవ్రమైన పొత్తికడుపునొప్పి వల్ల ఎమర్జెన్సీ చికిత్స అవసరమవుతుంది.
-. ఫైబ్రాయిడ్స్ వలన రక్తహీనత, ఆయాసం, గుండెదడ మొదలైన లక్షణాలు కూడా ఉంటాయి.
నిర్ధారణ:
ఫిజికల్ ఎగ్జా/మినేషన్‌తో పాటు పెల్విక్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా ఫైబ్రాయిడ్స్‌ను గుర్తించవచ్చు.
ట్రాన్స్‌వెజైనల్, పెల్విక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా గర్భాశయంలో ఏర్పడే కణితుల సంఖ్యను, సైజును, ఆకారాన్ని నిర్ధారించుకోవచ్చు.
ఎండోమెట్రియల్ బయాప్సీ : ఇందులో గర్భాశయం నుంచి కణాలను తీసుకొని పరిశీలించడం జరుగుతుంది. సర్వైకల్ ద్వారా చిన్న ఇనుస్ట్రుమెంట్‌ను ప్రవేశపెట్టి కణాలు సేకరిస్తారు. బయాప్సీ ద్వారా ఫైబ్రాయిడ్స్‌ను నిర్ధారించుకోవచ్చు.
హిస్టరోస్కోపి : చిన్న ఫైబర్ ఆప్టిక్ కెమెరాను సెర్విక్స్ ద్వారా ప్రవేశపెట్టి గర్భాశయంను పరిశీలించడం జరుగుతుంది.
హిస్టరోసాల్ఫింజోగ్రఫీ : లోపలి నిర్మాణాలను పరిశీలించడానికి ఒకరకమైన రంగును గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్‌లోకి ప్రవేశపెట్టి ఎక్స్‌రే తీయడం జరుగుతుంది.
లాప్రోస్కోపీ: ఫైబర్ఆప్టిక్ కెమెరాను ఉదరంలోకి ప్రవేశపెట్టి లోపలి ఉన్న భాగాలను పరిశీలించడం జరుగుతుంది.
చికిత్స:
ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా గర్భాశయ స్థానం, సైజు తెలుసుకోవచ్చు. ఫైబ్రాయిడ్స్‌ని శస్త్రచికిత్స ద్వారా తొలగించినప్పటికీ కొన్ని సందర్భాలలో మరలా ఫైబ్రాయిడ్స్ ఏర్పడుతున్నా వారూ లేక పోలేదు. ఫైబ్రాయిడ్స్ సైజులో పెద్దవిగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. గర్భాశయగడ్డలు మిల్లీమీటర్ సైజులో ఉన్నప్పుడు ఔషధాల ద్వారా కరిగించవచ్చు.ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ వచ్చేఅవకాశం ఉంటుంది. కానీ తరుచుగా అబార్షన్ అయిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఒక వేళ గర్భం నిలబడినప్పటికీ కొన్ని సార్లు పెరుగుతున్న గర్భంతో పాటు ఫైబ్రాయిడ్స్ కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.
ఫైబ్రాయిడ్స్ కి ఏ వైద్య విధానములోను మంచి చికిత్స లేదు . ఈ వ్యాది క్యాన్‌సర్ కాదు . క్యాన్‌సర్ గా మారె చాన్‌సు లెదు . ఫైబ్రాయిడలున్న స్త్రీలు ఎక్కువమంది ఏ బాధలు లేకుండా జీవితం గడిచిపోతుంది . కొద్దిమందికే పైన చెప్పిన బాధలు కలుగుతూ ఉంటాయి . బాధల నివారణ కోసం వాడిన మందులు ఫైబ్రాయిడ్స్ ని నయము చేయలేవు .
- ఓరల్ కాంట్రాసెప్టివ్స్ లేదా ప్రొగెస్టిన్స్ బహిస్ట బ్లీడింగ్ ను తగ్గించేందుకు ఉపయోగపడతాయి . ఫైబ్రాయిడ్స్ సైజు ను తగ్గించలేవు . NSAIDS నొప్పిని , రక్తస్రావాన్ని తగ్గిస్తాయి కాని ఫైబ్రాయిడ్ సైజు ను తగ్గించలేవు .
- Gn-RH agonists : గొనడొట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ ... ఎస్ట్రోజన్ ... ప్రొజెస్ట్రోన్ ల తయారీని రెగ్యులేట్ చేస్తుంది కావున దాని lupron(Luprolide) , synarel(Nefarelin) వంటివి వాడడం వలన స్ట్రీ హాన్మోనులు తయారి తగ్గి ఫైబ్రాయిడ్ సైజు తగ్గే అవకాశము ఉంది .
- Androgens : ఇవి మేల్ హార్మోన్స్ సంబంధించిన ... Danazole , testosterone వాడడం వలన ఫైబ్రాయిడ్ సైజు తగ్గే అవకాశము ఉంది . దానికున్న సైడు ఎఫెక్ట్స్ ...weight gain , acne , unwanted hair growth , deeper voice మున్నగునవి ఉంటాయి .
- Hysterectomy : గర్భసంచిని తొలగించడం
- Myomectomy : abdominal , laparoscopic , hysteroscopic Myomectomy -- గర్భాశయ గడ్డలను తొలగించడం . రకరకాల పద్దతులున్నాయి .
ఆయుర్వేదం లో చికిత్స :
గర్భాశయ గడ్డలుచిన్నవిగా ఉండి ఇతర వ్యాధులు అనుబంధంగా లేనపుడు ఆయుర్వేద చికిత్సద్వారా నయం చేయవచ్చు. కొంతమందిలో సర్జరీ చేసినప్పటికీ మరలా ఫైబ్రాయిడ్స్ ఏర్పడినవారిలో కూడా ఆయుర్వేద చికిత్స ద్వారా నివారించవచ్చు.కలబంద గుజ్జును ఆవునెయ్యితో కలిపి 10గ్రాముల మందును రోజుకు రెండుసార్లు తీసుకోండి. సప్తవింశతి గుగ్గులును పూటకు రెండుచొప్పున రెండుసార్లు భోజనం తర్వాత సేవించండి.దేవకాంచనపు పువ్వుల చూర్ణం, శొంఠి చూర్ణం రోజుకు రెండు పర్యాయాలు 5గ్రాముల చొప్పున తేనెతో కలిపి సేవించండి.మజ్జిగ, నీరు ఎక్కువగా సేవించాల్సి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ చికిత్స వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సొంతవైద్యం ఇతరత్రా సమస్యలు తలెత్తవచ్చు.
హోమియో చికిత్స:
గర్భాశయంలో కణితి ఉండి లక్షణాలు లేకపోయినా, సైజు తక్కువగా ఉన్నా, మెనోపాజ్ దశలో ఉన్నా చికిత్స అవసరం లేదు. ఫైబ్రాయిడ్స్ వల్ల రక్తస్రావం అవుతూ ఉన్నప్పుడు గర్భాశయంను డీఅండ్‌సీ పద్ధతి ద్వారా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్‌కి సంబంధించినవి కాకపోతే హార్మోనల్ మెడికేషన్ ద్వారా రక్తస్రావాన్ని అరికట్టవచ్చు.
హోమియో మందులు:కాల్కేరియా కార్బ్ : గర్భాశయంలో కణితులు, ఋతుస్రావం త్వరగా రావడం, ఎక్కువ రోజులు ఉండటం, రక్తహీనత, తలనొప్పి, ఉదరం కింది భాగంలో నొప్పి, వికారం, వాంతులు, తల, మెడపైన చెమటలు, మలబద్ధకం తదితర లక్షణాలు ఉన్నవారికి ఈ మందు బాగా ఉపకరిస్తుంది. కాల్కేరియా ఫ్లోర్ : ఋతుస్రావం ఎక్కువగా కావడం, నిద్రలేమి, మలబద్ధకం, నడుం నొప్పి, డిప్రెషన్, ఉదరం కింది భాగంలో నొప్పి, తొడ భాగంలో నొప్పి, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సమస్య ఎక్కువ కావడం వంటి లక్షణాలు ఉన్న వారికి ఇది దివ్యౌషధం.
సెపియా : ఋతుస్రావం త్వరగా రావడం, కొన్నిసార్లు ఆలస్యంగా రావడం, ఋతుచక్రానికి, ఋతుచక్రానికి మధ్యలో రావడం, శ్వాసలో ఇబ్బంది, నాభి వరకు నొప్పి, వాసనను భరించలేకపోవడం, ఏపనీ చేయాలనిపించకపోవడం, జుట్టు రాలడం, తలనొప్పి, పచ్చళ్లు, స్వీట్లను ఇష్టపడుతుండటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు ఉపయోగించవచ్చు.
ఫాస్పరస్ : గర్భాశయంలో కణితులు, తరచుగా రక్తస్రావం కావడం, గర్భాశయ క్యాన్సర్, ఎడమ వైపు పడుకుంటే నొప్పి ఎక్కువ కావడం, చల్లని నీరు తాగాలని అనిపించడం, ఐస్‌క్రీమ్స్, ఉప్పును ఇష్టపడటం వంటి లక్షణాలకు ఈ మందు వాడవచ్చు.
క్రొటాలస్ : గర్భాశయంలో కణితులు, రక్తస్రావం, వాసన ఉండటం, రక్తహీనత, ఉదరం కింది భాగంలో నొప్పి, చర్మం పొడి బారడం, కుడి వైపున నొప్పి ఎక్కువగా ఉండటం, సాయంత్రం, ఉదయం పూట, పడుకుని లేచిన తరువాత సమస్యలు ఎక్కువ కావడం వంటి లక్షణాలు ఉన్న వారు వాడదగిన మందు.
థలాస్పిబర్సా: గర్భాశయంలో నొప్పి, అధిక రక్తస్రావం, వాంతులు, రక్తం ముద్దలుగా పడటం, ఋతుస్రావానికి ముందు తెల్లని స్రావం కావడం, వాసన ఉండటం, మూత్రాశయ సమస్యలు వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు వాడవచ్చు.
టర్‌బెంథిన : గర్భాశయ కణితులకు వాడదగిన ముఖ్యమైన మందు. అధిక రక్తస్రావం, మూత్రాశయ సమస్యలు, మూత్రంలో రక్తం, జీర్ణాశయ సమస్యలు, విరేచనాలు రక్తంతో రావడం, సంగా వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన మందు.
No comments:
Post a Comment