మన శరీరానికి అవసరమైన అతిముఖ్యమైన ఖనిజం కాల్షియం. ఎముకల పటిష్టత, దంతముల ఆరోగ్యం కాల్షియంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా కండర సంకోచవ్యాకోచాలకి కాల్షియం అవసరం. కండరాల కదలికలపైనే అవయవ కదలికలు ఆధారపడి ఉన్నాయి. మెన్సస్ సమయంలో వచ్చే అనేక రుగ్మతలను కాల్షియం తగ్గించగలదు. ఎముకలలో కాల్షియం పరిమాణం తగ్గితే ఎముకల బలం తగ్గుతుంది. అనేక రకాల నొప్పులకు ఇదినాంది అవుతుంది. ఆస్టియోపోరోసిస్‌కు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. కాల్షియం తక్కువైతే హైబి.పికి దారితీస్తుంది. పిల్లల ఎదుగుదల సక్రమంగా జరగాలంటే కాల్షియం తగినంత పరిమాణంలో తీసుకోవాలి. గర్భవతులకు కాల్షియం టాబ్లెట్స్ రూపంలో ఇస్తుంటారు. అందువల్ల మనం తినే ఆహారంలో కాల్షియం బాగా లభించే పదార్థాలు సమకూర్చుకోవాలి.
కాల్షియమ్ (Calcium) ఒక మెత్తని ఊదారంగు క్షార మృత్తిక లోహము. విస్తృత ఆవర్తన పట్టికలో దీని సంకేతము Ca. దీని పరమాణు సంఖ్య 20 మరియు పరమాణు భారము 40.078 గ్రా/మోల్. ప్రకృతిలో అత్యధికంగా దొరికే ఐదవ మూలకము. కాల్షియమ్ జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా ఎముకలలో ఉంటుంది.
కాల్షియం అధికంగా లభించే పదార్థాలు : కొన్ని పదార్థాలలో కాల్షియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అవి ఏమిటంటే---
సోయాచిక్కుళ్ళు, కొత్తమీర, మెంతిఆకు, బెల్లం, గేదెపాలు, నువ్వులు, పిస్తా, వాల్‌నట్, రాగులు, పొట్టుతో కల మినుములు,ఉలవలు, తోటకూర, తమలపాకులు, కారట్, కాలీఫ్లవర్, కరివేపాకు, పుదీనా, పసుపు, పొన్నగంటికూర, ధనియాలు, జీలకఱ్ఱ, చేపలు, జున్ను, గ్రుడ్లు,
చిలకడదుంపలు, ఎండుకొబ్బరి, బాదం............... వంటివి.
వేటిలో ఎంతెంత కొన్ని పదార్ధములు : 110 గ్రాములకు అభించే అత్యధిక కాల్షియం .. మి.గ్రా . లలో.--
- రాగులు --------------------------344 మి.గ్రా.
- రజ్మా ----------------------------260 మి.గ్రా.
- కరివేప --------------------------830 మి.గ్రా ,
- క్యారట్ --------------------------80 మి.గ్రా. ,
- గోరుచిక్కుడు --------------------130 మి.గ్రా . ,
- నువ్వులు ----------------------1450 మి.గ్రా,
- వాము -------------------------1525 మి.గ్రా.,
- వెలగపండు ---------------------130 మి,గ్రా. ,
- ఆవుపాలపొడి ------------------1370 మి.గ్రా.,
- చెరకు బెల్లము ------------------380 మి.గ్రా. ,
కాల్షియం గూర్చి తీసుకోవలసిన జాగ్రత్తలు :
- కాఫీ, ఎక్కువగా ఉప్పు, మాంసం, ధూమపానం, మద్యం తీసుకుంటే కాల్షియం నిల్వలు తగ్గుతాయి.
- పీచు పదార్థాలు, జంతుమాంసకృత్తులు వంటివి కాల్షియంను శరీరం గ్రహించే శక్తిని తగ్గిస్తాయి.
- ఆకుకూరలలోని అగ్జాలిక్ ఆమ్లం శరీరానికి కాల్షియంను అందనివ్వదు.
- శారీరక శ్రమ లేకపోవడం, కాల్షియం, ఇన్‌టేక్‌త్ సంబంధం కల్గి ఉంటుంది.
అవసరం ఉన్నంతవరకు మా త్రమే టాబ్లట్లని వినియోగించడం మంచిది. అయితే ఒక్కోసారి సైడ్ ఎఫెక్టులు రావచ్చు.
కడుపుబ్బరం, వికా రం, మలబద్దకం, విరేచనాలు ఇలా పలు సమస్యలు వేధించవచ్చు. ఖాళీ కడుపుతో ఎప్పుడూ కాల్షియం తీసు కోవటం మంచిది కాదు. అది మరో పరిణామానికి దారి తీయచ్చు.
నీరసంగా ఉంది కదా అని వరుసగా రెండు మూడు ట్యాబ్లట్లు తీసుకున్నా ప్రమాదమే. ఎందు కంటే రోజుకి మన శరీరం 1000 నుండి 1500 మిల్లీ గ్రాములు మాత్రమే అవ సరం అవుతుంది. అదనపు కాల్షియం మీలో చేరితే అది మూత్ర పిండాలలో రాళ్ల రూపంగా సమస్యగా మారొచ్చు. విటమిన్ డి తక్కువగా ఉండటం వల్లే మీ లో కాల్షియం తక్కువగా ఉండటానికి కారణం కావచ్చు.
కాల్షియం లోపం కారణంగా వచ్చే సమస్యలు :కాల్షియం లోపం కారణంగా సమస్యలు ఎదుర్కొనే వారిని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎముకుల బలహీనత -- ఆస్టియోఫొరోసిస్ ముఖ్యమైంది . చిన్నపిల్లల్లో కనిపించే జాయింట్ పెయిన్స్, మహిళల్లో కనిపించే కీళ్లనొప్పులు, 40 దాటిన వారిలో తరచు కనిపించే ఎముకలు, కండరాల నొప్పులకు కాల్షియం లోపమే కారణం అంటున్నారు నిపుణులు. ఎముకలు క్షీణించడానికి కూడా ప్రధానం కారణం కాల్షియం లోపమే. అందుకే 40 ఏళ్లు దాటిన మహిళలు నిపుణుల సూచన మేరకు కాల్షియం మాత్రలు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ తలెత్తవు. నిజానికి మనం నిత్య జీవితంతో తీసుకొనే ఆహార పదార్థాల్లో కాల్షియం పుష్కలంగా ఉండే పదార్థాలు అనేకం. చిన్నతనం నుంచీ మనం తినే తిండిలో ఆ ఆహారపదార్థాలను తగినంతగా తీసుకోగలిగితే ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవచ్చు.
కాల్సియం వంటపట్టాలంటే : రోజుకు కనీసం 1000 నుండి 1300 మి.గ్రా. కాల్షియం తీసుకున్నాప్పుడే ఆరోగ్యం గా ఉంటారు . కాల్షియం ఎముకల బలం , ఎముకల ఆరోగ్యానికి , దంతాల ఆరోగ్యానికీ అవసరము . అయితే కాల్షియం తీసుకుంటున్నంతమాత్రాన ఎముకల బలహీనత రాకుండా ఉండదు . తీసుకునే కాల్షియం వంటబట్టాలంటే సాయంత్రపు ఎండలో వ్యాయామము చేయాలి . కాల్షియం శరీరము గ్రహింఛేందుకు విటమిన్ 'D' అవసరము ఇది ఎండలో వ్యాయమము చేయడం ద్వారా వస్తుంది. విట్మిన్ 'D' లేకుండా కాల్సియం మాత్రలు అదనముగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి.
No comments:
Post a Comment