ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నపుంసకత్వం (సెక్స్ సమస్య), Male impotence- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
నపుంసకత్వం పురుషులలో అంగస్తంభన లోపము వలన కలిగే వ్యాధి. యుక్తవయసులో ఎలాంటి అనారోగ్య లక్షణములు లేకుండా రతి కార్యములో విఫలమవడము లేదా అంగము పూర్తిగా స్థంభించకపోవడము లేదా పాక్షికముగా స్థంభించడము. . ఇది పలు కారణాల వలన కలుగవచ్చు. ఈ రుగ్మతను వ్యాధిగా గుర్తించి చికిత్స కోసము ప్రయత్నించడము ఇస్లామీయ వైద్యులు- కాలములో మొదటగా జరిగినది. వీరు ఈ వ్యాధినివారణ కొరకు మూలికా వైద్యము చేసేవారు. ఆధునిక యుగములో 1920 లో డాక్టర్ జాన్.ఆర్.బ్రింక్లే సరికొత్త పరీక్షా విధానమును మరియు చికిత్సా పద్దతిని కనుగొన్నారు.
నపుంసకుడు---స్త్రీ మరియు పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని నపుంసకులు అంటారు. వీరిని వ్యవహారంలో హిజ్రా, కొజ్జా , గాండు, పేడి అని కూడా పిలుస్తారు. పుట్టుకతోనే ఈ లక్షణాలున్న వారు కొందరైతే , తమ ఇష్టానుసారం ఇలా మారేవారు కూడా వున్నారు. వీరికి సామాజిక ఆదరణ లేకపోడంతో సమూహాలుగా జీవిస్తారు. భిక్షాటన మరియు వ్యభిచారం వీరి ప్రధాన వృత్తులు.
- నిర్ధారణ పరీక్షలు:
* డూప్లెక్స్ అల్ట్రాసౌండ్
* పెనైల్ నెర్వస్ ఫంక్షన్స్
* నొక్టర్నల్ పెనైల్ టుమెసిన్ (ఎన్.పి.టి)
* పెనైల్ బయోథీసియోమెట్రి
* పెనైల్ ఆంజియోగ్రామ్
* డైనమిక్ ఇన్ఫ్యుజన్ కావెర్నొసొమెట్రి
* కొర్పస్ కావెర్నొసొమెట్రి
* డిజిటల్ సబ్ట్రాక్టర్ ఆంజియోగ్రఫి
* మాగ్నటిక్ రెజొనెన్స్ ఆంజియోగ్రఫి (ఎం.ఆర్.ఎ)
- కారణాలు:
మగవారిలో నపుంసకత్వం సమస్య ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. సంభోగ సమయంలో మగవారిలో అంగస్తంభన జరగకపోవడం, కొన్నిసార్లు అంగస్తంభన జరిగినా వీర్యస్కలనం జరగకపోవడం వంటివి సాధారణంగా తలెత్తే సమస్యలు. ఈ సమస్య తలెత్తడానికి ఒక్క శారీరక అనారోగ్యాలే కాదు మానసిక పరిస్థితులు కూడా కారణమవుతాయి. అంగస్తంభన, వీర్యస్కలనం జరగకపోవడం వంటి సమస్యలు అప్పుడప్పుడు తలెత్తితే దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉండదు. అయితే తరచు ఈ పరిస్థితి ఏర్పడితే అది పూర్తిగా నపుంసకత్వానికి దారితీసే అవకాశం ఉంది.
* మత్తుమందులు
* హార్మోనుల అసతుల్యత
* వంశ పారంపర్యత
* జీవన విధానము
* వృద్దాప్యము
- నపుంసకత్వం రావడానికి భావోద్రేకాలు కూడా కారణాలని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా శారీరక సమస్యలే ఇది ఏర్పడేందుకు కారణమవుతాయి.
- మధుమేహం, హైపర్‌టెన్షన్ ఉన్నవారిలో ఈ సమస్య ప్రధానంగా కనపడుతుంది.
- హార్మోన్ లోపాలు(పిట్యుటరీ గ్రంధలో కణితి, హార్మోన్‌ల అసమతుల్యత).
- రక్తప్రసరణ లోపాలు(నరాల సమస్య, హైపర్‌టెన్షన్, మర్మాంగానికి రక్తప్రసరణ తక్కువగా జరగడం).
- మానసిక కారణాలు కూడా నపుంసకత్వం ఏర్పడడానికి దారితీస్తాయి. మానసిక ఒత్తిడి, మానసికంగా తలెత్తే సమస్యలు(క్లినికల్ డిప్రెషన్, సిజోఫ్రెనియా, మానసిక ఆందోళన, వ్యక్తిత్వంలో లోపాలు లేదా భయాలు. మానసిక సమస్యలు, నైరాశ్య భావనలు వంటివి.
- వయసు పెరిగే కొద్ది లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది.
- జీవనశైలి వల్ల కూడా నపుంసకత్వం తలెత్తే అవకాశం చాలా ఉంది. మద్యం, స్థూలకాయం, దూమపానం.
-శారీరక అలసట :కొన్ని వైద్యపరమైన కారణాలు కూడా నపుంసకత్వం ఏర్పడేందుకు దారితీస్తాయి. హైబ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించేందుకు వాడే కొన్ని మందుల వల్ల కూడా లైంగిక సామర్ధ్యం తగ్గిపోవచ్చు. కేంద్ర నాడీ వ్యవస్థను చక్కదిద్దడానికి వాడే కొన్ని మందుల వల్ల రక్తప్రసరణలో లోపాలకు దారితీయవచ్చు. కొన్ని సందర్భాలలో నిర్వహించే శస్త్ర చికిత్సల కారణంగా కూడా నపుంసకత్వ సమస్యలు తలెత్తవచ్చు.
కొన్ని సార్లు ఆపరేషన్లలో కొన్ని అవయవాలను తొలగించాల్సి రావచ్చు. అవి అంగస్తంభనకు దోహదపడే అవయవాలు కావచ్చు. ఒక్కోసారి ఈ శస్త్ర చికిత్సల కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతినడమే కాక రక్తప్రసరణలో ఆటంకాలు కూడా తలెత్తవచ్చు. ప్రొస్టేట్ గ్రంధిని పూర్తిగా తొలగించాల్సి వచ్చినపుడు కాని దానికి రేడియేషన్ థెరపి నిర్వహించినపుడు కాని నపుంసకత్వం రావడం సర్వ సహజం. ఇవి రెండు కూడా ప్రొస్టేట్ కేన్సర్‌కు సంబంధించిన చికిత్స సందర్భంగా జరిగేవి.
- గుర్తించడం ఎలా?
ముందుగా వైద్యుడిని సంప్రదిస్తే రోగికి చెందిన రక్తం, మూత్ర నమూనాలను పరీక్షలకు పంపుతారు. లైంగిక వ్యాధులు వంటివి ఏవైనా ఉన్నదీ లేనిదీ ఈ పరీక్షల ద్వారా నిర్ధారణ జరుగుతుంది. ఇవిగాక మరికొన్ని వైద్య పరీక్షలను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. రోగికి సంబంధించిన పూర్తి మెడికల్ హిస్టరీని అధ్యయనం చేయడంతోపాటు శారీరక పరీక్షలు చేసిన తర్వాత వాటి ఆధారంగా చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.
- చికిత్స:
- మందుల ద్వారా చికిత్స
- మానసిక చికిత్స
- శస్త్ర చికిత్స
పూర్తిగా నపుంషకుడు అయితే నయము చేయడము కష్టము . వీరిలో పుట్టుకతోనే హార్మోనుల లోపము వలన అవయవాలు ఏర్పడవు . ఆధునిక కాలములో సెక్ష్ మార్పిడి విధానములో కొన్ని ఫలితాలు పొందుతున్నారు .
అంగము పూర్తిగా స్థంభించకపోవడము లేదా పాక్షికముగా స్థంభించడము : దీనిని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు (E.D- erectile dysfunction) ... అంగస్తంభన సమస్యలు
శీఘ్రష్ఖలనము సమస్య అయితే --- ఇక్కడ చూడండి --శీష్రుస్ఖలనం
No comments:
Post a Comment