Wednesday, 16 March 2016

Defects in Ovary-fertility - అండాశయంలో లోపాలు-సంతాన సాఫల్యము


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Defects in Ovary fertility,అండాశయంలో లోపాలు-సంతాన సాఫల్యము 
- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

పుట్టేసమయానికే ఆడ శిశువులో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే విషయం నిర్దేషితమై ఉంటుంది. గర్భాశయంలో ఎన్ని అండాలు ఉండాలో అన్ని ఉంటాయి. 20 వారాల పిండదశలో ఉన్నపుడే ఆడ శిశువు పిండంలో దాదాపు 60 లక్షల నుంచి 70 లక్షల ప్రాథమిక అండాలు ఏర్పడుతాయి. కానీ పుట్టుక సమయానికి వాటి సంఖ్య 7లక్షల నుంచి 2 లక్షల వరకు మిగులుతాయి. ఇవి ప్రతి నెల విడుదలవుతూ ఆమె గర్భం దాల్చడానికి అవకాశం కల్పిస్తాయి. టీనేజ్ చివరి దశ నుంచి 20 వదశకం ప్రారంభ దశలో ఉన్న మహిళలు గర్భం దాల్చడానికి చాలా అనువైన వయసు. 45 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది.

  • తక్కువ అండాలు ఎందుకు?
అండాశయంలో తక్కువ అండాలు కలిగి ఉండడం వల్ల సంతాన లేమి సమస్యలు రావచ్చు. పిండదశలో ఉన్నపుడు వారిలో అండాశయం ఏర్పడడంలో ఏదైనా లోపం ఏర్పడడం, అండాలు సరిగా అభివృద్ధి చెందకపోవడం. ఇది సాధారణంగా ఎఫ్‌ఎస్‌హెచ్(ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.

  • అండాలు తక్కువగా ఉండడానికి కారణాలు:
వయసు ప్రభావం, కొన్నిసార్లు కారణం తెలియదు, ఫ్రాగిల్ ఎక్స్సిండ్రోమ్ వంటి జన్యుకారణాలు, ఆటో ఇమ్యూన్ సమస్యలు, కీమోథెరపి, రేడియేషన్ లేదా ఏదైనా సర్జరీ జరగడం, ఎండోమెవూటియాసిస్‌కు చేసే లేజర్ చికిత్స వంటి లాటరోజెనిక్ కారణాలు

  • పరీక్షలు:
ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్‌ఎస్‌హెచ్), నెలసరి మొదలైన మూడో రోజున ఎఫ్‌ఎస్‌హెచ్ స్థాయిలు ఎలా ఉన్నాయో పరీక్షించాలి. ఈ పరీక్ష తప్పకుండా నెలసరి రెండో రోజు లేదా మూడోరోజున మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది అండం విడుదలను అంత కచ్చితంగా నిర్ధారించే పరీక్ష కాదు కొన్ని  సార్లు ఎఫ్‌ఎస్‌హెచ్ స్థాయిలు మాములుగా ఉన్నప్పటికీ అండం విడుదల సరిగా ఉండకపోవచ్చు. ఆంట్రల్ ఫోలికిల్ కౌంట్ అల్ట్రాసోనోక్షిగఫీ ద్వారా ఆంట్రల్ ఫోలికిల్ కౌంట్ పరీక్ష చేస్తారు. యాంటిముల్లేరియన్ హార్మోన్ టెస్ట్. ''ఇన్హిబిన్ బి'' బ్లడ్ స్థాయి పరీక్ష మొదలైన పరీక్షల ద్వారా అండం విడుదల తీరును పరీక్షిస్తారు.

  • చికిత్సలు:
డీహెచ్‌ఈఏ- క్రమం తప్పకుండా మైక్రొనైజ్డ్ డిహెచ్‌ఈఏ 25 ఎంజీ వల్ల 35 సంవత్సరాలు పైబడిన మహిళల్లో గర్భస్రావాల రేటు చాలా తగ్గింది. డీహెచ్‌ఈఏ టాబ్లెట్లు 3-4 నెలల పాటు ఇవ్వడం వల్ల అండాశయాల పనితీరు మెరుగైన సందార్భలున్నాయి. అందువల్ల సంతానం కలుగడానికి అవకాశాలు మెరుగవుతాయి. అండం విడుదల సరిగా లేని వారిలో డీహెచ్‌ఈఏ చికిత్స ద్వారా 6-8 వారాలలో వారి అండం విడుదలయ్యే చక్రాన్ని సరిచేయడానికి అవకాశాలు ఉంటాయి. దుష్ప్రభావాలు కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి.

ఐవీఎఫ్ ప్రొటోకాల్‌ను మార్చడం - ఎక్కువ మోతాదులలో గొనడోవూటాపిన్స్ ఇవ్వడం ఐవీఎఫ్ చికిత్స చేస్తున్న సమయాల్లో గ్రోత్ హార్మోన్లు ఇవ్వడం.

దాత నుంచి అండాన్ని స్వీకరించడం--దాతల నుంచి అండాన్ని సేకరించి సంతానాన్ని పొందడం అనే ప్రక్రియ మెనోపాజ్‌కు దగ్గరి వయసున్న మహిళలకు చాలా విజయవంతమైన ప్రక్రియ. కానీ ఇది చిట్టచివరకు అవలంబించాల్సిన ప్రక్రియ. మొదటి ఐవీఎఫ్‌కు వెళ్తున్న వారు మాత్రం వారి అండాలతో సంతానం పొందటానికి ప్రయత్నించడమే మంచిది. కానీ ఐవీఎఫ్‌లు పదేపదే విఫలమవుతున్నపుడు మాత్రం దాత నుంచి అండాన్ని స్వీకరించాల్సిందిగా నిపుణులు సలహా ఇస్తున్నారు. దాతల అండాలతో ప్రయత్నించినపుడు సఫలం కావడానికి 50 శాతం అవకాశాలు ఉంటాయి.

No comments:

Post a Comment