ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సెక్సు పట్ల ఆసక్తి తగ్గిపోవడా నికి కారణాలు ,Causes for decreased interest in sex - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
- భార్యతో సెక్సు పట్ల ఆసక్తి తగ్గిపోవడా నికి ఏ ఇతర కారణాలు న్నాయో నిర్ణయించడం కష్టం. చాలా సందర్భాల్లో భార్య తమకు సహకరించడం లేదనే ఫిర్యాదులు భర్త నుంచి వస్తుంటాయి. ఇలా ఫిర్యాదు చేసే వారు నిజ జీవిత సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం మరచిపోతుంటారు. సమస్యను తమ దృష్టి కోణం నుంచే ఆలోచిస్తుంటారు. అంతే తప్ప భార్య దృష్టి కోణం నుంచి ఆలోచించడం లేదు. ఫలితంగా ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగుతుంటాయి. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగేందుకు ఆ బంధమే ప్రధానం కానప్పటికీ, అది కూడా ఎంతో కీలకమే. ప్రధానంగా బాడీ ఇమేజ్‌కి సంబంధించిన సమస్య ఉన్న వారిలో ఈ విధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తన అందం. సౌష్టవం, ఆకర్ణష శక్తి తగ్టిపోయాయని, చలాకీగా సెక్సుని అనుభవించి, ఆనందించే వయసు దాటిపోయిందనీ - ఈ తరహా నెగిటివ్ ఫీలింగ్స్ ఆమెలో బలంగా ఉన్నాయి. సెక్సు ఆపీల్‌కి సంబంధించిన నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే సెక్సుపరంగా చొరవ ఉండదు. ఎదుటి వ్యక్తి చొరవ ని స్వీకరించక , ఆనందించే సానుకూలత ఉండదు. రెండింటి వల్లా సెక్సు లైఫ్ పేలవంగా మారిపోతుంది.
పురుళ్ళు, పిల్లల పెంపకం బాధ్యతలు, ఇంటి బరువు... ఇవన్నీ మోస్తున్నందు వల్ల ఈ వయసులో స్ర్తీలకి మానసిక వొత్తిడి, శారీరక అలసట ఎక్కువ ఉంటాయి. కనుక ఆమెకి మీరు దినచర్యలో సహాయం, ఆసరా, మానసిక ఊతం కూడా అందించాలి. ఆమె ఆరోగ్యంగా ఉండేలా ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆమెకి ఆనందం కలిగించే పనులు చేస్తూ ఉండాలి(సెక్సు కావలసిన రోజుల్లో మాత్రమే కాకుండా నిరంతర ప్రాతిపదిక మీద). మీకు ఆమెలో ఆకర్షణీయమైన అంశాలు ఏమున్నా వాటిని మెచ్చుకోవడానికి సందేహించకండి. మీరు మీపట్ల కూడా శ్రద్ధ వహించి ఎల్లప్పుడూ ట్రిమ్‌గా, నీట్‌గా, హుందాగా ఉండటం అలవరచుకోండి. పిల్లల గురించి, ఇంటి గురించి శ్రద్ధ వహించండి. ప్రౌఢ స్ర్తీలు బాధ్యతాపరడైన భర్తని చాలా అభి మానిస్తారు.-అలాంటప్పుడు దంపతులిద్దరూ స్థిమితంగా చర్చించుకుని, ఒకరి అవసరాలకు అనుగుణంగా ఒకరు సర్దుబాట్లు చూసుకోవాలి. మీరు కొంత త్యాగం చెయ్యాలి. ఆమె మరికొంత ముందుకొచ్చి మీ అవసరాలు తీర్చాలి. ఒకరి ఇష్టాలను, అఇష్టాలను ఒకరికి తెలియ పరుచుకునే స్వేచ్ఛ ఇద్దరికీ ఉండాలి. వాటిని రెండవవారు ఈసడించుకోకుండా విని అర్థం చేసుకోవాలి. ఆ అభిప్రాయాలను గౌరవించి వాటికి అనుగుణంగా సర్దుకోవాలి. కోరికలు అందరిలోనూ ఒకే రకంగా ఉండకపోవచ్చు. చిన్నప్పుడు వారు పెరిగిన వాతావరణం, చుట్టూ ఉండే పరిస్థితులు ఇందుకు కారణం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే
దంపతులు మనస్సు విప్పి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఒకరికొకరు మనస్సు విప్పి మాట్లాడుకుంటే ఈ విధమైన సమస్యలు తలెత్తవు.
- ఇంట్లో చిన్న పిల్లలు ఉండడం, అత్తామామలతో కలసి ఉండడం వంటి కారణాలతో భార్యకు ఆ విషయంలో రకరకాల పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నింటినీ మగవారు దృష్టిలో ఉంచుకోవాలి. కేవలం ఈ ఒక్క కారణంతో జీవితాన్ని కలహాల కాపురంగా చేసుకోవడం తగదు. ఒకరికొకరు సర్దుబాటు ధోరణితో వ్యవహరించుకోవడం వల్ల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మానసిక, శారీరక పరమైన సమస్యలు కూడా ఇందుకు కారణం కావచ్చు. అలాంటి సందర్భాల్లో డాక్టర్ సలహా తీసుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది. వివిధ రకాల ఒత్తిళ్ళకు లోనుకావడం మహిళల్లో అధికంగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళలే ఈ విధమైన ఒత్తిళ్ళకు అధికంగా లోనవుతుంటారు. ఈ విషయాలను దృష్టిలోకి తీసుకుంటే ఫలితం ఉంటుంది. శారీరక సమస్యలు ఉన్న సందర్భాల్లో కూడా మహిళలు ఆ విషయంలో ఆసక్తి చూపడం తక్కువే. పురుషులతో పోలిస్తే ఈ విధమైన సమస్యలు కూడా మహిళల్లోనే అధికం. వారి శరీర నిర్మాణం కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పవచ్చు.
No comments:
Post a Comment