ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి ఇష్టమైన ఆట క్రికెట్. ఇతర ఆటగాళ్లలాగనే క్రికెట్‌లో కూడా గాయాలవుతూనే ఉంటాయి. ఇదే వృత్తిని స్వీకరించిన ఆటగాళ్లు ఎక్కువ శిక్షణకి, ఆటకు సమయాన్ని కేటాయించడంతో రకరకాల గాయాలయ్యే అవకాశాలున్నాయి. క్రికెట్‌లో గాయాలు ఎవరికైనా కావచ్చు. బౌలింగ్, బ్యాంటింగ్, ఫీల్డింగ్ చేసేవాళ్లేవరైనా అలాగే గాయాలు శరీరంలో ఏప్రాంతంలోనేనా జరగవచ్చు. జగవల్ శ్రీనాధ్, కుంబ్లే, సచిన్, సెహ్వాగ్, గంభీర్ వంటి వాళ్లందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు గాయాలైన వాళ్లే. గాయాలు ఎక్కువైన కొద్ది ఆటలో పాల్గొనటానికి ఆటంకాలు ఎక్కువవుతున్నాయి.
క్రికెట్‌లో సాధారణంగా అయ్యే గాయాల గురించి మాట్లాడుకుందాం. అలా మోకాళ్లు, చేతులు లాంటి వాటికి ఎంత రక్షణ ఇచ్చినా తల, కళ్లు, వేళ్లకి గాయాలవుతునే ఉంటాయి.క్రికెట్‌లో సాధారణంగా అయ్యే గాయాల బ్యాంటింగ్ చేసే వాళ్లల్లో అవుతుంటే వేళ్లకి గాయాల ఫీల్డింగ్ చేసే వాళ్లకి, వికెట్ కీపర్స్‌కి, బౌర్స్‌కి ఎక్కువగా కలుగుతుంటాయి. వికెట్ల మధ్య పరిగెత్తేటప్పుడు, బౌలింగ్ చేసేటప్పుడు కండరాలు పట్టేయవచ్చు. అలాగే బౌలింగ్ చేసేవాళ్లకి, బ్యాంటింగ్ చేసేవాళ్లకి కూడా భుజాల్లో ఉండే రొటేటర్ కఫ్ దగ్గర టెండాన్స్ లాంటివి దెబ్బతినవచ్చు. అలాగే మోకాళ్ల లిగమెంట్స్ దెబ్బతినవచ్చు. ఫాస్ట్ బౌలర్స్‌కి వెన్ను గాయాలై స్పాండిలోసిస్, స్పాండిలోలిస్థసిస్ లాంటి ఇబ్బందులు కలుగవచ్చు. గట్టిగా బ్యాట్‌తో బాల్‌ను కొడుతూ చేతుల్ని వేగంగా కదిలిస్తుండటంతో మోచేయి కండరాలు దెబ్బతిని, టెండాన్స్ లాంటివి దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఈ ఆటని ఎక్కువగా పగలు ఎండలో ఆడుతుంటారు కాబాట్టి శరీరంలో నీరు బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్‌తో నీరసం, నిస్త్రాణం కలుగుతాయి. ఏ ఆటగాడైనా తను అనుకున్న స్థాయిలో ప్రతిభను చూపించలేకపోతున్నపుడు, స్ఫూర్తి తక్కువైనపుడు, అతృత పెరిగినపుడు, నిద్ర సరిగ్గా పట్టనపుడు ఆకలి తగ్గి దాంతో పాటు బరువు తగ్గుతున్నపుడు శ్వాసకోశానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్ తరచూ కలుగుతున్నపుడు, నాడి కొట్టుకోవడం ఎక్కువైనపుడు ఆటలకి సంబంధించిన వైద్యంలో నిష్ణాతులైన వారిని కలవడం మంచిది.
ఆటల్లో దెబ్బతగిలితే ఏం చేయాలి ఆటల్లో దెబ్బతిన్న ఆటగాడికి రైస్ (ఆర్‌ఐసిఈ) ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్ అంటే రెస్ట్(విశ్రాంతి) రెండు మూడు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ స్థితిలో కావడం పెట్టడం లాంటివి చేయకుడదు. ఐ... అంటే ఐస్ ... ఐస్‌ప్యాక్‌ని దెబ్బతిన్న ప్రాంతం మీద ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచి పదినిమిషాల పాటు కావడంలా పెట్టాలి. ఇలా రెండు గంటల కొకసారి చేయాలి. సి అంటే.. కంప్రెషన్... ఒత్తిడి కలిగించటం ఒత్తిడి కలిగించడం వల్ల వాపు రాకుండా చూసుకోవచ్చు. ఈ అంటే... ఎలివేషన్ దెబ్బతిన్న ప్రాంతం గుండెకన్న ఎత్తులో ఉండేటట్లుగా దిండ్లతో అమర్చుకొవాలి. ఇది రైస్ అంటే.
గాయాలు కలుగకుండా ఎలా చూసుకోవాలి ఆటకి ముందు తరువాత కూడా వార్మప్, కూల్‌డౌన్ జాగ్రత్తాగా చేయాలి. ఇది మరీ ముందు ప్రారంభించకూడదు, మరీ ఎక్కువ చేయకూడదు. వీపు మీద ఒత్తిడి పడకుండా టెక్నిక్‌తో ఆడాలి... మధ్య మధ్యలో నీళ్లు తాగుతుండటం వల్ల డీహైడ్రేషన్ నుంచి కాపాడుకొచ్చు. ఒక వేళ ఏదైనా గాయం అయితే దానికి సరైన చికిత్సను వెంటనే పొందాలి. నొప్పి అనేది మనకి కనిపించని శరీర ప్రాంతాల్లో ఏదైనా ఇబ్బంది కలుగుతున్నపుడు తెలియజేసే లక్షణం. కాబాట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పి సాయంతో వెంటనే ఎక్కడ దెబ్బతగిలింది తెలుసుకుని త్వరగ చికిత్స పొందాలి.
ఇవాళ క్రికెట్ ఎంతో శరీర దారుఢ్యం కావాలి. గాయాలపాలకుండా కపాడుకుంటుండాలి. చికిత్స చేసేవాళ్లకి ఆటగురించి , ఆటగాళ్ల గురించి, వాళ్లకి తగిలే దెబ్బల గురించి పరిపూర్ణంగా తెలిసుండాలి. కోచింగ్ గాయాల పాలుకాకుండా ఎలా ఆడాలో తెలుసుకుని క్రికెట్ దెబ్బలు తగిలి దూరంగా ఉండే రోజులు ఎక్కువ కాకుండా చూసుకుంటే ఆ ఆటలో బాగా రాణిస్తారు.
అజయ్ సింగ్ ఠాకూర్, అర్థోపెడిక్ సర్జన్, ఆలీవ్ ఆసుపత్రి,మెహదీపట్నం,
No comments:
Post a Comment